‘సీతారామం’ రివ్యూ.. క్లాసిక్ లవ్ స్టోరీ..!

Sita Ramam Telugu Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sita Ramam Movie Review,Sita Ramam Review,Sita Ramam Telugu Review,Sita Ramam Movie Telugu Review,Sita Ramam Movie Review And Rating, Sita Ramam Movie Rating,Sita Ramam (2022 film),Sita Ramam Movie (2022),Sita Ramam (2022) - Movie,Sita Ramam (2022)-Review, Sita Ramam - Telugu Movie Reviews,Sita Ramam (2022),Sita Ramam: Movie Review,Sita Ramam Movie Review 2022, Sita Ramam Review 2022,Sita Ramam Movie Highlights,Sita Ramam Movie Plus Points,Sita Ramam Movie Review Telugu, Sita Ramam movie First Review out,Sita Ramam Movie Public Talk,Sita Ramam Movie Public Response,Sita Ramam 2022, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Updates,Sita Ramam Telugu Movie Updates, Sita Ramam Telugu Movie Live Updates,Sita Ramam Movie Latest News,Sita Ramam Telugu Movie Latest News, Sita Ramam Review And Rating,Sita Ramam Telugu Movie 2022,Sita Ramam The Movie,Dulquer Salmaan,Mrunal Thakur, Rashmika,Sumanth,Tharun Bhascker,Bhumika Chawla,Vennela Kishore,Murli Sharma,Hanu Raghavapudi

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సీతారామం. పీరియాడిక్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దానికితోడు ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈనేపథ్యంలో నేడు ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకుందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, తరుణ్ భాస్కర్, సుమంత్, ప్రకాష్ రాజ్, సునీల్, వెన్నెల కిషోర్, గౌతమ్ మీనన్ తదితరులు
దర్శకత్వం.. హను రాఘవపూడి
బ్యానర్స్.. వైజ‌యంతీ మూవీస్, స్వప్న సినిమాస్
నిర్మాతలు.. అశ్విని దత్
సంగీతం.. విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫి..పీఎస్ వినోద్

కథ

ఈసినిమా కథ ఏంటన్నది మనకు ఇప్పటికే అర్థమైపోయింది. ఓ సైనికుడు తన ప్రేయసికి రాసిన ఉత్తరం చేరడం. లెఫ్ట్‌నెంట్ రామ్ (దుల్క‌ర్ సల్మాన్‌) రాసిన ఉత్త‌రం అది. ఆ ఉత్తరం పాకిస్థాన్ లోనే ఉంటుంది. అయితే దాదాపు 20ఏళ్లపాటు అక్కడే ఉన్న ఉత్తరాన్ని సీతామహాలక్ష్మీ (మృణాల్ ఠాకూర్) కు చేర్చాలి. ఆ బాధ్యతను పాకిస్తాన్ మేజర్ (సచిన్ ఖెడేకర్) తన మనుమరాలు అఫ్రిన్ (రష్మిక)కు అప్పగిస్తాడు. ఇక తాత మాట ప్రకారం ఆ లెటర్ ను పట్టుకొని సీతామహాలక్ష్మీ కోసం బయలుదేరుతుంది రష్మిక. ఈ క్రమంలో తనకు ఎన్నో ఆసక్తిరమైన విషయాలు తెలుస్తాయి. సీత కోసం రామ్ రాసిన ఉత్త‌రం పాకిస్థాన్‌లో ఎందుకు ఆగిపోయింది. ఆ ఉత్త‌రాన్ని చేర‌వేసే బాధ్య‌త భుజాన వేసుకొన్న అఫ్రిన్‌.. త‌న బాధ్య‌త నెర‌వేర్చిందా, లేదా? అస‌లు రామ్, సీత ఎందుకు విడిపోయారు? అన్నది మిగిలిన కథ

విశ్లేషణ..

ప్రేమకథలు అనేవి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ప్రేమకథల మీద ఎన్ని సినిమాలైనా తీయచ్చు. అయితే ప్రేక్షకుడు ఎంతలా కనెక్ట్ అయ్యేలా సినిమా తీశాం అన్నది ఇక్కడ ముఖ్యం. అందులోనూ ఇప్పుడున్న కాంపిటీషన్ లో కొత్త కొత్త కాన్సెప్ట్ లు చూడటానికి మాత్రమే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి భావోద్వేగమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు హను రాఘవపూడి. హృద్యమైన ప్రేమకథలను తెరకెక్కించడంలో హను రాఘవపూడికి కొత్తేమీ కాదు. ఇక ఈసారి కూడా ప్రేమకథతోనే వచ్చేశాడు. అయితే ఈసారి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ను కీరోల్ గా తీసుకున్నాడు. యుద్దాన్ని, ప్రేమను బేస్ చేసుకొని కథను సిద్దం చేసుకున్నాడు. యుద్ధం-ప్రేమ ఈ రెండు అంశాల్నీ బాలెన్స్ చేస్తూ ఈ క‌థ చెప్పాడు.

దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మమ్ముట్టి తనయుడిగా సినీ ప్రేక్షకులకు తెలిసినవాడే. అయితే మహానటి సినిమాతో మాత్రం తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆసినిమాలో శివాజి గణేషన్ పాత్రలో నటించి తన నటనతో మెప్పించాడు. ఇక ఇప్పుడు ఏకంగా తనే హీరోగా సీతారామంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమాలో కూడా దుల్కర్ సల్మాన్ తన పాత్రకు ప్రాణం పోశాడని చెప్పొచ్చు. రామ్ పాత్రలో దుల్కర్ ను తప్పా మరే హీరోను కూడా ఊహించుకోలేం. త‌న నటన, మాట‌తీరు, లవ్ సీన్స్, ఎమోష‌నల్ సీన్స్ ఇలా అన్ని కోణాల్లోనూ ఈ పాత్ర‌కు ప‌ర్‌ఫెక్ట్ ఛాయిస్ అనిపించాడు.

దుల్కర్ సల్మాన్ కు జోడీగా నటించిన మృణాల్ ఠాకూర్ కూడా మరో ఆకర్షణగా నిలిచింది. మొదట తన పాత్ర స్లో గా అనిపించినా ఆ తరువాత మెల్లగా ఎక్కేస్తుంది. దుల్క‌ర్, మృణాల్ సినిమా మొత్తాన్ని త‌మ భుజాల‌పై వేసుకొని న‌డిపించారు. ఇక పొగ‌రున్న అమ్మాయి పాత్ర‌లో అఫ్రిన్ క‌నిపించింది. మెల్ల‌మెల్ల‌గా ఆ పాత్ర‌లో వ‌చ్చిన మార్పునీ బాగానే క్యారీ చేయ‌గ‌లిగింది. సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ పాత్రల్లో చక్కటి నవ్వులు పూయించారు. సుమంత్ ది స‌ర్‌ప్రైజింగ్ పాత్రే. త‌ను బాగా చేశాడు. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

టెక్నికల్ గా కూడా ఈసినిమాకు అన్నీ కలిసొచ్చాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ ఆకట్టుకుంటాయి. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ వర్క్ అత్యద్భుతంగా ఉంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కాశ్మీర్ లోయను అందంగా ప్రదర్శించారు. ఇక ఈసినిమా కోసం చాలా సెట్స్ వేసిన సంగతి తెలిసిందే. అయితే స్క్రీన్ పై మాత్రం ఏవి సెట్లో, ఏవి రియల్ లొకేషన్సో చెప్పడం కష్టమే. అంత పర్ఫెక్టె గా డిజైన్ చేశారు. వైజయంతీ మూవీస్ వారు కాబట్టి ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.

కొన్ని సినిమాలలో ఉన్న ఎమోషన్ ను చెప్పడం చాలా కష్టమవుతుంది. సీతారామం సినిమా కూడా అలాంటిదే. దేశం అంటే ప్రేమ ఉన్న ఓ వ్యక్తి.. ఆ దేశం కోసం తన ప్రేమను కూడా త్యాగం చేయడానికి వెనుకాడని వ్యక్తి.. ఇక మరోవైపు తన ప్రేమ కోసం ఎదురుచూసే మరో వ్యక్తి.. సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు ఖచ్చితంగా భావోద్వేగానికి గురవ్వకుండా ఉండలేడు. 1965 కాలం నాటి ప్రేమకథ కాబట్టి.. ఆ కాలంలో ప్రేమ ఎలా ఉండేదో అలానే చూపించాడు హను. స్వచ్చమైన ప్రేమకథను ప్రేక్షకులకు అందించాడు. ఇలాంటి ప్రేమకథలు రావడం ఇప్పట్లో అరుదు అనే చెప్పాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్ లో ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − one =