
ట్యాగ్ · 34 కథనాలు · పేజీ 2


విశాల్ సామాన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్

"F 3" మూవీ క్లైమాక్స్ లో పాన్ ఇండియా సర్ ప్రైజ్

'గౌతమ్' కొత్త సినిమా ప్రారంభం

'తరుణ్ భాస్కర్' స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు

'ఎఫ్ 3' థియేటర్లలోనే..ఈసారి ట్రిపుల్ ట్రీట్

'గని' మేకోవర్ పై చిరు ప్రశంసలు

"గని"మూవీ టీజర్ పై సాయి తేజ్ ట్వీట్

"దృశ్యం 2" మూవీ అఫీషియల్ టీజర్ రిలీజ్

హీరో సూర్య కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీ "జై భీమ్"

సూర్య 'జై భీమ్' ట్రైలర్ రిలీజ్

ఆచార్య.. 'సిద్ధ' టీజర్ కు డేట్ ఫిక్స్
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఆచార్య. ఈసినిమాలో చరణ్ కూడా సిద్ధ అనే ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు-చరణ్ కలిసి నటిస్తే చూడాలన్న ఫ్యాన్స్ కోరిక ఈసినిమాతో తీరబోతుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, పోస్టర్స్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

విశాల్ సామాన్యుడు రిలీజ్ డేట్ ఫిక్స్
విశాల్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన సినిమాలను కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నాడు. రీసెంట్ గానే ఎనిమి సినిమాతో అలరించిన విశాల్ ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా సామాన్యుడు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇంటెన్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

"F 3" మూవీ క్లైమాక్స్ లో పాన్ ఇండియా సర్ ప్రైజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కాంబినేషన్ లో “F 3” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , దసరా స్పెషల్ వీడియో ప్రేక్షకులను…

'థాంక్యూ'.. చైతు ఫస్ట్ లుక్ రిలీజ్
రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమాతో మరోహిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం అయితే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక నేడు నాగ చైతన్య పుట్టినరోజు కావడంతో ఈరెండు సినిమాల నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే బంగార్రాజు సినిమా నుండి నిన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తే ఈరోజు ఉదయం టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు థాంక్యూ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది. ఈసినిమా నుండి చైతన్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక సింపుల్ అండ్ స్టైలిష్‌గా ఉన్న చై ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

"F3 " మూవీ రిలీజ్ ప్లాన్స్ కన్ ఫర్మ్ చేసిన వెంకటేష్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే కాంబినేషన్ లో “F 3” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో అంజలి , రాజేంద్ర ప్రసాద్ , సునీల్ , మురళీశర్మ , సంగీత, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

'గౌతమ్' కొత్త సినిమా ప్రారంభం
బ్రహ్మానందం తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గౌతమ్ మొదట్లో కాస్త సినిమాలు తీసినా తరువాత మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. మంచి సక్సెస్ రాకపోవడం కూడా దీనికో కారణం అయి ఉండొచ్చు. అయితే ఆ మధ్య మను అనే డిఫరెంట్ స్టోరీతో వచ్చాడు కానీ అది కూడా కాస్త నిరాశ పరిచింది. దీంతో మళ్లీ గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. గౌతమ్ హీరోగా సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. సుబ్బు చెరుకూరి ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

'తరుణ్ భాస్కర్' స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు
టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న కొత్త డైరెక్టర్లలో తరు ణ్ భాస్కర్ కూడా ఒకడు. మొదటిసినిమా పెళ్లి చూపులు తోనే తన సత్తా చాటాడు. చిన్న సినిమా తీసి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇదిలా ఉండగా వెంకటేష్ తో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య దీనిపై ఎలాంటి న్యూస్ కానీ క్లారిటీ కానీ రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై క్లారిటీ వచ్చింది.

ఓటీటీలలో ఉండే అందం అదే- వెంకటేష్
శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ “దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ "దృశ్యం 2″ మూవీ నవంబర్ 25 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానుంది. రీసెంట్ గా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

'ఎఫ్ 3' థియేటర్లలోనే..ఈసారి ట్రిపుల్ ట్రీట్
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా దృశ్యం 2. దృశ్యం సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నారు. ఈసందర్భంగా వెంకీని పలు ప్రశ్నలు అడుగగా వాటికి సమాధానమిచ్చారు. దీనిలో భాగంగానే.. నారప్ప, ఇప్పుడు దృశ్యం ఈ రెండు సినిమాలు ఓటీటీకి వెళ్లిపోయాయి మరి ఫ్యాన్స్ కి ఎఫ్ 3 తో గట్టి ట్రీట్ ఇస్తారా అన్న ప్రశ్నకు వెంకీ సమాధానమిస్తూ.. తప్పకుండా.. ఈసారి డబుల్ ట్రిపుల్ ట్రీట్ ఖచ్చితంగా నా అభిమానులకు ఉంటుంది. అది కూడా థియేటర్స్ లోనే ఉంటుంది…

'గని' మేకోవర్ పై చిరు ప్రశంసలు
కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వస్తున్న సినిమా 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్, లుక్స్, టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఇలాంటి సినిమాలు తీయాలంటే ఫిజిక్ పరంగా కూడా ఎంత శ్రద్దపెట్టాలో చెప్పనక్కర్లేదు. గంటలకొద్దీ వర్కవుట్స్ చేస్తే కానీ అంత ఫిట్ నెస్, మంచి ఫిజిక్ అనేది రాదు. వరుణ్ కూడా ఈసినిమాలో మేకోవర్ కోసం చాలానే కష్టపడ్డాడు. ఇక ఇప్పుడు వరుణ్ పడిన కష్టంపై మెగాస్టార్ చిరు కూడా స్పందించి ప్రశంసలు కరిపించారు. ఫెంటాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ వరుణ్ అంటూ ట్వీట్ చేశారు…

"గని"మూవీ టీజర్ పై సాయి తేజ్ ట్వీట్
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ డిసెంబర్ 3 వ తేదీ రిలీజ్ కానుంది. ఫస్ట్ టైమ్ బాక్సర్ గా నటించిన వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ ” దబాంగ్ 3″ మూవీ ఫేమ్ సయీ మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

"దృశ్యం 2" మూవీ అఫీషియల్ టీజర్ రిలీజ్
శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ “దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ "దృశ్యం 2″ మూవీ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ”దృశ్యం 2 ” మూవీ లో నదియా , సంపత్ రాజ్ , నరేష్ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

హీరో సూర్య కెరీర్ లో వెరీ స్పెషల్ మూవీ "జై భీమ్"
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన "జై భీమ్" తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్, రావు రమేష్, రజిష విజయన్, మణికందన్, లిజో మోల్ జోస్ ముఖ్య పాత్రలలో నటించారు. సీన్ రోల్డన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సూర్య 'జై భీమ్' ట్రైలర్ రిలీజ్
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సూర్య. గత ఏడాది ఆకాశం నీ హద్దురా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ ఇప్పుడు మరోసారి జై భీమ్ లాంటి మరో వాస్తవిక సంఘటనల ఆధారంగా వస్తున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జ్ఞానవేల్ రచన, దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. 1993లో తమిళనాడులో గిరిజన యువతి కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశంతో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబర్ 2న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా…