
ట్యాగ్ · 16 కథనాలు


కూలీ అప్డేట్ రానుంది

కూలీలో పూజా హెగ్డే

కూలీ నుండి చికిటు వైబ్ రిలీజ్

కూలీ షూటింగ్ అప్డేట్

కూలీ షూటింగ్ లో జాయిన్ అయిన నాగ్

కూలీలో దేవాగా రజనీ

కూలీలో నాగార్జున

కూలీలో మంజుమ్మల్ బాయ్స్ నటుడు

కూలీ షూటింగ్ అప్డేట్

తలైవా కోసం విలన్ గా?

తలైవా కూలీ షూటింగ్ మొదలు

హైదరాబాద్ లో కూలీ స్టార్ట్

జులై నుండి తలైవా కూలీ మొదలు

రజినీకాంత్ కూలీ షూటింగ్ అప్డేట్

వార్ 2తో తలపడనున్న కూలీ
సూపర్ స్టార్ రజినీకాంత్ ,సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇందులో కింగ్ నాగార్జున కూడా నటిస్తుండడంతో తమిళ్ తోపాటు తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఆగస్టు 14న కూలీ విడుదలకానుంది.అయితే అదే రోజున వార్ 2 కూడా విడుదలకానుంది.

కూలీ అప్డేట్ రానుంది
వేట్టయన్ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీతో రానున్నాడు.సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా కింగ్ నాగార్జున ,ఉపేంద్ర , శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. షూటింగ్ కూడా పూర్తికావచ్చింది.ఇక ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసే యోచన లో వున్నారు మేకర్స్.అన్ని కుదిరితే లోకేష్ బర్త్ డే మార్చి 14న ఈసినిమా టీజర్ వచ్చే ఛాన్స్ వుంది.లేదంటే మరో అప్డేట్ ఏదైనా ఇవ్వాలని చూస్తున్నారు.

కూలీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది - సందీప్ కిషన్
సూపర్ స్టార్ రజినీకాంత్ ,యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.రజినీ, లోకేష్ కి తోడు కింగ్ నాగార్జున పవర్ ఫుల్ పాత్ర చేస్తుండడం తో తమిళ్ తోపాటు తెలుగులోకూడా ఈసినిమాకు భారీ హైప్ వుంది.దీనికి తోడు లోకేష్ విక్రమ్ ,లియో రూపంలో వరుసగా రెండు భారీ హిట్లు ఇచ్చి ఉండడంతో కూలీ కోలీవుడ్ ఫస్ట్ 1000 కోట్ల సినిమా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కూలీలో పూజా హెగ్డే
సూపర్ స్టార్ రజినీకాంత్ ,సెన్సేషనల్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు.ఇక ఈసినిమా నుండి లేటెస్ట్ గా ఓ అప్డేట్ వచ్చింది.ఈసినిమా కోసం పూజా హెగ్డే ను తీసుకున్నారు.ఈ సందర్భంగా పూజా హెగ్డే ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.రేపు ఉదయం 11 గంటలకు పూజా పూర్తి లుక్ ను రివీల్ చేయనున్నారు.అయితే ఇందులో తను స్పెషల్ సాంగ్ లో కనిపించనుందని సమాచారం.

కూలీ నుండి చికిటు వైబ్ రిలీజ్
సూపర్ స్టార్ రజినీకాంత్,యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా చీకిటు వైబ్ అనే వీడియో ను విడుదలచేసి రజినీకి విషెష్ చెప్పింది టీం.ఈ డాన్స్ వీడియోలో రజినీకాంత్ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించారు.తన లుక్ కూడా బాగుంది.ఇక హీరోలను నెక్స్ట్ లెవెల్లో ఎలా చూపించాలో లోకేష్ కు బాగా తెలుసు.దాంతో కూలీ లో రజినీ బెస్ట్ లుక్ ను చూడనున్నాం.ఫిబ్రవరి లో షూటింగ్ కంప్లీట్ చేసి మే 1న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు.

కూలీ షూటింగ్ అప్డేట్
సూపర్ స్టార్ రజినీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు.దాంతో ఈసినిమాపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇక రీసెంట్ గా ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగగా అందులో నాగార్జున కూడా పాల్గొన్నాడు.నెక్స్ట్ షెడ్యూల్ రేపు చెన్నై లో స్టార్ట్ కానుంది.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు ను చిత్రీకరించనున్నారు.ఇందుకోసం భారీ సెట్ వేశారు.ఈ షెడ్యూల్ లో రజినీకాంత్ కూడా పాల్గొననున్నాడు.

కూలీ షూటింగ్ లో జాయిన్ అయిన నాగ్
సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.రీసెంట్ గా ఈసినిమా నుండి పాత్రలను పరిచయం చేశారు.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడని తెలిసిందే.సైమన్ అనే పాత్రలో కనిపించనున్నాడు నాగ్.గత కొద్దీ రోజుల నుండి ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. ఇక ఈ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు నాగార్జున. ఈసినిమాలో తను నెగిటివ్ షేడ్స్ లో కనబడనున్నాని టాక్.దాంతో నాగ్ ను లోకేష్ ఎలా చూపించనున్నాడోని ఫ్యాన్స్ లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.

కూలీలో దేవాగా రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్- యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ.రీసెంట్ గానే మొదటి షెడ్యూల్ కంప్లీట్ కాగా ప్రస్తుతం వైజాగ్ లో సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది.ఇక కాస్టింగ్ తోనే సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.సౌత్ లోని స్టార్స్ ను ఇందులో కీలక పాత్రల్లో తీసుకున్నారు.అందులో భాగంగా కింగ్ నాగార్జున ను సైమన్ గా ఉపేంద్ర ను కలీషా అలాగే శృతి హాసన్ ను ప్రీతి గా పరిచయం చేశారు.ఇక రజనీకాంత్ పాత్ర పేరు కూడా రివీల్ చేశారు.రజనీ ఇందులో దేవాగా కనిపించనున్నాడు.

కూలీలో నాగార్జున
సూపర్ స్టార్ రజినీకాంత్ -లోకేష్ కనగరాజ్ ల కూలీకి మరింత స్టార్ పవర్ ఆడ్ అయ్యింది.నిన్నటి నుండి ఈసినిమా లోని పాత్రలను పరిచయం చేస్తూ వస్తుంది టీం.అందులో భాగంగా ఈరోజు మరో పాత్రను పరిచయం చేశారు.ఇక ఆ పాత్ర ఏంటంటే సైమన్.దీన్ని కింగ్ నాగార్జున ప్లే చేస్తున్నాడు.అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదలచేశారు.ఈపోస్టర్ లో నాగ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు.ఈసినిమాలో నాగార్జున నెగిటివ్ షేడ్స్ లో కనబడనున్నాని టాక్.మొత్తానికి నాగ్ బర్త్ డే రోజు సూపర్ సప్రైజ్ ఇచ్చారు మేకర్స్.

కూలీలో మంజుమ్మల్ బాయ్స్ నటుడు
గత ఏడాది జైలర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్.ఈసినిమా తరువాత రీసెంట్ గా లాల్ సలామ్ తో ప్రేక్షకులను పలకరించాడు అయితే ఇందులో హీరోగా కాదు ఓ కీలక పాత్ర చేశాడు.ఇక రజనీ హీరోగా వేట్టాయాన్ అనే సినిమాను పూర్తి చేశాడు.జై భీం ఫేమ్ టిజి జ్ఞానవేల్ తెరకెక్కిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న విడుదలకానుంది.

కూలీ షూటింగ్ అప్డేట్
సూపర్ స్టార్ రజినీకాంత్-యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న సినిమా కూలీ.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.రజినీ ఈ లాంగ్ షెడ్యూల్ లో ఈనెల 25న జాయిన్ కానున్నాడు.ఇంతకుముందు చెన్నైలో జరిగిన షెడ్యూల్ లో ఓ మాస్ సాంగ్ ను చిత్రీకరించారు.లోకేష్ మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది విడుదలకానుంది.

తలైవా కోసం విలన్ గా?
ఈ ఏడాది లాల్ సలామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తలైవా రజినీకాంత్. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం తను పలు సినిమాలో బిజీగా ఉన్నాడు. వాటిలో ఇప్పటికే వెట్టైయాన్ సినిమా షూటింగ్ ముగించుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఈసినిమాలో మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

తలైవా కూలీ షూటింగ్ మొదలు
సూపర్ స్టార్ రజినీకాంత్ వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా కూలీ. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. అయితే జులై నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చారు చిత్రయూనిట్. సూపర్ స్టార్ - లోకి సంభవం బిగిన్స్.. కూలీ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది అంటూ చిత్రనిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

హైదరాబాద్ లో కూలీ స్టార్ట్
జైలర్ బ్లాక్ బాస్టర్ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టైయన్ తో రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న విడుదలకానుంది.

జులై నుండి తలైవా కూలీ మొదలు
ఈవయసులో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే వెట్టైయాన్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న ఈసినిమాలో మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

రజినీకాంత్ కూలీ షూటింగ్ అప్డేట్
గత ఏడాది జైలర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు సూపర్ స్టార్ రజినీకాంత్.ఈసినిమా తరువాత రీసెంట్ గా లాల్ సలామ్ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు అయితే ఇందులో హీరోగా కాదు ఓ కీలక పాత్రలో మాత్రమే కనిపించాడు.ఇక రజనీ హీరోగా రెండు రోజుల క్రితం వేట్టైయన్ అనే సినిమాను పూర్తి చేశాడు.జై భీం ఫేమ్ టిజి జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న ఈసినిమా విడుదలకానుంది.