సూపర్ స్టార్ రజినీకాంత్ వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా రజినీకాంత్ హీరోగా వస్తున్న సినిమా కూలీ. ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు కానీ ఇంతవరకూ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. అయితే జులై నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు దీనిపై అధికారిక ప్రకటన ఇచ్చారు చిత్రయూనిట్. సూపర్ స్టార్ – లోకి సంభవం బిగిన్స్.. కూలీ షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది అంటూ చిత్రనిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా సత్యరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
కాగా ఈసినిమాతో పాటు రజనీకాంత్ వెట్టైయాన్ అనే సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న ఈసినిమాలో మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































