కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ram Gopal Varma Next Project News

ట్యాగ్ · 11 కథనాలు

ట్రైలర్ & టీజర్

వర్మ 'దిశ ఎన్‌కౌంటర్‌'‌ ట్రైలర్ రిలీజ్

సమాజంలో జరిగే యదార్ధ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేయగా.. ఇప్పుడు మరో సంచలన కథతో రాబోతున్నాడు వర్మ. గత ఏడాది దిశ హత్యాచారం సంఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అదే సంఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ 'దిశ ఎన్‌కౌంటర్‌'‌ అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకూ అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశాడు వర్మ. దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు అన్నీ ట్రైలర్ లో చూపించాడు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'వర్మ' బయోపిక్ షూటింగ్ మొదలు

ఇప్పటివరకూ యదార్థ సంఘటనల ఆధారంగా.. పలువురి జీవిత చరిత్రల ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ మీద పలువురు బయోపిక్ లు తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో బయోపిక్ రానుంది. మూడు భాగాలుగా రూపొందిస్తున్న ఈ బయోపిక్ లో మొదటి పార్ట్ ను రాము అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"సైకో వర్మ " మూవీ షూటింగ్ ప్రారంభం

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై టాలీవుడ్ లో పలు మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ కూడా తన బయోపిక్ మూవీ ని మూడు పార్ట్ లుగా రూపొందిస్తున్నారు.ఒక దర్శకుడి కి వ్యతిరేకంగా మూవీస్ రూపొందడం తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మొదటిసారి. ఇప్పుడు వర్మ కు వ్యతిరేకంగా మరో మూవీ "సైకో వర్మ " రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
Ramu Movie First Look and Motion Poster Is Out
ఫస్ట్ లుక్

"రాము " మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ రిలీజ్

బొమ్మాకు క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణ లో దొర సాయి తేజ దర్శకత్వంలో ఆర్ జి వి జీవిత చరిత్ర ఆధారంగా "రాము ", రామ్ గోపాల్ వర్మ ", "ఆర్ జి వి " టైటిల్స్ తో మూడు పార్ట్ లు గా ఆర్ జి వి బయోపిక్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆర్ జి వి కాలేజ్ రోజులు , సినీ జర్నీ , గ్యాంగ్ వార్స్ వంటి అంశాలతో ఈ బయోపిక్ మూవీ రూపొందుతుంది. మొదటి రెండు పార్ట్స్ లో వర్మ గా వేరే నటులు నటిస్తుండగా , మూడవ పార్ట్ "ఆర్ జి వి " మూవీ లో వర్మ కథానాయకుడిగా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
Director Ram Gopal Varma To Make His Biopic In Three Parts
సినిమా వార్తలు

మూడు భాగాలు , మూడు టైటిల్స్ తో ఆర్ జి వి బయోపిక్

సంచలన చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన చిత్రానికి తెర తీశారు. దర్శకుడు ఆర్ జి వి కి వ్యతిరేకంగా పలు మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆర్ జి వి ఇప్పుడు ఎవరో తన మీద సినిమాలు రూపొందిందించటం ఏంటని , తన బయోపిక్ ను మూడు భాగాలు , మూడు టైటిల్స్ తో నిర్మించడానికి ప్లాన్ చేశారు. తన బయోపిక్ మూవీ వివరాలను ఆర్ జి వి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Team TFNవాట్సాప్
RGV's Strong Counter To Rumours about His Health
సినిమా వార్తలు

కరోనా వార్తలపై వర్మ కౌంటర్..!

ఈమధ్య టాలీవుడ్ సెలబ్రిటీస్ వరుసగా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఎలాంటి షూటింగ్ లకు వెళ్లకుండా ఇంట్లోనే హోమ్ క్వారెంటైన్ లో ఉంటున్న వాళ్లకు కూడా రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజమౌళి నుండి మొదలుపెట్టగా ఇప్పటివరకూ చాలా మంది పేర్లు వినిపించాయి. ఇక నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకు కూడా కరోనా వచ్చిందంటూ వార్తలు విన్పిస్తున్నాయి. మరి సైలెంట్ గా నాకు రాలేదు అని చెపితే వర్మ ఎందుకు అవుతాడు. ఎప్పటిలాగే తన ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందిస్తూ చేతిలో డంబెల్ పట్టుకొని వర్కవుట్ చేస్తూ కౌంటర్ వేసాడు వర్మ.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"12'O Clock" మూవీ టీజర్ రిలీజ్

దెయ్యం , భూత్ , డర్నా మనా హై , డర్నాజరూరీ హై , అగ్యాత్ , భూత్ రిటర్న్స్ , ఐస్ క్రీమ్ వంటి హారర్ మూవీస్ తో ప్రేక్షకులను భయపెట్టిన రామ్ గోపాల్ వర్మ మరో హారర్ మూవీతో ప్రేక్షకులముందుకు వస్తున్నారు. కరోనా టైమ్ లో కూడా వర్మ డేరింగ్ గా షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ రూపొందిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. కరోనా మహమ్మారి పై రూపొందిందించిన "కరోనా వైరస్ "మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఆ వార్తల్లో నిజం లేదు - ఆర్ జి వి

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా కాలంలో కూడా షార్ట్ ఫిల్మ్స్ , మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. " క్లైమాక్స్ ", "నేకెడ్ " వంటి ఫిల్మ్స్ ను ప్రత్యేకమైన యాప్ తో "పే ఫర్ వ్యూ " విధానంలో ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు. కరోనా మహమ్మారి పై "కరోనా వైరస్ " పేరుతో ఒక మూవీ ని రూపొందించారు. "పవర్ స్టార్ " టైటిల్ తో ఒక మూవీ ని తెరకెక్కిస్తున్నారు. "12 "o " క్లాక్ " టైటిల్ తో ఒక హారర్ మూవీ ని వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

''12 O క్లాక్'' ట్రైలర్ రిలీజ్..!

కరోనా రాకముందు కూడా వర్మ ఇంత స్పీడ్ గా సినిమాలు చేసింది లేదు. ఒకపక్క అందరూ షూటింగ్ లు తీయాలన్నా.. షూటింగ్ లకు వెళ్లాలన్నా భయపడుతున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తూ అందరికీ షాకులిస్తున్నాడు. ఇప్పటికే ''క్లైమాక్స్'', 'నేకెడ్', 'మర్డర్', 'కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్', 'ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ' సినిమాలు లైన్ లో ఉండగా ఈ రోజు ''12 O క్లాక్'' అనే హారర్ మూవీని తీస్తున్నట్టు ప్రకటించాడు. అంతేనా ఈ సినిమా షూటింగ్ ఎప్పుడైందో తెలియదు కానీ అప్పుడే ట్రయిలర్ కూడా రిలీజ్ చేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వర్మ స్పీడ్ మాములుగా లేదుగా..!

ప్రభుత్వాలు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా.. ఎప్పుడు షూటింగ్ లు మొదలు పెడదామా అని ఇన్ని రోజులు ఎదురు చూసారు.. మొత్తానికి సినీ పెద్దలందరూ కలిసి ఇరు ప్రభుత్వాలతో మాట్లాడి అనుమతులు తెచ్చుకున్నారు. మరికొద్దిరోజుల్లో అందరూ షూటింగ్లు మొదలుపెట్టుకోనున్నారు. అయితే ఈ అనుమతులు.. లాక్ డౌన్ మాత్రం వర్మకు కాదనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ పరిస్థితుల్లో షూటింగ్లు ఎలా చేయాలబ్బా అని తలలు పట్టుకుంటుంటే వర్మ మాత్రం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఎప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు కంప్లీట్ చేస్తాడో ఎవరికీ తెలియదు. సడన్ గా సినిమా పోస్టరో.. టీజరో రిలీజ్ చేసి అందరికీ షాకిస్తాడు. ఇప్పటికే మియా…

TFN Adminవాట్సాప్
Sensational Director Ram Gopal Varma New Tweet Goes Viral On Internet
సినిమా వార్తలు

ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుంది..!

పెళ్లి, ప్రేమ, అనుబంధాలు ఇలాంటి కాన్సెప్ట్ లకు దూరంగా వుండే వర్మ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాడట. వర్మ గురించి తెలిసి ఇది నిజం అని నమ్మితే తప్పులో కాలేసినట్టే. అసలు సంగతేంటో తెలుసుకోవాలంటే మాత్రం స్టోరీలోకి వెళ్లాల్సిందే.

TFN Adminవాట్సాప్

షేర్