డిస్నీ స్టూడియోస్ నుండి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ విజువల్ స్టన్నింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’. గతంలో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ది లయన్ కింగ్’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధానపాత్ర అయిన ముఫాసాకు ఆయన డబ్బింగ్ చెప్పారు. గత కొన్ని రోజుల క్రితం రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, షార్ప్ ఎడిటింగ్‍తో బ్రిలియెంట్‌గా వుంది. ముఖ్యంగా మహేష్ బాబు వాయిస్ హైలైట్ అయింది. ముఫాసాకి ఆయన చెప్పిన డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హీరో మహేష్ బాబు స్పెషల్ ట్వీట్ చేశారు. మరో నెల రోజుల్లో ఈ ఫాంటసీ ఫిల్మ్ థియేటర్స్ లోకి వస్తోంది అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కాగా ఇండియాలో ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న తెలుగు, తమిళం, హిందీ ఇంగ్లీష్ సహా ప్రధాన భాషల్లో విడుదల కానుంది. లైవ్-యాక్షన్ ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్ మిళితం చేసి ఫోటోరియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజురీ యానిమేటెడ్ గా రూపొందిన ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాకు అకాడమీ అవార్డ్ విన్నర్ బేరీ జెంకిన్స్ దర్శకత్వం వహించారు.
మూవీ లవర్స్‌కి ఇది నిజంగానే ఒక విజువల్ వండర్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక ఈ చిత్రానికి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తుండటంతో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆయనతోపాటు ప్రముఖ కమెడియన్స్ బ్రహ్మానందం పుంబా పాత్రకు, అలీ టిమోన్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. మొదటి భాగంలో కూడా ఆయా పాత్రలకు వీరే గాత్రం అరువిచ్చిన సంగతి గుర్తుండేవుంటుంది.
కాగా 2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ దేశవ్యాప్తంగా అద్భుత కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో రిలీజైన సమయంలో అక్కడి ప్రముఖ నటులతో డబ్బింగ్ చెప్పించారు. దీనిలో భాగంగా నాడు తెలుగులో ముఫాసా పాత్రకు సాయి కుమార్ గాత్రం అందించగా.. కొడుకు సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్పారు.
ఈ సినిమా హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయులు ఆర్యన్ ఖాన్ మరియు అబ్రమ్ ఖాన్ లతో కలిసి డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే ఈ మూవీ హిందీ వెర్షన్ ట్రైలర్‌ను డిస్నీ విడుదల చేయగా యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇక ఇంగ్లీష్‌లో ముఫాసాకు ఆరోన్ పియర్, సింబాకు డోనాల్డ్ గ్లోవర్.. అలాగే యంగ్ ముఫాసాకు బ్రేలిన్ రాంకిన్స్ డబ్బింగ్ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: