
ట్యాగ్ · 54 కథనాలు


బాలీవుడ్ లో సౌత్ హీరోయిన్స్ హవా

హిందీ లో కూడా వారసుడు

స్టార్ హీరో విజయ్ , ఖుష్బూ లతో రష్మిక సెల్ఫీ

పుష్ప :ది రూల్ మూవీ పై అప్ డేట్ ఇచ్చిన రష్మిక

సీతారామం మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

ఆనాటి సీతారాముల ప్రేమ ఈనాటి సీతారామంలో

'సీతారామం' ఆ కంట్రీస్ లో బ్యాన్..!

"సీతారామం" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్

'సీతారామం' ప్రతి విషయంలో చాలా రీసెర్చ్ చేశాం

మై గాడ్ బన్నీ.. నిన్ను గుర్తుపట్టలేకపోయా..!

అల్లు అర్జున్ ను గుర్తుపట్టలేదు - రష్మిక

రష్మిక ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్

టెర్రిఫిక్ గా పుష్ప2 ఇంటర్వెల్ ట్విస్ట్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా పుష్ప. ఈసినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు పుష్ప. ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో అల్లు అర్జున్ కూడా దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా గ్లింప్స్. వీటికి వచ్చిన రెస్పాన్స్ తో పార్ట్ 2 కోసం ఎంతలా వెయిట్…

బాలీవుడ్ లో సౌత్ హీరోయిన్స్ హవా
ప్రస్తుతం బాలీవుడ్ లో సౌత్ స్టార్ హీరోయిన్స్ హవా నడుస్తుంది. ఏ క్రేజీ ప్రాజెక్ట్ చూసినా మన సౌత్ హీరోయిన్స్ కథానాయికలుగా నటిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ జవాన్ లో కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 3న వరల్డ్ వైడ్ గా, పాన్ ఇండియా రేంజ్ లోనూ రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ స్టార్ హీరోయిన్…

ఓటీటీ లోకి వచ్చేసిన వారసుడు
ఇళయ దళపతి విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన తమిళ్ సినిమాలను ఇక్కడ డబ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారు మేకర్స్. ఇక రీసెంట్ గా వారసుడు సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈసినిమా తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారసుడు. తమిళ్ లో వారిసు టైటిల్ తో రిలీజ్ అవ్వగా.. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. తమిళంలో జనవరి 12న, తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది.

వారసుడు రంజితమే తెలుగు సాంగ్ కు ముహూర్తం ఫిక్స్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. తెలుగు , తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. తెలుగులో ఈసినిమా వారసుడు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి రంజితమే అనే సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తమిళ్ లో మాత్రమే ఈపాటను రిలీజ్ చేశారు. ఈపాటకు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తమిళ్ లో ఈపాటను విజయ్, ఎమ్.ఎమ్ మానసి కలిసి ఆలపించారు. ఇక…

70 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న రంజితమే సాంగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది.

హిందీ లో కూడా వారసుడు
తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. ఇక ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి వస్తున్నాడు. ‘మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లితో విజయ్ ‘వారసుడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన విజయ్ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. అంతేకాదు ఈసినిమా నుండి రిలీజ్…

వరిసు ఫస్ట్ సింగిల్ రిలీజ్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా వరిసు. ఈసినిమా డైరెక్ట్ తమిళ్ లో చిత్రీకరణ జరుగుతుంది. తెలుగులో డబ్బింగ్ లోనే రిలీజ్ కాబోతుందని ఇటీవలే వంశీ పైడిపల్లి కూడా క్లారిటీ ఇచ్చారు. తెలుగులో వారసుడు టైటిల్ తో రాబోతుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఒకవైపు షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా.. తాజాగా విజయ్-రష్మిక ఉన్న మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

స్టార్ హీరో విజయ్ , ఖుష్బూ లతో రష్మిక సెల్ఫీ
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది.

సామి సామి సాంగ్ చిన్నారి డ్యాన్స్ కు రష్మిక ఫిదా
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని…

పుష్ప :ది రూల్ మూవీ పై అప్ డేట్ ఇచ్చిన రష్మిక
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పు ష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. భారీ…

సీతారామం మూవీ మేకింగ్ వీడియో రిలీజ్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు…

ఆనాటి సీతారాముల ప్రేమ ఈనాటి సీతారామంలో
పురాణాలు ఇతిహాసాలు తెలిసినవారికి సీతారాముల అనుబంధం గురించి.. ధర్మం కోసం రాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం నిలబడటం.. మరోవైపు సీత జీవితం భర్తతో పాటే అని రాముడితో సైతం అరణ్యవాసం చేయడం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాముని గొప్పతనం, మంచితనం గురించి మనం ఎన్ని సార్లు చెప్పుకున్నా.. విన్నా తక్కువే. అంతేకాదు ఇప్పటికీ కూడా సీతారాముల అనుబంధం అనేది ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తారు. యుగాలు మారినా, టెక్నాలజీ పరంగా ఎంత పెరిగినా కొన్ని బంధాలు మాత్రం ఎప్పటికీ ఆదర్శప్రాయమే. ఇక సీతారాముల కళ్యాణం దగ్గర నుండి సీతను రావణుడిని అపహరించినా.. రాముడు రావణాసుర వధ చేసి సీతకు తీసుకొచ్చినా అన్నీ పురాణాల్లో…

'సీతారామం' ఆ కంట్రీస్ లో బ్యాన్..!
మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు సీతారామం సినిమాతో మరింత దగ్గరయ్యాడని చెప్పొచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా రష్మిక కీలక పాత్రలో వచ్చిన సినిమా సీతారామం. 1965 కాలం నాటి పీరియాడిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంటుంది.

'సీతారామం' రివ్యూ.. క్లాసిక్ లవ్ స్టోరీ..!
కొన్ని సినిమాలలో ఉన్న ఎమోషన్ ను చెప్పడం చాలా కష్టమవుతుంది. సీతారామం సినిమా కూడా అలాంటిదే. దేశం అంటే ప్రేమ ఉన్న ఓ వ్యక్తి.. ఆ దేశం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయడానికి వెనుకాడని వ్యక్తి.. ఇక మరోవైపు తన ప్రేమ కోసం ఎదురుచూసే మరో వ్యక్తి.. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు ఖచ్చితంగా భావోద్వేగానికి గురవ్వకుండా ఉండలేడు. 1965 కాలం నాటి ప్రేమకథ కాబట్టి.. ఆ కాలంలో ప్రేమ ఎలా ఉండేదో అలానే చూపించాడు హను. స్వచ్చమైన ప్రేమకథను ప్రేక్షకులకు అందించాడు. ఇలాంటి ప్రేమకథలు రావడం ఇప్పట్లో అరుదు అనే చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్ లో ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్.. థియేటరే మాకు గుడి..!
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. ఇక పీరియాడిక్ లవ్ స్టోరీ గా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఎక్కువ రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, క్యారెక్టర్ పోస్టర్లు ఇంకా పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

"సీతారామం" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్‌గా విడుదల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'సీతారామం' ప్రతి విషయంలో చాలా రీసెర్చ్ చేశాం
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగష్ట్ 5న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది. ఈసినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈసినిమా ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ ఆకట్టుకోగా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసింది.

మై గాడ్ బన్నీ.. నిన్ను గుర్తుపట్టలేకపోయా..!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో చూస్తూనే ఉన్నాం. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి ప్రయత్నంతోనే సంచలన విజయం దక్కించుకోవడంతో పాటు నార్త్ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. తన నటన, యాస, మేకోవర్ అన్నీ ఈసినిమాకు ప్లస్ పాయింట్సే. ఇక ఈసినిమా రిలీజ్ కు ముందూ రికార్డులు క్రియేట్ చేసింది.. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి కలెక్షన్ల పరంగా కొత్త రికార్జులు క్రియేట్ చేసింది..ఇక రిలీజ్ అయిన తరువాత కూడా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక ప్రస్తుతం బన్నీ ఎక్కడకు వెళ్లినా తనకు రావాల్సిన క్రేజ్ మాత్రం వస్తూనే ఉంది.

అల్లు అర్జున్ ను గుర్తుపట్టలేదు - రష్మిక
తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా లో తన స్టైలిష్ ఫోటో ను షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని దూసుకుపోతోంది. నోటిలో సిగార్ తో , లైట్‌గా జుట్టు నెరుస్తున్నట్లు వైట్ కలరింగ్ ఇచ్చిన అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ 116 K లైక్స్ తో సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. “పొగతాగడం ఆరోగ్యానికి హానికరం”క్యాప్షన్ తో అల్లు అర్జున్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అల్లు అర్జున్ మాసీ లుక్ బాగుందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

రష్మిక ఫస్ట్ టైమ్ ర్యాంప్ వాక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో కీలక పాత్రలో నటించిన రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ…