‘మోసగాళ్ళు’ లో మాస్టర్ మైండ్ నాదే

Kajal Aggarwal Reveals An Interesting Fact About Mosagallu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mosagallu Movie Promotions,Manchu Vishnu,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Mosagallu,Kajal Aggarwal Speech,Mosagallu Promotions,Mosagallu Telugu Movie Trailer,Suniel Shetty,Navdeep,Naveen Chandra,Sam Cs,Jeffrey Gee Chin,Manchu Vishnu Mosagallu,Mosagallu,Mosagallu Telugu Movie,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Latest Film Updates,Mosagllu Will Definitely Thrill The Audience Says Kajal,Kajal Aggarwal About Mosagllu Movie,Kajal Aggarwal About Her Role In Mosagllu,Kajal Aggarwal Reveals Interesting Fact About Mosagallu,Kajal Aggarwal Character In Mosagallu,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie News

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో వస్తున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు చిత్రయూనిట్. రిలీజ్ కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో కావాల్సినంత బజ్ క్రియేట్ చేయడానికే చూస్తున్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో కాజల్ విష్ణు కు అక్కగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న కాజల్ తన రోల్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. రెగ్యులర్ గా చేసే రోల్ కాకుండా ఈసినిమాలో కాస్త డిఫరెంట్ గా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది.. నా పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.. అలాగే ఛాలెంజింగ్ గా కూడా అనిపించింది. డైరెక్టర్ ఈసినిమా చెప్తున్నప్పుడే నచ్చేసింది.. ఈసినిమాను చూస్తున్నప్పుడు తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు అని చెప్పింది. ఈసినిమాలో అక్కగా చేస్తే ఆడియన్స్ ఒప్పుకుంటారా అని అడిగాను.. డైరెక్ట్రర్ విజన్ ను నమ్మి చేద్దాం.. వర్కవుడ్ అవుతుంది అని విష్ణు చెప్పాడు.. ఈసినిమాలో మాస్టర్ మైండ్ మొత్తం నాదే. నేను అయితే సినిమాను చూడలేదు.. మోహన్ బాబుగారు సినిమా చూసి భావోధ్వేగానికి గురయ్యారు అని తెలిపింది.

కాగా నవదీప్‌, నవీన్‌ చంద్ర, రుహాని సింగ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ సినిమాకు.. శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.