‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ లో హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

Hollywood Action Director Nick Powell Joins The Last Leg Of RRR Movie Climax Shoot,Hollywood Action Director Nick Powell,Nick Powell Joins RRR Movie Final Climax Shoot,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,RRR,RRR Movie,RRR Film,RRR Telugu Movie,RRR Movie Telugu,RRR Update,RRR Movie Latest News,RRRMovie Latest Reports,RRR Movie Latest Updates,Director Nick Powell,Nick Powell Joins The Final Climax Schedule Of RRR,Nick Powell Joins RRR Movie,Final Climax Schedule Of RRR,Nick Powell Joins RRR Climax Shoot,Nick Powell Joins RRR Final Climax Schedule,SS Rajamouli,Ram Charn,Jr NTR,RRR Movie Sets,RRR Diaries,Hollywood Action Director Nick Powell Joins Rajamouli RRR,SS Rajamouli Shoots RRR Climax Shoot,RRR Climax Shoot,Nick Powell RRR Movie Climax Shoot,#RRR,#RRRMovie

రాజమౌళి సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఏచిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ కాడని తెలుసు. అందుకే తన కెరీర్ లో ఫ్లాప్ అన్న మాట వినపించకుండా సినిమాలు తెరకెక్కించాడు. ప్రస్తుతం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చివరి షూటింగ్‌ షెడ్యూల్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్‌ సీన్లతో క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరి క్లైమాక్స్ కూాడా సినిమాకు చాలా కీలకం. అందులోనూ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా కాబట్టి సాలిడ్ గా ఉండాలి.. సింపుల్ గా కానిచ్చేస్తే ఫ్యాన్స్ కూడా నిరాశపడతారు. అందుకే ఈసినిమా క్లైమాక్స్ షూట్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ను కూడా రంగలోకి దింపాడు రాజమౌళి. హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ నిక్‌ పావెల్‌ను తీసుకువచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్‌లో ఆయన రాజమౌళికి సన్నివేశాలను వివరిస్తున్న వీడియోను చిత్ర యూనిట్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇత నిక్‌ పావెల్‌ కత్తియుద్ధంలో నిపుణుడు. పలు హాలీవుడ్ సినిమాలకు యాక్షన్ డైరెక్టర్‌గా పని చేశారు. ‘బ్రేవ్ హార్ట్’, ‘గ్లాడియేటర్‌’, ‘మమ్మీ ది లాస్ట్ సమురాయ్’, ‘సిండ్రెల్లా మ్యాన్’ వంటి చిత్రాలకు గుర్తిండిపోయే యాక్షన్ సీక్వెన్స్ అందించారు. అంతేకాదు బాలీవుడ్‌ హిస్టారికల్‌ చిత్రం మణికర్ణికకు కూడా ఆయన పనిచేశారు.

కాగా భారీ పీరియాడికల్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమ్రం భీం పాత్ర‌లో, అలియాభ‌ట్ సీత పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న సినిమా 2021అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =