
ట్యాగ్ · 13 కథనాలు


కన్ఫామ్.. 'మానాడు' రీమేక్ లో రానా..!

ఎత్నిక్ వేర్ లో స్టైలిష్ కపుల్ రానా , మిహీకా

రానా '1945' రిలీజ్ డేట్ ఫిక్స్

'భీమ్లా నాయక్'.. రానా టీజర్ కి డేట్ ఫిక్స్..?

ఫైనల్ స్టేజ్ లో 'విరాట పర్వం'

ముగింపు దశలో "విరాటపర్వం"

అట్లీ-షారుఖ్ సినిమాలో రానా..!

పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రానా..!

మరో పాన్ ఇండియాలో 'రానా'
`విరాటపర్వం` ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
'విరాటపర్వం' - కీలక పాత్రలో నివేదా పేతురాజ్
"విరాటపర్వం "సెట్స్ లో రానా దగ్గుబాటి

రానా, మిహికా ల వాలెంటైన్స్ డే స్పెషల్
సూపర్ హిట్ లీడర్ మూవీతో కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయినా రానా దగ్గుబాటి తెలుగు ,, తమిళ హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రానా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటుడు, నిర్మాత, టీవీ హోస్ట్, బిజినెస్ మ్యాన్ రానా ప్రస్తుతం తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. హైదరాబాద్ బేస్డ్ ఇంటీరియర్ డిజైనర్ మిహికా బజాజ్ ను ప్రేమించి, పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

కన్ఫామ్.. 'మానాడు' రీమేక్ లో రానా..!
వెంకట్ ప్రభు డైరెక్షన్లో శింబు హీరోగా ‘మానాడు’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది రిలీజ్ అయి హిట్ అయిన సినిమాల్లో ఈసినిమా కూడా ఒకటి. చాలా కాలం తర్వాత శింబు ఈ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓటీటీలో కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంది.

ఎత్నిక్ వేర్ లో స్టైలిష్ కపుల్ రానా , మిహీకా
సక్సెస్ ఫుల్ "లీడర్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రానా దగ్గుబాటి పలు సూపర్ హిట్ తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "బాహుబలి "మూవీ లో భల్లాలదేవ గా నెగటివ్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రానా బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ "భీమ్లా నాయక్ "మూవీ లో పవన్ కళ్యాణ్ తో పోటీపడి నటించిన రానా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రానా హీరోగా తెరకెక్కిన "విరాటపర్వం"మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

రానా '1945' రిలీజ్ డేట్ ఫిక్స్
మొదటి నుండి విభిన్నమైన సినిమాలను చేయడంలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రానా ఎప్పుడూ ముందుంటాడు. ప్రస్తుతం తన ఖాతాలో పలు సినిమాలు ఉండగా.. అందులో 1945 సినిమా కూడా ఒకటి. శివకుమార్ దర్శకత్వంలో రానా కథానాయకుడిగా 1945 సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో పలు వివాదాలు ఏర్పడ్డాయి. ఇటీవలే ఈసినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక అన్ని అడ్డంకులు తొలగించుకొని ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. డిసెంబర్ 31న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు. పోస్టర్‌లో రానా బ్రిటీష్ జెండాను కాల్చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

'భీమ్లా నాయక్'.. రానా టీజర్ కి డేట్ ఫిక్స్..?
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా భీమ్లా నాయక్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా పవన్ బర్త్ డే కి పవన్ ఇంట్రడక్షన్ వీడియోను రిలీజ్ చేయగా దానికి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ఇంకా ఆ టీజర్ కు వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అయితే పవన్ ఇంట్రడక్షన్ వీడియో కాబట్టి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న రానా కు సంబంధించి జస్ట్ ఒక్క డైలాగ్ తప్పా రానాను చూపించలేదు మేకర్స్. దీనిపై అప్పట్లో పలు కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక కామెంట్స్ పై స్పందించిన మేకర్స్ అప్పుడే రానా ఇంట్రడక్షన్ కోసం స్పెషల్ టీజర్ ఉంటుందని…

ఫైనల్ స్టేజ్ లో 'విరాట పర్వం'
వేణు ఉడుగుల దర్శకత్వంలో యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వస్తున్న సినిమా ‘విరాటపర్వం’. ఈసినిమా గురించి కూడా ఈమధ్య ఎలాంటి వార్తలు లేవు. ఎప్పుడో షూటింగ్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. కరోనా వల్ల చాలా సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడినా ఆ తరువాత కాస్త పరిస్థితులు నార్మల్ కు రాగానే అందరూ షూటింగ్ లు పూర్తి చేసుకున్నారు.. రిలీజ్ లు కూడా చేస్తున్నారు. కానీ విరాట పర్వం మాత్రం ఇంకా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలోనే ఉంది. నిజానికి కరోనా ముందే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈసినిమా.

ముగింపు దశలో "విరాటపర్వం"
శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఫిలిమ్స్ , సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 1990 ల నాటి నక్సలైట్ మూవ్ మెంట్స్ నేపథ్యం లో పీరియాడికల్ డ్రామా "విరాట పర్వం "తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి, నందిత దాస్ , నివేత పేతురాజ్ , నవీన్ చంద్ర, సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

అట్లీ-షారుఖ్ సినిమాలో రానా..!
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమాను కూడా ప్రారంభించారు కూడా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈసినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో టాలెంటెడ్ నటుడు రానా కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఒక కీలక పాత్ర కోసం రానాను ఎంపిక చేశారట మేకర్స్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే. కాగా ఈసిమాలో హీరోయిన్స్ గా నయనతార, ప్రియమణి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ ను షారుఖ్ తన రెడ్ చిల్లీస్ బ్యానర్ పై స్వయంగా…

పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రానా..!
కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా పాత్ర ప్రధానమైన రోల్స్ చేయడంలో రానా ఎప్పుడూ ముందుటాడు. ఇక ఇప్పుడు రానా కూడా వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన విరాట పర్వం రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. మరోవైపు పవన్ తో కలిసి మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియనుమ్ సినిమా రీమేక్ చేస్తున్నాడు.

మరో పాన్ ఇండియాలో 'రానా'
డిఫరెంట్ సినిమాలు చేయడంలో రానా ఎప్పుడూ ముందుంటాడు. తన మొదటి సినిమా లీడర్ నుండి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత ఉంటుంది. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రానా మరో పాన్ ఇండియాకు రెడీ అయ్యాడు. సీహెచ్ రాంబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాను విశ్వశాంతి పిక్చర్స్ బ్యానర్ పై అధినేత ఆచంట గోపినాథ్ ఈ సినిమా నిర్మించనున్నారు.
`విరాటపర్వం` ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
నిన్న వెంకీ పుట్టిన రోజు కావడంతో ఆయన సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ ఇచ్చి అభిమానులను ఫుల్ కుష్ చేశారు. ఇక ఈరోజు రానా పుట్టినరోజు కావడంతో వరుస అప్ డేట్స్ వస్తున్నాయి. రానా పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక రానా పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించబోతున్నాడు.
'విరాటపర్వం' - కీలక పాత్రలో నివేదా పేతురాజ్
మొత్తానికి టాలీవుడ్ కు మళ్లీ పూర్వ కళ వస్తుంది. చాలా సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. వచ్చే ఏడాది మొత్తం సినిమాల పండగ స్టార్ట్ అవుతుంది. ఇక 'విరాటపర్వం 1992' సినిమా షూటింగ్ కూడా ఇటీవలే మొదలైన సంగతి తెలిసిందే. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
"విరాటపర్వం "సెట్స్ లో రానా దగ్గుబాటి
సురేష్ ప్రొడక్షన్స్ , లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ "మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 1990 ల నాటి నక్సల్ మూవ్ మెంట్ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో "విరాట పర్వం " మూవీ రూపొందుతుంది. ప్రియమణి , నందితాదాస్ , జరీనావహాబ్ , ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. "విరాట పర్వం " మూవీ 90 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.