కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 151

mr bachchan movie ravi teja release date update
రిలీజ్ అప్‌డేట్

మిస్టర్ బచ్చన్ త్వరలో రిలీజ్ డేట్

రవితేజ నుండి రీసెంట్ గా వచ్చిన సినిమా ఈగల్. ఈసినిమా అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా కూడా రవితేజ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టేశాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్ సినిమా. ఈసినిమా హిందీలో వచ్చిన రెయిడ్ సినిమాకు రీమేక్ అంటున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈసినిమా అక్కడ సూపర్ హిట్ అయింది.

TFN Adminవాట్సాప్
interesting posters released from swag movie
ఫస్ట్ లుక్

స్వాగ్ మూవీ మగజాతి ఆణిముత్యాలు

గత ఏడాది సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో సెకండా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లను ను అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శ్రీవిష్ణు హీరోగా త్వరలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా స్వాగ్. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్‌ కానీ పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Trailer Highlights
ట్రైలర్ & టీజర్

కల్కి 2898 ఏడీ ట్రైలర్ హైలైట్స్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించారు. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ముందుగా ప్రకటించినట్లు సోమవారం రాత్రి కల్కి ట్రైలర్ రిలీజ్ చేసింది. ఊహించినట్లే ఈ సినిమా ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది. ప్రభాస్ అభిమానులకే కాకుండా సినీ ప్రియులు అందరికీ కల్కి…

Srikanth Mవాట్సాప్
Mass Maharaja Ravi Teja's RT75 Launched and Shoot Begins From Today
సినిమా వార్తలు

రవితేజ, శ్రీలీల జంటగా RT75 ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ ఎందరో ఔత్సాహిక దర్శకులకు, నటీనటులకు స్ఫూర్తి. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా యువ దర్శకులతో పని చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను, గుర్తుండిపోయే పాత్రలను అందించారు.

Srikanth Mవాట్సాప్
sharwanand manamey movie 3 days collections
బాక్సాఫీస్

మనమే డీసెంట్ 3 డేస్ కలెక్షన్స్

కెరీర్ ప్రారంభం నుంచీ తనదైన చిత్రాలతో అలరిస్తూ వస్తున్నాడు శర్వానంద్. ఇక రీసెంట్ గా తన నుండి వచ్చిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా హిట్ టాక్ నే సొంతం చేసుకుంది. సినిమా మొత్తం చిన్న పిల్లాడి చుట్టూనే తిరుగుతుంది. ఈనేపథ్యంలోనే శర్వానంద్, కృతి శెట్టి మధ్య వచ్చే సన్నివేశాలు, శర్వానంద్ కామెడీ టైమింగ్, ఎమోషనల్ కంటెంట్ ఇలా అన్నీ సినిమా హిట్ లో ప్రధాన భాగమయ్యాయి.

TFN Adminవాట్సాప్
dhanush raayan movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

రాయన్ రిలీజ్ డేట్ ఫిక్స్

ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన లిస్ట్ లో ప్రస్తుతం పలు సినిమాలు ఉండగా అందులో తన దర్శకత్వంలో వస్తున్న రాయన్ సినిమా కూడా ఒకటి ఉంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. తలవంచి ఎరుగడే, పీచు మిఠాయి అంటూ వచ్చే రెండు పాటలను రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Sikandar shoot to commence on 18th june
సినిమా వార్తలు

సికందర్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే

సౌత్ టాప్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేయనున్నాడని తెలిసిందే. సికిందర్ అనే టైటిల్ తో రానుంది.ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించనుండగా టాప్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్నాడు.ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది.ఈనెల 18నుండి ముంబై లో మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ లో ఎయిర్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.వచ్చే ఏడాది ఈద్ కు సికిందర్ రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Four films will be released this week
సినిమా వార్తలు

ఈవారం విడుదలకానున్న సినిమాలు ఇవే

రెండు వారాలనుండి తెలుగులో కొత్త సినిమాల విడుదల జోరు అందుకుంది.ఈవారం కూడా కొన్ని సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి. అందులో సుధీర్ బాబు హరోం హర ,తమిళ నటుడు విజయ్ సేతుపతి మహారాజ వీటితోపాటు యేవమ్ ,మ్యూజిక్ షాప్ మూర్తి అనే చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి.

TFN Adminవాట్సాప్
kajal satyabhama movie ott partner locked
ఓటీటీ

కాజల్ సత్యభామ ఓటీటీ పార్టనర్ లాక్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలతో బిజీ గానే ఉంది. ఇక రీసెంట్ గా కాజల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా సత్యభామ. సుమ‌న్ చిక్కాల దర్శకత్వంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. అంతేకాదు మొదటిసారి లేడీ ఒరియెంటెడ్ సినిమాతో వచ్చింది. ఇక ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిజం అంశాలను ఈసినిమాలో చూపించారు. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాజల్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.

TFN Adminవాట్సాప్
Kalyan Babu Was Given The Title PAWAN by His Karate Guru Shihan Hussaini
సినిమా వార్తలు

పవర్‌ స్టార్‌ అసలు పేరు వెనుక సీక్రెట్ ఇదే..!

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరు సినీ ప్రియులకు, అభిమానులకే కాకుండా ప్రజలందరికీ సుపరిచితం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో స్టార్‌డమ్ అందుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అచిరకాలంలోనే టాలీవుడ్‍లో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన హీరోగా పలు భారీ ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి. 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', "హరిహర వీరమల్లు - 1 & 2' వంటి తదితర చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలు విడుదల కానున్నాయి.

TFN Adminవాట్సాప్
nani saripodhaa sanivaaram movie first single release date fixed
రిలీజ్ అప్‌డేట్

సరిపోదా శనివారంఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

గత ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు న్యాచురల్ స్టార్ నాని. అందులో దసరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందించగా.. హాయ్ నాన్న సినిమా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈఏడాది మరో సినిమాతో రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. హైద‌రాబాద్ లో వేసిన ఒక భారీ సెట్ లో ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ను చిత్రీక‌రిస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Vidyut Jammwal Joins Shah Rukh Khan and AR Murugadoss Combo Movie
సినిమా వార్తలు

శివ కార్తికేయన్-మురుగదాస్ మూవీలో క్రేజీ స్టార్

కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన హీరోగా నటించిన 'వరుణ్ డాక్టర్', 'డాన్', 'మావీరన్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కొల్లగొట్టాయి. దీంతో తమిళనాట విజయ్, అజిత్, ధనుష్ వంటి అగ్ర హీరోల తర్వాత ఆ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకున్న నటుడిగా శివ కార్తికేయన్ నిలిచాడు. ఇక శివ కార్తికేయన్‌కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరోగా నటించిన 'రెమో', డాక్టర్', 'డాన్', 'మహావీరుడు', 'ఏలియన్' వంటి సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో శివ కార్తికేయన్‌ కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ ప్రాజెక్టుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Trailer out Today at 7pm
ట్రైలర్ & టీజర్

కల్కి ట్రైలర్ రన్ టైం డీటైల్స్

ప్రభాస్ కల్కి 2898 ఏడి ట్రైలర్ మరి కొన్ని గంటల్లో యూట్యూబ్ ను షేక్ చేయనుంది.దాంతో అందరి కళ్ళు ఈట్రైలర్ పైనే వున్నాయి.ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్ కౌంట్ డౌన్ పోస్టర్లు ఇంట్రెస్టింగ్ గా ఉండి అంచనాలు పెంచేశాయి. ఇక ఈ ట్రైలర్ ఈరోజు రాత్రి 7గంటలకు విడుదలకానుంది.3నిమిషాల 10 సెకండ్ల రన్ టైం తో రానున్న ఈ ట్రైలర్ అదిరిపోయిందని ఇన్సైడ్ టాక్. మరోవైపు యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ఎన్ని రికార్డులు సృస్టించిస్తుందోనని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే యూట్యూబ్ లో రిలీజ్ చేసే ఒక గంట ముందు ట్రైలర్ ను థియేటర్లలో ప్లే చేయనున్నారు. చాలా రోజుల తరువాత వస్తున్న పెద్ద సినిమా కావడంతో కల్కికి హైప్ భారీ గా…

TFN Adminవాట్సాప్
Harom Hara to be Released in Nizam by Mythri Movie Distributers
సినిమా వార్తలు

హరోంహర.. నైజాంలో రిలీజ్ చేయనున్న ప్రముఖ సంస్థ

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్‌బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’. ‘ది రివోల్ట్‌’ అనేది ఉపశీర్షిక. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్ ర‌వి కాలే, కేజీఎఫ్ ఫేమ్ ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్, అర్జున్ గోవిందా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సుమంత్‌ జి.నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం జూన్ 14న‌ విడుద‌ల కానుంది.

Srikanth Mవాట్సాప్
producer dhananjeyan smooth warning on kanguva and thangalaan release trolls
సినిమా వార్తలు

తంగలాన్, కంగువ నిర్మాత స్మూత్ వార్నింగ్- ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలుసు

తమిళ్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు కంగువ, తంగలాన్ సినిమాలు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీటిలో తంగలాన్ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. మరోవైపు కంగువ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
daksha nagarkar first look out from swag movie
ఫస్ట్ లుక్

స్వాగ్ లో మరో బ్యూటీ- దక్షా ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎప్పుడూ కాస్త డిఫరెంట్ సినిమాలు ఎంచుకునే శ్రీవిష్ణు కు ఆ మధ్య పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయితే గత ఏడాది సామజవరగమన, ఈ ఏడాది ఓ భీమ్ బుష్ సినిమాలతో విజయాలను అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో స్వాగ్ సినిమా ఒకటి. హసిత్ గోలి దర్శకత్వంలో ఈసినిమా రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Vishwak Sen's Gangs of Godavari OTT Date Locked
ఓటీటీ

ఓటీటీ లోకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించిన తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి'. కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ స‌ర‌స‌న నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా న‌టించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ ఇన్నుమూరి సహ నిర్మాతలు. గోదావరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్‌కి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇక ఈ సినిమాకి సంబంధించి రిలీజైన టీజ‌ర్, ట్రైల‌ర్ సహా ప్రచార చిత్రాలు అన్నీ బాగా ఆక‌ట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Nandamuri Balakrishna and Director Boyapati Sreenu Join Hands For New Film #BB4
సాంగ్

బిగ్ అనౌన్స్‌మెంట్.. బాలయ్య-బోయపాటి కాంబో షురూ

టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్స్‌లో గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు చిత్రాలు రాగా అన్నీ ఒకదానిని మించి ఒకటి బ్లాక్ బస్టర్ అయ్యాయి. తొలిసారిగా వీరి కాంబోలో వచ్చిన మూవీ 'సింహా'. 2010లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2014లో 'లెజెండ్' సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకున్నారు. అనంతరం 2021లో 'అఖండ' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని హ్యాట్రిక్ సాధించారు.

TFN Adminవాట్సాప్
nbk 109 balakrishna birthday glimpse out now
ట్రైలర్ & టీజర్

NBK 109- బాలయ్య బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరోలే ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడానికి కష్టపడుతుంటే సీనియర్ హీరోలు మాత్రం ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అందులో నటసింహం బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ ఏడాది మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ టైటిల్ ను అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఎన్బీకే 109 అనే టైటిల్ తోనే సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
devara movie shooting full swing in goa
షూటింగ్ అప్‌డేట్

గోవాలో బిజీగా దేవర

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి ఇప్పటివరకూ ఎలాంటి సినిమా రాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయి కూడా రెండు సంవత్సరాలు దాటిపోయింది. దీంతో తమ హీరోను సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్