
ట్యాగ్ · 13 కథనాలు

'ఆర్ఆర్ఆర్' కోసం ప్రతిఒక్కరూ
లైకా ప్రొడక్షన్స్ కు 'RRR' తమిళ్ హక్కులు
మెగా '13' సెంటిమెంట్
ఆర్ఆర్ఆర్ - జెన్నీఫర్ గా ఎన్టీఆర్ హీరోయిన్

'RRR' క్లైమాక్స్ షూట్
'ఆర్ఆర్ఆర్' - మహాబలేశ్వర్ లో కొత్త షెడ్యూల్
నైట్ షూట్ కు గుడ్ బై చెప్పిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
మిడ్ నైట్ చలిలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ షూటింగ్

"ఆర్ ఆర్ ఆర్"మూవీ సెన్సార్ పూర్తి
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.
'ఆర్ఆర్ఆర్'.. చరణ్ బర్త్ డే కి స్పెషల్ పోస్టర్
భీమ్ ఫర్ రామరాజు ఈ వీడియో వచ్చి ఏడాది అవుతుంది. గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చరణ్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేశాడు. ఇక అప్పుడే ఏడాది అవుతుంది. మరో వారం రోజుల్లో రామ్ చరణ్ పుట్టిన రోజు రానుంది. ఇక ఈపుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ కు సంబంధించిన ఏదైనా అప్ డేట్ వస్తుందా లేదా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా కూడా అప్ డేట్ ఉందా లేదా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇక ఇప్పుడు ఈవిషయంలో తాజాగా ఒక అప్ డేట్ ఇచ్చి క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. చరణ్ పుట్టినరోజు నాడు రామరాజు కు సంబంధించి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా…
'ఆర్ఆర్ఆర్' క్లైమాక్స్ లో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
రాజమౌళి సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఏచిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాడని తెలుసు. అందుకే తన కెరీర్ లో ఫ్లాప్ అన్న మాట వినపించకుండా సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చివరి షూటింగ్ షెడ్యూల్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సీన్లతో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరి క్లైమాక్స్ కూాడా సినిమాకు చాలా కీలకం. అందులోనూ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా కాబట్టి సాలిడ్ గా ఉండాలి.. సింపుల్ గా కానిచ్చేస్తే ఫ్యాన్స్ కూడా నిరాశపడతారు. అందుకే ఈసినిమా క్లైమాక్స్ షూట్…
'ఆర్ఆర్ఆర్' కోసం ప్రతిఒక్కరూ
ఆర్ఆర్ఆర్ టార్గెట్ అక్టోబర్ 13.. అలానే కనిపిస్తుంది రాజమౌళి షూటింగ్ చేస్తున్న విధానం చూస్తుంటే. ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని చెప్పడంతో ఇప్పుడు ఆ దిశగా షూటింగ్ ను గ్యాప్ లేకుండా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక షూటింగ్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎలా లేదనుకున్నా చాలా ఎక్కువ టైమే పడుతుంది. మరి అనుకున్న టైం కే సినిమా రిలీజ్ అవ్వాలంటే.. ఈ రేంజ్ లో షూటింగ్ జరపాల్సిందే.
లైకా ప్రొడక్షన్స్ కు 'RRR' తమిళ్ హక్కులు
పెద్ద సినిమాలు అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుందని తెలిసిందే. ముందు నుండే సినిమా హక్కులు బుక్ చేసుకునే పనిలో వుంటారు. అందులో రాజమౌళి సినిమా అంటే ఇంకా ఏ రేంజ్ లో అమ్మకాలు వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే జరిగింది రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాకు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు రావడంతో అప్పుడే డిస్ట్రిబ్యూటర్స్ కన్ను ఈ సినిమాపై పడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ తమిళ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా దక్కించుకుంది.
'ఆర్ఆర్ర్' క్లైమాక్స్ రిహార్సల్స్ లో ఎన్టీఆర్, చరణ్
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. కరోనా వల్ల దాదాపు షూటింగ్ కు చాలా గ్యాప్ రాగా ఇప్పుడు అసలు బ్రేక్ లేకుండా రాజమౌళి షూటింగ్ చేస్తున్నాడు. ఇక ఈ లోపు రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ టీజర్ లను అయితే రిలీజ్ చేశారు. వాటికి మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిందనుకోండి.
మెగా '13' సెంటిమెంట్
నిజజీవితంలో సెంటి మెంట్స్ ఎలా ఉంటాయో.. వాటిని మనం ఎలా తప్పకుండా ఆచరిస్తామో.. సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు నూటికి 90 శాతం మంది ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. అలానే డైరెక్టర్స్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు.
ఆర్ఆర్ఆర్ - జెన్నీఫర్ గా ఎన్టీఆర్ హీరోయిన్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ రెగ్యులర్ గా ఇస్తూనే ఉన్నాడు రాజమౌళి. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే రోజు ఈ సినిమా రిలీజ్ కూడా ప్రకటించాడు. అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని తెలిపారు. భారీ పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు…

'RRR' క్లైమాక్స్ షూట్
మొత్తానికి రెండేళ్ల పైన కృషికి మరికొద్దిరోజుల్లో తెర పడనుంది. రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్(రౌధ్రం రణం రుధిరం). లాక్ డౌన్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా రాజమౌళి షూటింగ్ ను చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది. "వాళ్లు అనుకున్నది సాధించేందుకు కొమురం భీమ్, సీతారామరాజు ఏకమయ్యారు. క్లైమాక్స్ షూటింగ్ మొదలయ్యింది. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది" అని ట్వీట్ లో పేర్కొన్నారు.
'ఆర్ఆర్ఆర్' - మహాబలేశ్వర్ లో కొత్త షెడ్యూల్
ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. అసలే లేట్ అవ్వగా కరోనా వల్ల మరింత లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితమే దాదాపు 50రోజుల పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేసి కంప్లీట్ చేశారు.
నైట్ షూట్ కు గుడ్ బై చెప్పిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
కరోనా వల్ల దాదాపు 8నెలలు షూటింగ్ కు గ్యాప్ తీసుకున్న ఆర్ఆర్ఆర్ టీం ఈమధ్యే షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు. అంతేకాదు హెవీ వింటర్ లో కూడా షూట్ చేస్తున్నట్టు ఇప్పటికే పలు వీడియోలు పోస్ట్ చేస్తూ తెలియచేస్తూనే వున్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడు ఫైనల్ గా నైట్ షెడ్యూల్ కు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దాదాపు 50రోజుల పాటు ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను నైట్స్ లో చలిలో ఇన్ని రోజులు చిత్రీకరణ చేశాం. ఫైనల్ గా ఈ షూట్ అయిపోయింది. త్వరలో మరో కొత్త…
"రౌద్రం రణం రుధిరం" మూవీ కి చిరంజీవి వాయిస్ ఓవర్ ?
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రౌద్రం రణం రుధిరం "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. రే స్టీవెన్ సన్ , అలీ సన్ డూడీ ,సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ , సీనియర్ హీరోయిన్ శ్రియ అతిథి పాత్రలలో నటిస్తున్నారు.
మిడ్ నైట్ చలిలో 'ఆర్ఆర్ఆర్' టీమ్ షూటింగ్
కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ షూటింగ్ కి చాలా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టగా టీం మాత్రం నిర్విరామంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒక్కసారి కమిట్ అయితే ఎంత కష్టమైనా షూటింగ్ కు మాత్రం బ్రేక్ చెప్పడు. ఇక ఇప్పటికే షూటింగ్ కు సంబంధించి పలు వీడియోలు పోస్ట్ చేయగా ఇప్పుడు మరో వీడియో ను ఆర్ఆర్ఆర్ టీం పోస్ట్ చేసింది. ఇక వీడియోలో చూస్తుంటే చలికి వణుకుతూ షూటింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.