బొమ్మాకు క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణ లో దొర సాయి తేజ దర్శకత్వంలో ఆర్ జి వి జీవిత చరిత్ర ఆధారంగా “రాము “, రామ్ గోపాల్ వర్మ “, “ఆర్ జి వి ” టైటిల్స్ తో మూడు పార్ట్ లు గా ఆర్ జి వి బయోపిక్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆర్ జి వి కాలేజ్ రోజులు , సినీ జర్నీ , గ్యాంగ్ వార్స్ వంటి అంశాలతో ఈ బయోపిక్ మూవీ రూపొందుతుంది. మొదటి రెండు పార్ట్స్ లో వర్మ గా వేరే నటులు నటిస్తుండగా , మూడవ పార్ట్ “ఆర్ జి వి ” మూవీ లో వర్మ కథానాయకుడిగా నటించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై పలు మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇతరుల జీవిత చరిత్ర లతో మూవీస్ రూపొందించే వర్మ తన బయోపిక్ మూవీ ని తానే రూపొందిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆర్ జి వి బయోపిక్ మూవీ ఫస్ట్ పార్ట్ “రాము ” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ రిలీజ్అయ్యింది. ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రూపొందిన ఆ పోస్టర్ కు ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది. తన జీవిత విశేషాలతో పాటు ఆర్ జి వి తన వైఫల్యాలు కూడా ప్రేక్షకులకు తెలియపరచాలను కొనడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: