డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ – కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ‘జాక్- కొంచెం క్రాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ మూవీ గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన జాక్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్‌డేట్ అందించారు. మార్చి 7న జాక్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది. ఈ సందర్భంగా ఎక్స్‌లో విడుదలచేసిన పోస్టర్‌లో సిద్దు లుక్ ఆకట్టుకుంటోంది.
కాగా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో మెప్పించనున్నారు. మొత్తానికి క్రాక్ గాడుగా కనిపించే జాక్ పాత్రలో సిద్ధుజొన్నలగడ్డ ప్రేక్షకులను మెప్పించటం ఖాయంగా కనిపిస్తోంది. సరికొత్త జోనర్, ఫ్రెష్ కామెడీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. కంపోజర్ అచ్చు రాజమణి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన సౌండ్ ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు.
ఇక ఇదిలావుంటే, మరోవైపు ఇదే నెలలో క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబోలో వస్తోన్న ‘ఘాటి’ చిత్రం రిలీజ్ కానుంది. ఏప్రిల్ 18న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలవుతోంది. అలాగే మే 1న నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ‘హిట్ 3’ రిలీజ్ అవుతోంది. దీంతో ఈసారి సమ్మర్ సీజన్ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: