కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

హైదరాబాద్ లో కూలీ స్టార్ట్

Coolie Shooting Starts From July 5th

హైదరాబాద్ లో కూలీ స్టార్ట్

Coolie Shooting Starts From July 5th

Coolie Shooting Starts From July 5th

జైలర్ బ్లాక్ బాస్టర్ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ వేట్టైయన్ తో రానున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది. జై భీమ్ ఫేమ్ టీజీ జ్ఞానవేల్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న విడుదలకానుంది.

ఇక ప్రస్తుతం రజినీకాంత్ కూలీ లో నటించడానికి రెడీ అవుతున్నాడు.లోకేష్ కనగరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.రీసెంట్ గా టైటిల్ తో పాటు గ్లిమ్స్ ను కూడా రిలీజ్ చేశారు.ఈసినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది.ఈవారంలోనే ఈషూటింగ్ మొదలు కానుంది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు.కూలీలో రజినీని లోకేష్ సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నాడు.

ఈసినిమా కు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.లోకేష్ మేకింగ్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది దాంతో అక్టోబర్ కల్లా షూటింగ్ ను కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా తర్వాత రజనీ కాంత్, జైలర్ 2 లో నటించనున్నాడు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్