
ట్యాగ్ · 53 కథనాలు · పేజీ 3


సెట్స్ పైకి వచ్చిన 'నాగ్'

హైదరాబాద్ లో నాగార్జున మూవీ సెకండ్ షెడ్యూల్

ముహూర్తం ఫిక్స్ చేసిన 'బంగార్రాజు'

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అమితాబ్, నాగ్

ఇజ్రాయేల్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్న కింగ్

హీరో నాగార్జున మూవీ కి స్పెషల్ సెట్

నాగార్జున "తెలుగు సినిమా మ్యూజియం"

"బంగార్రాజు "మూవీ పై నాగార్జున క్లారిటీ

అఖిల్ తో సినిమా పక్కా ఉంది

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాగ్!?

'బంగార్రాజు' కోసం స్వర్గం సెట్
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2016 లో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే. ఈసినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేశాడు. ఇక ఈసినిమా కు సీక్వెల్ ను కూడా ఎప్పటినుండో తీస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సోగ్గాడే సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేయనున్నాడు. ఇక ఎప్పటినుండో అనుకుంటున్నా కూడా అనుకోని కారణాలవల్ల ఈ సినిమా పట్టాలెక్కలేక పోయింది. నాగ్ ఇతర సినిమాలతో బిజీ అవ్వడం.. ఆవెంటనే కరోనా రావడం ఇలా అనేక కారణాల వల్ల బంగార్రాజు సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కనుంది.

సెట్స్ పైకి వచ్చిన 'నాగ్'
ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో ప్రారంభం అవ్వగా కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కూడా బ్రేక్ పడింది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ కు దూరంగా ఉన్న ఈసినిమా కోసం నాగ్ తాజాగా మళ్లీ సెట్స్ పైకి వచ్చాడు.

"బంగార్రాజు "లో మోనాల్ స్పెషల్ సాంగ్ ?
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కనున్న “సోగ్గాడే చిన్నినాయనా “ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ లో హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. నాగార్జున కు జోడీగా శ్రియ నటించనున్నట్టు , నాగచైతన్యకు జోడీగా…

హైదరాబాద్ లో నాగార్జున మూవీ సెకండ్ షెడ్యూల్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో కాజల్ “రా “ఏజెంట్ గా నటిస్తున్నారు. గూఢచారి పాత్రలో కాజల్ నటిస్తున్నారు. కాజల్ క్యారెక్టర్ ఈ మూవీలో హైలైట్ కానుందని సమాచారం. గుల్ పనాగ్, అనిఖ సురేంద్రన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

ముహూర్తం ఫిక్స్ చేసిన 'బంగార్రాజు'
ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో అమితాబ్, నాగ్
రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించగా ఇప్పటివరకూ ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు మరికొందరిని నామినేట్ చేస్తూ.. వారు కూడా మొక్కలు నాటేలా చేస్తూ..అందరూ కలిసి విజయవంతంగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళుతున్నారు.

ఇజ్రాయేల్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటున్న కింగ్
అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ బయట లొకేషన్స్ లలో ఎక్కువ భాగం షూట్ చేయాల్సి ఉంది. కరోనా కారణంగా అది కష్టం కాబట్టి షూట్ కు బ్రేక్ పడింది. అయితే ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణ స్టూడియోలో ఓ ప్రత్యేక సెట్ ను నాగార్జున వేయించినట్టు తెలుస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను కూడా షూట్ చేయనున్నారట.

హీరో నాగార్జున మూవీ కి స్పెషల్ సెట్
వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున , కాజల్ అగర్వాల్ జంటగా ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో కాజల్ “రా “ఏజెంట్ గా నటిస్తున్నారు. దేశ రక్షణ కై ఎంతటి సాహసానికైనా సిద్ధపడే గూఢచారి పాత్రలో కాజల్ నటిస్తున్నారు. కాజల్ క్యారెక్టర్ ఈ మూవీలో హైలైట్ కానుందని సమాచారం.

నాగార్జున "తెలుగు సినిమా మ్యూజియం"
సాంఘిక చిత్రాలతోపాటు భక్తి రస చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగార్జున ప్రస్తుతం సక్సెస్ ఫుల్ "PSV గరుడవేగ" మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ లో నటిస్తున్నారు. నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ "సోగ్గాడే చిన్ని నాయనా " మూవీ సీక్వెల్ "బంగార్రాజు "మూవీ జూలై నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

"బంగార్రాజు "మూవీ పై నాగార్జున క్లారిటీ
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున , రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలోగ్రామీణ నేపథ్యం లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా "సోగ్గాడే చిన్నినాయనా "మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. "సోగ్గాడే చిన్నినాయనా "మూవీకి సీక్వెల్ "బంగార్రాజు " మూవీ రూపొందనుందని చాలాకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

అఖిల్ తో సినిమా పక్కా ఉంది
ఇప్పుడు టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు బాగానే వస్తున్నాయి. దర్శకులు ఆదిశగా కథలు రాస్తుంటే హీరోలు కూడా ఏం ఆలోచించకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం వస్తున్న భారీ మల్టీస్టారర్ అంటే ఆర్ఆర్ఆర్ సినిమా అని చెప్పొచ్చు. ఇంకా ఆచార్య సినిమాలో చిరుతో చరణ్ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు పవన్-రానా మల్టీస్టారర్ గా అయ్యప్పనుమ్ కోషియనుమ్ రీమేక్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో కెరీర్ పై నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అగ్ర హీరోల్లో కింగ్ నాగార్జున కూడా వరుస సినిమాలతో యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన వైల్డ్ డాగ్ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నాగ్!?
కామెడీ ఎంటర్‌టైనర్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుల్లో గోపీచంద్ మలినేని ఒకరు. ‘డాన్ శీను’, ‘బాడీగార్డ్’, ‘బలుపు’ వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీస్‌తో అలరించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్... త్వరలో ‘కింగ్’ నాగార్జునతో జట్టుకట్టనున్నట్టు టాలీవుడ్ టాక్.