వారసుడు రంజితమే తెలుగు సాంగ్ కు ముహూర్తం ఫిక్స్

Ranjithame Telugu Version Song Release Date Fixed, Ranjithame Telugu Version Song, Ranjithame Telugu Song, Thalapathy Vijay, Vijay, Rashmika, S. Thaman, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Vaarasudu, Vaarasudu 2023, Vaarasudu Movie, Vaarasudu Telugu Movie, Vaarasudu Update, Vaarasudu News, Vaarasudu Latest News, Vaarasudu New Update, Vaarasudu Movie Live Updates, Vaarasudu Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ హీరోగా వస్తున్న సినిమా వారిసు. తెలుగు , తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. తెలుగులో ఈసినిమా వారసుడు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి రంజితమే అనే సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తమిళ్ లో మాత్రమే ఈపాటను రిలీజ్ చేశారు. ఈపాటకు అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తమిళ్ లో ఈపాటను విజయ్‌, ఎమ్.ఎమ్‌ మానసి కలిసి ఆలపించారు. ఇక ఇప్పుడు ఈపాట తెలుగు వర్షన్ ను కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. తెలుగు పాటను నవంబర్‌ 30న ఉదయం 9:09 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. తెలుగు పాటను అనురాగ్‌ కులకర్ణి పాడినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =