‘విక్రమ్ వేద’ రీమేక్ లో..?

Mega Power Star Ram Charan To Be A Part Of Vikram Vedha Remake

విజయ్ సేతుపతి, మాధవన్‌ ప్రధాన పాత్రల్లో తమిళంలో వచ్చిన ‘విక్రమ్ వేద’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సినిమాను ఎప్పటినుండో రీమేక్ చేయాలని చూస్తున్న సంగతీ విదితమే. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను గీతా ఆర్ట్స్ సంస్థ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. అంతే కాదు అప్పట్లో రానా – రవితేజ పేర్లు వినిపించాయి. అయితే అప్పటినుండి ఇప్పటివరకూ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే తాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మళ్లీ ఇప్పుడు అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టు ను పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే తమిళంలో మాధవన్ చేసిన పాత్రను చరణ్ తో చేయిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. మరో పాత్రను రవితేజతో చేయించాలా? రానాను తీసుకోవాలా? అని ఆలోచిస్తున్నారట. 2022లో ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళుతుందని అంటున్నారు.

[custom_ad]

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న చెర్రీ.. ఇది పూర్తి కాగానే చిరు, కొరటాల మూవీలో ఓ కీ రోల్ చేయనున్నారు. ఇక ఆ తర్వాత సుకుమార్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. ఇవన్నీ ముగిసేసరికి 2021 అవ్వచ్చు. దీనితో 2022 లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ వుంది. మరి అంత లేట్ చేస్తారా..? వచ్చే ఏడాదే చేస్తారా..? అసలు ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + twelve =