యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కడం విశేషం. నాగచైతన్య తొలిసారిగా ఫిషర్ మ్యాన్ క్యారక్టర్ పోషించడం, ఆయనకు జోడిగా సౌత్ బ్యూటీ సాయిపల్లవి నటించడంతో సినిమాపై ఆసక్తి క్రియేట్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఫ్రిబవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఓవరాల్ గా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చైతూ కెరీర్ లో తొలిసారి 100కోట్ల క్లబ్‌లోకి ఎంటరైన మొదటి చిత్రంగా నిలిచింది. అంతకుముందు ఓవర్సిసిస్ ఎర్నింగ్‌లో $1 మిలియన్ మార్క్ దాటింది.
ఈ నేపథ్యంలో తండేల్ ఓటీటీ ఎంట్రీ కోసం మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా శుక్రవారం ఉదయం నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. కాగా, థియేటర్స్‌లో ఆడియెన్స్ ను అలరించిన తండేల్ ఇప్పుడు ఓటీటీ లవర్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
కథ:-
తండేల్.. సముద్రంలో తప్పిపోయిన ఒక మత్స్యకారుడైన రాజు (నాగ చైతన్య) కథ. సత్య (సాయి పల్లవి) తో ప్రేమలో ఉంటాడు. రాజు నేతృత్వంలో చేపల వేటకోసం మరబోటులో సంద్రంలోకి వెళ్లిన కొందరు మత్స్యకారులు పొరపాటున భారత అధీనరేఖను దాటి పాకిస్తాన్ జలాల్లోకి వెళ్తారు. దీంతో పాకిస్తాన్ నేవి అధికారులు వీరిని భారతీయ ఏజెంట్లు అనే అనుమానంతో బంధించి చిత్రహింసలకు గురిచేస్తారు.
అయితే రాజు తన బృందం వారి బారినుంచి తప్పించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తారు.కానీ, ఈ క్రమంలో వారు అనేక కష్టనష్టాలకు గురవుతారు. వీటన్నింటిని అధిగమించి చివరికి తమవారిని కలుసుకున్నారా? లేదా? ఈ సంఘటన వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? సత్య భయాలు ఎలా నిజమవుతాయి? చివరికి వారి ప్రేమకథ ఏమవుతుంది? అనేదే మిగితా కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























