రీసెంట్ గా థియేటర్లలో సూపర్ సక్సెస్ అయిన మూడు సినిమాలు ఒకే రోజు ఓటిటిల్లోకి రానున్నాయి.అందులో భాగంగా తెలుగు నుండి తండేల్ ,మలయాళం నుండి రేఖచిత్రం తమిళ నుండి కుటుంబస్థాన్ రేపు ఓటిటిల్లోకి వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో తండేల్ నెట్ ఫ్లిక్స్ లో రానుంది. గత నెలలో విడుదలైన ఈసినిమా నాగ చైతన్య కు కావాల్సిన విజయాన్ని అందించింది.లవ్ స్టోరీ నేపథ్యంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈసినిమా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది.సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటించగా చందు మొండేటి తెరకెక్కించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఈ రోజు రాత్రి 12 గంటలకు నుండి ఈసినిమా నెట్ ఫ్లిక్స్ అన్నిభాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.
ఇక మలయాళ బ్లాక్ బస్టర్ రేఖాచిత్రం సోనీ లివ్ లో స్ట్రీమింగ్ లోకి రానుంది.జనవరిలో విడుదలైన ఈసినిమా 55 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమాలో అసిఫ్ అలీ ,మమ్ముట్టి ,మనోజ్ కె జయన్ కీలక పాత్రల్లో నటించగా జోఫీన్ టి చాకో డైరెక్ట్ చేశాడు.ఈరోజు రాత్రి 12 గంటలనుండి ఈ సినిమా సోనీ లివ్ లో అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి రానుంది.
ఇక తమిళ బ్లాక్ బస్టర్ కుటుంబస్థాన్ కూడా రేపు హాట్ స్టార్ లో అన్నిభాషల్లో స్ట్రీమింగ్ లో రానుంది.మణికందన్ హీరోగా నటించిన ఈసినిమా జనవరిలో విడుదలై 25 కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.అంతే కాదు ఈఏడాది అత్యధిక వసూళ్లను నాలుగో సినిమాగా రికార్డు సృష్టించింది.రాజేశ్వర్ కలిసామి ఈసినిమాను డైరెక్ట్ చేయగా సాన్వే మేఘన హీరోయిన్ గా నటించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: