సూపర్ స్టార్ రజినీకాంత్,యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా చీకిటు వైబ్ అనే వీడియో ను విడుదలచేసి రజినీకి విషెష్ చెప్పింది టీం.ఈ డాన్స్ వీడియోలో రజినీకాంత్ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించారు.తన లుక్ కూడా బాగుంది.ఇక హీరోలను నెక్స్ట్ లెవెల్లో ఎలా చూపించాలో లోకేష్ కు బాగా తెలుసు.దాంతో కూలీ లో రజినీ బెస్ట్ లుక్ ను చూడనున్నాం.ఫిబ్రవరి లో షూటింగ్ కంప్లీట్ చేసి మే 1న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ మార్క్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కింగ్ నాగార్జున ,ఉపేంద్ర ,శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.ఈసినిమా 1000కోట్ల క్లబ్ చేరుతుందని తమిళ సినీ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.ఇంతవరకు తెలుగు,హిందీ,కన్నడ సినిమాలు మాత్రమే ఈ ఫీట్ సాధించాయి.
ఇక ఈసినిమా తరువాత రజినీకాంత్ ,జైలర్ 2 ను మొదలుపెట్టనున్నారు.నెల్సన్ డైరెక్ట్ చేయనుండగా అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.సన్ పిక్చర్స్ నిర్మించనుంది.గత ఏడాది జైలర్ 600 కోట్లకుపైగా వసూళ్ళను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.దాంతో జైలర్ 2 పై భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమా కూడా 1000కోట్ల రేస్ లో వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: