ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ల్యాండ్‌మార్క్ 35వ మూవీ ‘మనమే’ ఓటీటీ లోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 7నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, అయేషా ఖాన్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రామ్‌సే స్టూడియోస్ ప్రొడక్షన్‌లో నిర్మాత టిజి విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించారు. విడుదలకు ముందే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో మనమే పై హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో మంచి అంచనాలతో మనమే జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కానీ, లవ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. హేషమ్ అబ్దుల్ అందించిన సంగీతం ఆకట్టుకున్నా, చాలా కాలం తరువాత శర్వా మళ్లీ ఎనర్జిటిక్ రోల్‌తో వచ్చినా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం మంచి కాలక్షేపం అనిపిస్తుంది. సో.. ఈ మూవీని థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.
కథ:-
విక్రమ్ (శర్వానంద్) ఎలాంటి గోల్స్ లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. మరోవైపు సుభద్ర (కృతిశెట్టి) అన్నీ పర్ఫెక్ట్ గా ప్లానింగ్ ఉండే అమ్మాయి. ఈక్రమంలో వీరిద్దరూ కలిసి ఖుషిని (విక్రమ్ ఆదిత్య) పెంచాల్సి వస్తుంది. మరి ఆ బాబు ఎవరు..?ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగే విక్రమ్.. అన్నింటినీ పర్‌ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం చేసే సుభద్ర కలిసి పిల్లాడిని ఎలా పెంచారు? పిల్లాడిని పెంచే క్రమంలో విక్రమ్ లో ఎలాంటి మార్పులు వస్తాయి..? చివరికి సుభద్ర, విక్రమ్ రిలేషన్ ఏమవుతుంది? అన్నదే మిగిలిన కథ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: