
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 24


ఛావా తెలుగు లో గ్రాండ్ రిలీజ్

3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకే రోజు

దిల్రూబా ట్రైలర్ రిలీజ్

త్వరలో శర్వా 36 టైటిల్ అనౌన్స్మెంట్

జాక్ ఫస్ట్ సింగిల్ వస్తోంది

RC 16 కోసం శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ కంప్లీట్

వార్ 2 షూటింగ్ అప్డేట్

VD15 టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు

ప్లీజ్.. ఇకపై నన్ను అలా పిలవొద్దు - నయనతార

ఆల్ టైం టాప్ 4లో ది ప్యారడైజ్ గ్లింప్స్

ఓటీటీ లోకి వచ్చేసిన మనమే
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ల్యాండ్‌మార్క్ 35వ మూవీ 'మనమే' ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 7నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్గా నటించగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, అయేషా ఖాన్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఓటీటీ లోకి వచ్చేసిన తండేల్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కడం విశేషం. నాగచైతన్య తొలిసారిగా ఫిషర్ మ్యాన్ క్యారక్టర్ పోషించడం, ఆయనకు జోడిగా సౌత్ బ్యూటీ సాయిపల్లవి నటించడంతో సినిమాపై ఆసక్తి క్రియేట్ అయింది.

ఛావా తెలుగు లో గ్రాండ్ రిలీజ్
హిందీలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న బాలీవుడ్ సినిమా ఛావాను తెలుగులో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. రేపే ఛావా తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది.మూడు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈసినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 550స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ కూడా బాగున్నాయి.దాంతో మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టుకోనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తుంది.

3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఒకే రోజు
రీసెంట్ గా థియేటర్లలో సూపర్ సక్సెస్ అయిన మూడు సినిమాలు ఒకే రోజు ఓటిటిల్లోకి రానున్నాయి.అందులో భాగంగా తెలుగు నుండి తండేల్ ,మలయాళం నుండి రేఖచిత్రం తమిళ నుండి కుటుంబస్థాన్ రేపు ఓటిటిల్లోకి వస్తున్నాయి.

దిల్రూబా ట్రైలర్ రిలీజ్
ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘దిల్రూబా’. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ మరియు నజియా డేవిసన్ ఫిమేల్ లీడ్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలు మరియు టీజర్ రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

లైలా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ 'మాస్ కా దాస్' విశ్వక్సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో విడుదలకు ముందే మార్కెట్లో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయింది.

శర్వానంద్ సినిమా ఓటీటీ లోకి వస్తోంది
ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన మరియు చేస్తున్న సినిమాలకు సంబంధించి పలు అప్డేట్లు వస్తున్నాయి. దీనిలో భాగంగా తాజాగా ఆయన హీరోగా తెరకెక్కుతోన్న 'శర్వా36' టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రకటించింది.

త్వరలో శర్వా 36 టైటిల్ అనౌన్స్మెంట్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. నేడు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శర్వాకు చిత్రపరిశ్రమ నుండి మరియు అభిమానుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అలాగే మరోవైపు ఆయన నటిస్తున్న కొత్త చిత్రాలకు సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా తాజాగా '#శర్వా36' నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

జాక్ ఫస్ట్ సింగిల్ వస్తోంది
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ - కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.

సంబరాల ఏటిగట్టు.. 1,000 మంది డ్యాన్సర్స్‌తో సాంగ్ షూట్
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'సంబరాల ఏటిగట్టు'లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్లో కనిపించనున్నారు. హనుమాన్ సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

కన్నప్ప నుండి త్వరలో లవ్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ప్రతీ సోమవారం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేసిన చిత్ర యూనిట్.. అంతకుముందే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మహా శివుడి క్యారక్టర్ పోస్టర్ విడుదలచేసిన సంగతి గుర్తుండేవుంటుంది.

ఏజెంట్ ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో అఖిల్ అక్కినేని , డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏజెంట్.అఖిల్ కు ఇది హీరోగా 5వ సినిమా.ఈసినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడని రిలీజ్ కుముందు వరకు ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.కానీ రిలీజ్ తరువాత దారుణంగా నిరాశపరిచింది.హిట్ కాదు కదా కనీసం యావరేజ్ అనిపించుకోలేకపోయింది.భారీ బడ్జెట్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా ఇందులో మళయాలం స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించాడు.

RC 16 కోసం శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ కంప్లీట్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ఢిల్లీ లో జరుగుతుందని సమాచారం.ఇక ఈసినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నాడు.అందులో భాగంగా ఈరోజు తన పాత్ర తాలూకు లుక్ టెస్ట్ ను కంప్లీట్ చేశారు.త్వరలోనే అయన షూటింగ్ లో జాయిన్ కానున్నారని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

మీనాక్షి చౌదరికి బర్త్ డే విషెస్ చెప్పిన టీమ్ NC24
టాలీవుడ్ లక్కీ గర్ల్ మీనాక్షి చౌదరి నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీమ్ '#NC24' మేకర్స్ ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. కాగా NC24 యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించబోయే తదుపరి చిత్రం అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన 'తండేల్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. చైతు కెరీర్లో ఇది తొలి 100కోట్ల మూవీగా నిలిచి రికార్డ్ సృష్టించింది.

వార్ 2 షూటింగ్ అప్డేట్
ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుంది వార్ 2.ఇందులో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ నటిస్తున్నారు.ప్రస్తుతం ముంబై లో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది.ఇందులో నిన్నటి నుండి ఎన్టీఆర్ ,హృతిక్ లపై పాటను చిత్రీకరిస్తున్నారు.బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీలో సుమారు 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఈ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు.ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది.

VD15 టైటిల్ లీక్ చేసిన దిల్ రాజు
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'కింగ్డమ్' ప్రస్తుతం సెట్స్ పైన ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ అందుకుంది. సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. రీరిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్లో కొన్నేళ్లుగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు ఈ లిస్టులోకి ఓ మల్టీస్టారర్ మూవీ చేరింది.

ప్లీజ్.. ఇకపై నన్ను అలా పిలవొద్దు - నయనతార
ప్రముఖ దక్షిణాది నటి, స్టార్ హీరోయిన్ నయనతార అభిమానులకు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. ఈ మేరకు ఆమె తాజాగా సోషల్ మీడియా వేదికగా బహిరంగ లేఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా నయనతార తన ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ఒక విజ్ఞప్తి చేశారు. ఇకపై తనను 'లేడి సూపర్ స్టార్' అని సంభోదించవద్దని కోరారు. అభిమానులతో అలా పిలిపించుకోవడం తనకు ఇష్టమే అయినా కూడా ఇప్పటినుంచి మాత్రం వద్దని స్పష్టం చేశారు.

రాబిన్‌హుడ్ లాంటి సినిమా చేసి చాలా కాలమైంది - రాజేంద్రప్రసాద్
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'రాబిన్‌హుడ్'. శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు, నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒక కీలక పాత్ర పోషించారు.

ఆల్ టైం టాప్ 4లో ది ప్యారడైజ్ గ్లింప్స్
భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ గ్లింప్స్ సెన్సేషనల్ వ్యూస్ ను దక్కించుకుంది. 24గంటల్లో ఈ గ్లింప్స్ తెలుగులో 17.14 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది.దాంతో టాలీవుడ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను పొందిన నాలుగో గ్లింప్స్ గా ది ప్యారడైజ్ రికార్డు సృష్టించింది. ఓవరాల్ గా అన్ని భాషల్లో కలిపి 23 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.ఏకంగా ఈ గ్లింప్స్ 8భాషల్లో రిలీజయ్యింది.