సూపర్ స్టార్ రజనీకాంత్- యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ.రీసెంట్ గానే మొదటి షెడ్యూల్ కంప్లీట్ కాగా ప్రస్తుతం వైజాగ్ లో సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది.ఇక కాస్టింగ్ తోనే సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.సౌత్ లోని స్టార్స్ ను ఇందులో కీలక పాత్రల్లో తీసుకున్నారు.అందులో భాగంగా కింగ్ నాగార్జున ను సైమన్ గా ఉపేంద్ర ను కలీషా అలాగే శృతి హాసన్ ను ప్రీతి గా పరిచయం చేశారు.ఇక రజనీకాంత్ పాత్ర పేరు కూడా రివీల్ చేశారు.రజనీ ఇందులో దేవాగా కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ కాస్టింగ్ పోస్టర్స్ చూస్తుంటే లోకేష్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడనిపిస్తుంది.డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.వచ్చే ఏడాది సమ్మర్ లో కూలీ థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ వుంది.అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
ఇక ఈసినిమా కన్నా ముందు రజనీకాంత్, వేట్టాయాన్ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.జై భీం ఫేమ్ టిజి జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న ఈసినిమా విడుదలకానుంది.మరి గత ఏడాది జైలర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చిన రజనీకి, వేట్టాయాన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: