ట్యాగ్ · 713 కథనాలు · పేజీ 36
హీరో 'సైలెంట్' అయినా సినిమా 'హిట్టే'

జూన్ నుంచి `మెగాస్టార్ 152` షూటింగ్ లో చరణ్?
'విక్రమ్ వేద' రీమేక్ లో..?

నక్సలైట్ పాత్రలో రామ్ చరణ్ ?

మరోసారి రామ్ చరణ్, సమంత జోడి?
'జాను' మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు

మారిన 'RRR' రిలీజ్ డేట్

'ఆర్ఆర్ఆర్' నుండి త్వరలో స్పెషల్ వీడియో..?

'RRR' - సూపర్ స్టార్లతో వాయిస్ ఓవర్..!

`జెర్సీ` దర్శకుడితో రామ్ చరణ్ చిత్రం?
"ఉప్పెన " మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న "ఉప్పెన"మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. "ఉప్పెన " మూవీ తో హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరో గా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కృతి శెట్టి కథానాయిక కాగా తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతి నాయకుడిగా నటించడం విశేషం.
హీరో 'సైలెంట్' అయినా సినిమా 'హిట్టే'
ఒక నటుడిలోని ప్రతిభ ఏంటన్నది అతను చేసే పాత్ర ద్వారా బయటవస్తుంది. అంతేకాదు ఎలాంటి పాత్రనైనా సరే అందులో జీవించి ప్రేక్షకుడితో చప్పట్లు కొట్టించుకునేవాడే అసలైన నటుడు. మన తెలుగులో కూడా అలాంటి నటులు చాలా మందే వున్నారు. కేవలం నాలుగు ఫైట్స్, ఆరు పాటలు, ఓ పది మాస్ డైలాగ్స్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనుకునే రోజులు పోయాయి. ప్రేక్షకుడి ఆలోచనా ధోరణి మారింది. అందుకే మన హీరోలు కూడా ఒకే చట్రంలో ఉండకుండా తమను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చేసిన ఒక ప్రయోగమే సైలెంట్ అండ్ సెటిల్డ్ గా నటించడం. నిజానికి ఇదే చాలా కష్టం. కానీ మన హీరోలు మాత్రం మేము ఏదైనా చేయగలం అని సైలెంట్ నటనతో కూడా నటించి…

జూన్ నుంచి `మెగాస్టార్ 152` షూటింగ్ లో చరణ్?
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ బడ్జెట్ మూవీ `ఆర్ ఆర్ ఆర్` కోసం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సదరు సినిమా చిత్రీకరణలో భాగంగా... అడవి బాట పట్టాడు. కట్ చేస్తే.. మరోమారు మరో పాత్ర కోసం అడవుల వెంట సాగనున్నాడట ఈ కొణిదెల స్టార్.
ప్రమోషనల్ సాంగ్ తో "RRR" మూవీ షూటింగ్ పూర్తి
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ సుమారు 400కోట్ల బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా "RRR" మూవీ 2021 వ సంవత్సరం జనవరి 8వ తేదీ సంక్రాంతి కానుకగా సుమారు 10 భాషలలో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.
'విక్రమ్ వేద' రీమేక్ లో..?
విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో తమిళంలో వచ్చిన 'విక్రమ్ వేద' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సినిమాను ఎప్పటినుండో రీమేక్ చేయాలని చూస్తున్న సంగతీ విదితమే. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను గీతా ఆర్ట్స్ సంస్థ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు అప్పట్లో రానా - రవితేజ పేర్లు వినిపించాయి. అయితే అప్పటినుండి ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే తాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది.

నక్సలైట్ పాత్రలో రామ్ చరణ్ ?
కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఆచార్య" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ రూపొందించే దర్శకుడు కొరటాల శివ "ఆచార్య" మూవీ ని మెసేజ్ తో పాటు కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ త్రిష కథానాయిక.

మరోసారి రామ్ చరణ్, సమంత జోడి?
బ్లాక్ బస్టర్ మూవీ `రంగస్థలం`లో జంటగా నటించి మెప్పించారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ బ్యూటీ సమంత. అందులో చిట్టిబాబు, రామలక్ష్మిగా ఇద్దరూ పోటాపోటీగా నటించారు. కట్ చేస్తే.. రెండేళ్ళ తరువాత ఈ ఇద్దరూ మరోమారు జట్టుకట్టనున్నారట.
'జాను' మూవీపై రామ్ చరణ్ ప్రశంసలు
సమంత తాను ఇంట్లో వుండే నేను లేనని చెప్పించినా... శర్వా తాను చేయగలనా అని ఆలోచించినా నన్ను నమ్మండి అని వారికీ భరోసా ఇచ్చి మరీ సినిమాను రీమేక్ చేసాడు దిల్ రాజు. ఇంతకీ ఆ సినిమా ఏంటో స్ట్రైక్ అయివుంటుంది కదా. అదే '96' రీమేక్ జాను. తమిళ్‌లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన క్లాసిక్ ప్రేమకథ ‘96'. ఇక ఈ సినిమాను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా, సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 7న (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా చూసిన…

రాజమౌళి ఫస్ట్ పొంగల్ ఫిల్మ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?
యస్. యస్. రాజమౌళి.. అపజయమంటూ ఎరుగని మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్. `స్టూడెంట్ నంబర్ 1` నుంచి `బాహుబలి - ది కంక్లూజన్` వరకు జక్కన్న రూపొందించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

మారిన 'RRR' రిలీజ్ డేట్
మొత్తానికి అనుకున్నదే జరిగింది. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ విషయంలో గతకొద్ది రోజులుగా పలు వార్తలు వినిపిస్తూనే వున్నాయి. 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని.. ముందు ఫిక్స్ చేసిన డేట్ కు రావడం కష్టమే అన్న వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆ వార్తలు నిజమే అని తేలిపోయింది. నిజంగానే ఈ సినిమా రిలీజ్ డేట్ మారింది. ఈ విషయాన్నీ చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

'ఆర్ఆర్ఆర్' నుండి త్వరలో స్పెషల్ వీడియో..?
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

'RRR' - సూపర్ స్టార్లతో వాయిస్ ఓవర్..!
రాజమౌళి ఏం చేసినా తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. అలా తన డిఫరెంట్ థింకింగ్ లో నుండి వచ్చిన సినిమాలే ఒక మగధీర అయినా... బాహుబలి సిరీస్ అయినా.. ఇప్పుడు వస్తున్న 'ఆర్ఆర్ఆర్' అయినా. బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.

`జెర్సీ` దర్శకుడితో రామ్ చరణ్ చిత్రం?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బడా మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. కాగా, ఏప్రిల్ లేదా మే నాటికి చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో.. చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. `మళ్ళీ రావా`, `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చెర్రీ తదుపరి సినిమా ఉంటుందని తెలిసింది. ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తారని ప్రచారం…