యంగ్ హీరో అఖిల్ అక్కినేని , డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏజెంట్.అఖిల్ కు ఇది హీరోగా 5వ సినిమా.ఈసినిమాతో బ్లాక్ బస్టర్ కొడతాడని రిలీజ్ కుముందు వరకు ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.కానీ రిలీజ్ తరువాత దారుణంగా నిరాశపరిచింది.హిట్ కాదు కదా కనీసం యావరేజ్ అనిపించుకోలేకపోయింది.భారీ బడ్జెట్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కగా ఇందులో మళయాలం స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈసినిమాను ఓటిటి లోకి వచ్చాక చాలా మంది చూడాలనుకున్నారు కానీ అది కుదరలేదు.సోనీ లివ్ ఈసినిమా డిజిటల్ హక్కులను తీసుకుంది.పలు మార్లు విడుదల తేదీని ప్రకటించాక అడ్డంకులు వచ్చాయి దాంతో వాయిదా వేయకతప్పలేదు.ఇక అసలు విడుదలవుతుందా అని అనుకున్న తరుణంలో ఎట్టకేలకు ఈరోజు స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.685 రోజుల థియేట్రికల్ రిలీజ్ తరువాత ఈ సినిమా ఓటిటి లోకి రానుంది.
ఈనెల 14న ఈసినిమాను తెలుగు తోపాటు అన్ని దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది సోనీ లివ్.మరి ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.తనకు తెలుగులో ఇదే మొదటి సినిమా.ఏకే ఎంటరైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈసినిమాను నిర్మించాడు.
ఇక అఖిల్ ఈసినిమా తరువాత మరో సినిమాను ఇంతవరకు అఫీషియల్ గా ప్రకటించలేదు.అయితే తన నెక్స్ట్ సినిమా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటుందని వార్తలు వస్తున్నాయి.వినరో భాగ్యము విష్ణుకథ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడట.త్వరలోనే ఈసినిమా విషయంలో క్లారిటీ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: