“సైకో వర్మ ” మూవీ షూటింగ్ ప్రారంభం

Psycho Varma Movie Shooting Kickstarts In Hyderabad

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై టాలీవుడ్ లో పలు మూవీస్ రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ కూడా తన బయోపిక్ మూవీ ని మూడు పార్ట్ లుగా రూపొందిస్తున్నారు.ఒక దర్శకుడి కి వ్యతిరేకంగా మూవీస్ రూపొందడం తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మొదటిసారి. ఇప్పుడు వర్మ కు వ్యతిరేకంగా మరో మూవీ “సైకో వర్మ ” రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నట్టీస్ ఎంటర్ టైన్ మెంట్స్ , క్విటీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాత , దర్శకుడు నట్టి కుమార్ దర్శకత్వంలో క్రాంతి , కృష్ణ ప్రియా జంటగా వీడు తేడా ట్యాగ్ లైన్ తో “సైకో వర్మ ” మూవీ షూటింగ్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు నట్టి కుమార్ మాట్లాడుతూ .. “సైకో వర్మ ” మూవీలో హీరో క్రాంతి , రామ్ గోపాల్ వర్మ అభిమానిగా నటిస్తున్నారనీ , అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ మూవీ తెరకెక్కుతోందనీ , ఒకప్పుడు అద్భుతమైన మూవీస్ ను తెరకెక్కించిన వర్మ ఇప్పుడు తన పంథా ను మార్చి మూవీస్ రూపొందిస్తున్న విధానాన్ని పోలుస్తూ ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నామనీ , ఇటీవల ఆ సాంగ్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించిందని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =