కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Upcoming Movie News

ట్యాగ్ · 14 కథనాలు

సినిమా వార్తలు

నా బిగ్ బ్ర‌ద‌ర్ మహేష్ జెంటిల్‌మెన్

సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్‌తో పాటు ఓ అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. థ‌మ్స్ అప్ యాడ్ కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్త్నున్నారు. తెలుగులో మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా, హిందీలో స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ ఉన్నారు.

TFN Adminవాట్సాప్
When Two Superstars Come Together In One Frame
సినిమా వార్తలు

ఇద్దరు సూపర్ స్టార్లు సేమ్ టు సేమ్

తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి తెరపై కృష్ణ చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగులో మొదటి 70 ఎమ్‌ఎమ్‌ సినిమా... `మోసగాళ్లకు మోసగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కౌబాయ్‌ని ప‌రిచ‌యం చేశారు. ఇంకా జేమ్స్‌ బాండ్‌ చిత్రాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి రికార్డు సాధించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు స్మార్ట్ లుక్

బాలనటుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన మహేష్ బాబు సూపర్ హిట్ "రాజకుమారుడు " మూవీ తో హీరోగా మారి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక మహేష్ బాబు "సర్కారు వారి పాట "మూవీ షూటింగ్ లో పాల్గొంటారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ మోడ్ లో సూపర్ స్టార్

కరోనా కారణంగా లాక్‌డౌన్‌తో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్‌లకు ప్రభుత్వాలు అనుమతులిచ్చినప్పటికీ భయంతో ఇప్పటివరకూ హీరోలెవరూ షూటింగ్‌లను ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే ఇప్పుడిప్పుడే యంగ్ హీరోలు ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి చిన్న చిన్నగా షూటింగ్ లను ప్రారంభిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, కింగ్ నాగార్జున ఇప్పటికే షూటింగ్ లను స్టార్ట్ చేశారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ కూడా షూటింగ్‌కు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే అది సినిమా షూటింగ్ కాదులెండి .. ఏదో వాణిజ్య ప్రకటన షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరుగుతున్నట్టు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్లో లేకపోతే 'మహేష్' అక్కడే.. నమ్రతా

సూపర్‌స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డాన్ లో మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి చెప్పినట్టు నమ్రత గతంలో ఎప్పుడూ చెప్పింది లేదు. ఎప్పుడో ఒకసారి వారికి సంబంధించిన పోస్ట్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కానీ ఇప్పుడు రోజుకో పోస్ట్ అయినా అభిమానులతో పంచుకుంటున్నారు. లేటెస్ట్ గా తీసిన పిక్స్ వీడియోస్ తో పాటు త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్ ఇలా అన్నీ పోస్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ గురించి మరో ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' మోషన్ పోస్టర్ రిలీజ్

తన పుట్టిన రోజు వేడుకలు చేయొద్దని ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచినా తన కొత్త సినిమా సర్కారు వారి పాట సినిమా అప్ డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను కుష్ చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తన తండ్రి సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసాడు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్‌తో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెలంగాణ పోలీసులకు మహేష్ థ్యాంక్స్..!

కరోనా వైరస్ ను అరికట్టేందుకు గాను దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించి అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఏదో నిత్యావసర వస్తువులు.. ఎమర్జెన్సీ అయితేనే కానీ బయటకు పంపించని పరిస్థితి. ఇక ప్రజలు కూడా ఎవరికి వాళ్ళు స్వతహాగా గృహ నిర్బంధంలో వుంటున్నారు. ఇక ఈ కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకోసం పోరాడుతున్న వారు ఎవరైనా వున్నారంటే వాళ్ళు డాక్టర్స్, నర్సులు, పోలీసులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకపక్క వైద్యులు వైరస్ బాధితులను కాపాడటానికి చికిత్స చేస్తుంటే మరోపక్క పోలీసులు ప్రజలు బయట తిరగకుండా... ఎవరికీ వైరస్ అంటకుండా చూడటానికి ప్రయత్నిస్తున్నారు. వారి చేస్తున్న ఈ సేవలకు మనం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ద్విపాత్రాభినయంలో మహేష్..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ ప్రధాన పాత్రలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకొని... రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మహేష్ తిరిగొచ్చిన తర్వాత ఈ సినిమా మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది ఈ సినిమా.

TFN Adminవాట్సాప్
Sarileru Neekevvaru Sets New Record,latest telugu movies news, Mahesh Babu Latest Movie Details, Mahesh Babu latest news, Mahesh Babu Next Film Updates, Mahesh Babu Upcoming Movie News, Sarileru Neekevvaru Movie Record, Superstar Mahesh Babu, Telugu
సినిమా వార్తలు

"సరిలేరు నీకెవ్వరు" మూవీ రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు" మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన "సరిలేరు నీకెవ్వరు" మూవీ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ ను త్రోసిరాజని రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

Team TFNవాట్సాప్
Interesting Coincidence Between Mahesh Babu And Nani, Latest Telugu Movies News, Mahesh Babu Upcoming Movie News, Mahesh Bau Latest News, Nani New Movie Details, Nani Next Film Updates, Natural Star Nani Upcoming Movie News, Superstar Mahesh Babu New
సినిమా వార్తలు

మహేష్ బాటలోనే నాని కూడా వెళ‌తాడా?

2019... సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి వెరీ స్పెష‌ల్ ఇయ‌ర్‌. ఎందుకంటే... ఈ సంవ‌త్స‌రంలోనే క‌థానాయ‌కుడిగా పాతిక చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు మ‌హేష్‌. `మ‌హ‌ర్షి`తో ఈ సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ జ‌ర్నీ కంప్లీట్ చేసుకున్నాడు మ‌న సూప‌ర్ స్టార్‌. క‌ట్ చేస్తే... మ‌హేష్ త‌ర‌హాలోనే మ‌రో హీరో నాని కూడా ఈ సంవ‌త్స‌రం పాతిక చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు. రీసెంట్‌గా రిలీజైన `గ్యాంగ్ లీడ‌ర్‌`తో 24 సినిమాల ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్న నాని... ఇప్పుడు `వి`ని త‌న 25వ చిత్రంగా చేస్తున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... మ‌హేష్ సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్‌ని నిర్మించిన `దిల్‌`రాజునే... ఇప్పుడు `వి`కి కూడా…

Team TFNవాట్సాప్
Italy Stunt Directors Team For Mahesh Babu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu Upcoming Movie News,Mahesh Babu Next Film Updates,Mahesh Babu New Film Updates,Mahesh Babu to play
సినిమా వార్తలు

మహేష్ మూవీ కి ఇటలీ స్టంట్ డైరెక్టర్స్ టీమ్

బ్లాక్ బస్టర్ మహర్షి మూవీ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు 26 వ మూవీ ప్రారంభమైన విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెం ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు మూవీ రూపొందనుంది. రష్మిక కథానాయిక కాగా లేడీ అమితాబ్ విజయ శాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Interesting Fact About Mahesh Babu Directors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu Latest News,Mahesh Babu Upcoming Movie News,Mahesh Babu Next Film Updates,Interesting Fact About Supers
సినిమా వార్తలు

మహేష్ విష‌యంలో సేమ్ టు సేమ్‌...

మ‌హ‌ర్షితో 25 చిత్రాల మైలురాయికి చేరుకుంటున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేస‌వి కానుక‌గా మే 9న తెర‌పైకి రానుంది. ఆ త‌రువాత‌… త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు ఈ ఘ‌ట్ట‌మ‌నేని హ్యాండ్స‌మ్ హీరో. కాగా… మహేష్ 25, 26వ చిత్రాల‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఉంది. అదేమిటంటే… ఆయా చిత్రాల ద‌ర్శ‌కుల కెరీర్‌లో స‌ద‌రు సినిమాలు సంఖ్యా ప‌రంగా ఒక‌టే కావ‌డం.

Team TFNవాట్సాప్
Mahesh Babu To Release 2 Movies in 2020?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mahesh Babu New Movie News,Mahesh Babu Upcoming Movie News,Mahesh Babu Next Film Updates,Superstar Mahesh Babu Next Fil
సినిమా వార్తలు

త‌క్కువ గ్యాప్‌లో... రెండు చిత్రాల‌తో మ‌హేష్‌ బాబు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న 25వ చిత్రం `మ‌హ‌ర్షి`ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. వేస‌వి కానుకగా ఏప్రిల్ 25న ఈ సినిమా సెల్యులాయిడ్ పైకి రానుంది. ఆ త‌రువాత రెండు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌ను ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు మ‌హేష్‌. వాటిలో ఒక‌టి అనిల్ రావిపూడి కాంబినేష‌న్ మూవీ కాగా... మ‌రొక‌టి సుకుమార్ కాంబినేష‌న్ మూవీ. అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ జూలైలో ప్రారంభ‌మై... 2020 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంద‌ని స‌మాచారం. అలాగే సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సినిమా... జూలై నెలాఖ‌రులో లేదా ఆగ‌స్టు ప్ర‌థ‌మార్ధంలో ప్రారంభమై 2020 వేస‌వికి రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Mahesh Babu Next Film Details, Mahesh Babu To Play Cricketer Role, Mahesh Babu Upcoming Movie Latest News, Mahesh Babu Upcoming Movie News, Superstar Mahesh Babu Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywo
సినిమా వార్తలు

క‌్రికెట‌ర్ అవ‌తార‌మెత్తుతున్న మ‌హేష్ బాబు?

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం క్రికెట్ సీజ‌న్ న‌డుస్తోంది. `జెర్సీ`లో నేచుర‌ల్ స్టార్ నాని, `మ‌జిలీ`లో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌, `డియ‌ర్ కామ్రేడ్‌`లో సెన్సేష‌న‌ల్ హీరోయిన్‌ ర‌ష్మిక మంద‌ణ్ణ క్రికెట‌ర్ పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నారు. అంతేకాదు...ఈ జాబితాలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా చేరుతున్నాడ‌ని టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే... ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `మ‌హ‌ర్షి`.

Team TFNవాట్సాప్

షేర్