
ట్యాగ్ · 12 కథనాలు


మహేష్ బాబు సినిమాతో బిజీ

పలు భాగాలుగా తెరకెక్కనున్న #SSMB 29

#SSMB 28.. వర్క్ అండ్ చిల్

సోషల్ మీడియాలో 'సరిలేరు నీకెవ్వరు'

'మహేష్' సినీ ప్రస్థానానికి 42 ఏళ్లు..!

"#SSMB 28 "షూటింగ్ నవంబర్ లో ?

'మహేష్' బర్త్ డే బ్లాస్టర్ కు టైమ్ ఫిక్స్

ఫ్యాన్స్ కు సూపర్ స్టార్ రిక్వెస్ట్

SSMB28 అప్ డేట్ లోడింగ్
గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది.

మహేష్ బాబు సినిమాతో బిజీ
దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ అంటే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సారి వస్తున్న కాంబినేషన్ కాబట్టి అందరూ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కోసం ఇప్పటికే ఒక సాలిడ్ కథను సిద్దం చేసే పనిలో ఉన్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇక ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో ఈసినిమా అడ్వంచరస్ థ్రిల్లర్ గా ఉంటుందని.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతోందని…

పలు భాగాలుగా తెరకెక్కనున్న #SSMB 29
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకె క్కుతుంది. ఈమూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ #SSMB29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

"సర్కారు వారి పాట "మూవీ అప్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

#SSMB 28.. వర్క్ అండ్ చిల్
ప్రస్తుతం మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మహేష్ మోకాలికి సర్జరీ అవ్వడంతో షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. నిజానికి మెుదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారు.. కానీ ఆతరువాత ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సోషల్ మీడియాలో 'సరిలేరు నీకెవ్వరు'
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న మహేష్ సోషల్ మీడియాలో కూడా అదే హవా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం హీరోలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చూస్తూనే ఉన్నాం. తమ సినిమాల గురించి వ్యక్తి గత విషయాలు ఇంకా ఏదైనా అప్ డేట్ ఇవ్వాలన్నా ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాల ద్వారానే తెలియచేస్తున్నారు.

'మహేష్' సినీ ప్రస్థానానికి 42 ఏళ్లు..!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరకంగా నెంబర్ వన్ హీరోగా కెరీర్ లో దూసుకుపోతున్నారు. సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ తన నటనతో.. ప్రయోగాత్మక సినిమాలతో ఇప్పుడు టాప్ లో ఉన్నాడు. ఇక టాలీవుడ్ లో అందగాడు ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు మహేష్. అందుకే టాలీవుడ్ రాకుమారుడు అయ్యాడు.

'సర్కారు వారి పాట' కొత్త రిలీజ్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ముందుగా దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవలే స్పెయిన్ లో కూడా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా షూట్ చేసినట్టు తెలుస్తుంది.

"#SSMB 28 "షూటింగ్ నవంబర్ లో ?
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణ. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. #SSMB 28 ” మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మహేష్-త్రివిక్రమ్ సినిమా.. కాస్ట్ అండ్ క్రూ అప్ డేట్
ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కావడంతో ఆయన నటిస్తున్న సినిమాల నుండి అప్ డేట్ లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సర్కారు వారి పాట నుండి వదిలిన బ్లాస్టర్ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. మిలియన్స్ వ్యూస్ ను సొంతం చేసుకొని కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇక ఈసినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా నుండి కూడా బర్త్ డే అప్ డేట్ వచ్చేసింది.

'మహేష్' బర్త్ డే బ్లాస్టర్ కు టైమ్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట అప్ డేట్ రానే వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఆగష్ట్ 9న మహేష్ పుట్టిన రోజు వస్తుండగా ఆరోజు కూడా ట్రీట్ ఉండబోతుందని ఇప్పటికే చెప్పారు. ఇక చెప్పినట్టే నేడు అప్ డేట్ గురించి అప్ డేట్ ఇచ్చారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9, ఉదయం 9.09గంటలకు `సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్` పేరుతో ట్రీట్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.

ఫ్యాన్స్ కు సూపర్ స్టార్ రిక్వెస్ట్
కరోనా వల్ల హీరోలు తమ బర్త్ డే లను సెలబ్రేషన్స్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు తమ అభిమాన హీరో పుట్టినరోజును వేడుకలను జరిపే అవకాశం లేకుండా పోయింది. లేకపోతే ఫ్యాన్స్ చేసే హడావుడి మాములుగా ఉండదు. ఇక మరో మూడు రోజుల్లో మహేష్ బాబు బర్త్డే వస్తున్న సంగతి తెలిసిందే కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టి ఆనందపడాల్సిందే కానీ బహిరంగ కార్యక్రమాలు చేయలేని పరిస్థితి. ఇక తన పుట్టిన రోజుకు మహేష్ ఫ్యాన్స్ కు ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అదేంటంటే..తన బర్త్ డే సందర్భంగా తన అభిమానులను మొక్కలు నాటాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.