
ట్యాగ్ · 52 కథనాలు · పేజీ 3


'మా' రేస్ లో మంచు విష్ణు

విష్ణు మంచు కు జోడీగా చిట్టి
'మోసగాళ్ళు' లో మాస్టర్ మైండ్ నాదే
"మోసగాళ్ళు "ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ సందడి
'ఢీ' సీక్వెల్ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్
‘ఢీ’ సీక్వెల్ ఎగ్జైటింగ్ అప్ డేట్
చిన్న సినిమాల ప్లానింగ్ లో విష్ణు మంచు
భారీ పౌరాణిక చిత్రం లో మంచు విష్ణు
ఎన్ని రోజులు అలా ఉంటావో చూస్తా..!

నాపై వచ్చిన వార్తల్లో నిజం లేదు..
కమర్షియల్ సినిమాలకు కామెడీ యాంగిల్ ను జోడించి ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్లలో శ్రీనువైట్ల పేరు ముందే ఉంటుంది. తన సినిమాల్లో ఉండే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరుస హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా ఉన్నా ఇప్పుడు మాత్రం కాస్త స్లోఅయ్యాడు. దానికి వరుసపరాజయాలే కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు చాాలా గ్యాప్ తరువాత మళ్లీ ఢీ సీక్వెల్ తో అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించారు. కానీ కరోనా వల్ల ఆగిపోయింది.ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

'మా' రేస్ లో మంచు విష్ణు
మా ఎన్నికల టైమ్ స్టార్ట్ అయింది. నిజానికి గత మా ఎన్నికల్లో జరిగినంత రచ్చ మరెప్పుడూ జరగలేదు. శివాజీ రాజా వర్సెస్ నరేష్ ఎపిసోడ్స్ రచ్చకెక్కడం .. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో మా అసోసియేషన్ పరువు పోయినంత పనైంది. దీంతో ఈసారి అలా జరగకుండా ఉండాలని ఇండస్ట్రీ పెద్దలు చూస్తున్నారట. కరోనా కారణంగా 2021-22 సీజన్ కి కొత్త అధ్యక్షుడి ఎంపిక ఇప్పటికే ఆలస్యమైంది. ఈసారి ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే ప్రకటించారు. ఆయన ప్రచారంలో దూసుకుపోతుండగా.. ఇప్పుడు మంచు విష్ణు కూడా ఈ పదవి కోసం పోటీపడుతూ వార్ లోకి వచ్చారు. దీంతో ఈసారి మా ఎన్నికల వేడి ఊపందుకుంది. ఇప్పటికే ఇరు…

విష్ణు మంచు కు జోడీగా చిట్టి
బెల్లీ, కథక్ డ్యాన్సర్ అయిన ఫరియా అబ్దుల్లా బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఫరియా అబ్దుల్లా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ఇంటర్వ్యూ లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ .. “జాతిరత్నాలు ” మూవీ తో తెలుగు నేర్చుకున్నాననీ , నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలు చేయాలనేది తన కోరిక అనీ , తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ ఏ భాషా సినిమాల్లోనైనా నటించడానికి సిద్ధమనీ ,ఏదో ఒకరోజు డైరెక్షన్ చేస్తాననీ ఫరియా చెప్పారు.
'మోసగాళ్ళు' లో మాస్టర్ మైండ్ నాదే
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు చిత్రయూనిట్. రిలీజ్ కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో కావాల్సినంత బజ్ క్రియేట్ చేయడానికే చూస్తున్నారు చిత్రయూనిట్.
"మోసగాళ్ళు "ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ సందడి
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ,సునీల్ శెట్టి ప్రధాన పాత్రలలో ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు "మూవీ మార్చి 19 వ తేదీ రిలీజ్ కానుంది. రూహి సింగ్ , నవీన్ చంద్ర , నవదీప్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో కాజల్ , విష్ణు అక్కా తమ్ముడు గా నటించడం విశేషం. శామ్ సి ఎస్ సంగీతం అందించారు.
'ఢీ' సీక్వెల్ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్
మొత్తానికి అందరూ ఉంహించుకున్నట్టు గానే అప్ డేటే ఇచ్చాడు మంచు విష్ణు. ఇక ఈ సినిమా నుండి ఎగ్జైటింగ్ అప్ డేట్ ఉందని రెండు రోజుల క్రితమే చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు విష్ణు బర్త్‌డే సందర్భంగా ఢీ సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ సందర్భంగా విష్ణు ట్వీట్ చేశాడు. పెద్ద అన్నయ్య శ్రీను వైట్లతో మరోసారి సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉందని.. ఈ సారి "డబుల్ డోస్"(ఢీఢీ) తో వస్తున్నట్టు ప్రకటించారు. ఇక 'ఢీ' కి పనిచేసిన గోపి మోహన్ కూడా ఈ సినిమాకు పనిచేస్తుండటం మరో విశేషం.
‘ఢీ’ సీక్వెల్ ఎగ్జైటింగ్ అప్ డేట్
శ్రీను వైట్ల, మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా 'ఢీ' కు సీక్వెల్ రాబోతున్నట్టు గత రెండు రోజుల నుండి వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఢీ2 కి సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని ఎప్పటినుండో వార్తలు వస్తున్నా దీనిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ కు బ్రేక్ పడినట్లయింది తాజాగా మంచు విష్ణు చేసిన ట్వీట్ తో. ఈ సినిమాకు సంబంధించి ఇక అప్ డేట్ ఇచ్చాడు తన ట్విట్టర్ లో.
ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ - బ్రదర్ అండ్ సిస్టర్ గా కాజల్- విష్ణు..!
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్ ఫస్ట్, సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ లు రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇటీవలే రిలీజ్ చేసిన కాజల్-విష్ణు అర్ధనారీశ్వరం రూపంలో ఉన్న పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
చిన్న సినిమాల ప్లానింగ్ లో విష్ణు మంచు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు విష్ణు మంచు "విష్ణు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఢీ ", "దేనికైనా రెడీ ", "దూసుకెళ్తా " , "ఈడో రకం ఆడో రకం", "లక్కున్నోడు ", "ఆచారి అమెరికా యాత్ర " వంటి కామెడీ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పేరుతో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి , ఆ బ్యానర్ పై "దేనికైనా రెడీ" , "దూసుకెళ్తా" , "పాండవులు పాండవులు తుమ్మెద" , "కరెంట్ తీగ" , "సింగం 123" వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మించారు.
కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నా..వీర జవానుల కథలు నాకు పంపండి..!
సోషల్ మీడియాలో మంచు విష్ణు కాస్త యాక్టీవ్ గానే ఉంటాడు. తన సినిమాలకు సంబందించే కాదు అప్పుడప్పుడు సమాజంలోని విషయాలపై కూడా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియచేస్తుంటాడు. ఇక ఇప్పుడు తాజాగా జన్మనిచ్చిన తల్లి, వీర జవానులు, రైతుల గొప్పతనం గురించి తెలుపుతూ ఒక వీడియోను పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది.
భారీ పౌరాణిక చిత్రం లో మంచు విష్ణు
శివరాత్రి పర్వదిన సందర్భంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక భారీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసారు. 60 కోట్ల భారీ బడ్జెట్ తో మంచు విష్ణు హీరోగా పౌరాణిక చిత్రం "భక్త కన్నప్ప " ను రూపొందించనున్నట్టు మోహన్ బాబు వెల్లడించారు. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
ఎన్ని రోజులు అలా ఉంటావో చూస్తా..!
మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజు పండగే' తో సాయితేజ్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సాయి తేజ్. ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా తెరకెక్కుతుంది. `ఇస్మార్ట్ శంకర్` భామ నభా నటేష్ హీరోయిన్ గా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాను మే డే రోజు అంటే.. 2020 మే 1 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.