హిందీ లో కూడా వారసుడు

Vijays Vaarasudu Movie To Release In Hindi, Vaarasudu Movie To Release In Hindi, Vaarasudu Movie In Hindi, Vijays Vaarasudu Movie, Thalapathy Vijay, Vijay, Rashmika, S. Thaman, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Vaarasudu, Vaarasudu 2023, Vaarasudu Movie, Vaarasudu Telugu Movie, Vaarasudu Movie Latest News, Vaarasudu Telugu Movie Update, Vaarasudu Movie Live Updates, Vaarasudu Movie Latest News And Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

తమిళ్ స్టార్ హీరో విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. ఇక ఇప్పుడు మరో సినిమాతో అలరించడానికి వస్తున్నాడు. ‘మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లితో విజయ్‌ ‘వారసుడు’ చిత్రాన్ని చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్‌ పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన విజ‌య్ పోస్టర్‌ల‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. అంతేకాదు ఈసినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ రంజితమే పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈవిషయాన్ని దిల్ రాజు చెప్పడంతో ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు ఈసినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకూ హిందీకి సంబంధించి ఇప్పటివరకూ ఒక పోస్టర్ కూడా రాలేదు. మరి తెలుగు, తమిళ్ లో ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.. ఈనేపథ్యంలో హిందీ వర్షన్ సంక్రాంతికి రిలీజ్ అవుతుందో.. లేదో చూడాలి..

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 7 =