టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుల్లో హీరో శర్వానంద్ ఒకరు. నేడు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా శర్వాకు చిత్రపరిశ్రమ నుండి మరియు అభిమానుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అలాగే మరోవైపు ఆయన నటిస్తున్న కొత్త చిత్రాలకు సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయి. దీనిలో భాగంగా తాజాగా ‘#శర్వా36’ నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శర్వాకు బర్త్ డే విషెస్ తెలియస్తూ.. ఈ సినిమా టైటిల్ ని త్వరలోనే ప్రకటించనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇక ఈ సందర్భంగా శర్వానంద్ న్యూ బ్రాండ్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. డర్టీ ట్రాక్‌పై ఒక అడ్వెంచర్ బైక్ పైన శర్వానంద్ స్టయిల్‌గా కూర్చుని ఉన్న పిక్ ఆకట్టుకుంటుంది. పోస్టర్ తోనే మంచి థ్రిల్ రైడ్‌ని అందించనున్నట్టు అర్ధంమవుతుంది.
కాగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం సమకూరుస్తుండగా.. యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్‌గా రాజీవ్ నంబియార్, యాక్షన్ డైరెక్టర్‌గా దిలీప్ సుబ్బరాయన్ పనిచేస్తున్నారు.
కాగా దీనికిముందు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ‘మనమే’ సినిమా శర్వానంద్ కి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీలో ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. ఈ నేపథ్యంలో శర్వా36 చిత్రంతో ఎలాగైనా హిట్ అందుకోవాలని కసిగా వర్క్ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: