పవర్‌ స్టార్‌ అసలు పేరు వెనుక సీక్రెట్ ఇదే..!

Kalyan Babu Was Given The Title PAWAN by His Karate Guru Shihan Hussaini

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరు సినీ ప్రియులకు, అభిమానులకే కాకుండా ప్రజలందరికీ సుపరిచితం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కెరీర్ ప్రారంభంలోనే వరుస హిట్లతో స్టార్‌డమ్ అందుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అచిరకాలంలోనే టాలీవుడ్‍లో స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన హీరోగా పలు భారీ ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి. ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, “హరిహర వీరమల్లు – 1 & 2′ వంటి తదితర చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమాలు విడుదల కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. మరోవైపు 2014లో ‘జనసేన’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు పవన్ కళ్యాణ్. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నింటినీ గెలుచుకుని రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ భాగం అయ్యారు. ఈ సందర్భంగా తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ.. పవన్‌ని ఉద్దేశించి.. “పవన్ అంటే.. పవనం కాదు, ఒక తుఫాన్” అని వ్యాఖ్యానించారు. దీంతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోయింది.

అయితే, పవన్ కళ్యాణ్ అసలు పేరు వెనుక ఎవ్వరికీ తెలియని ఒక సీక్రెట్ ఉంది. వాస్తవానికి ఆయన పేరు కళ్యాణ్. ఇంట్లో కూడా ఆయనను కళ్యాణ్ బాబు అనే పిలుస్తుంటారు. పవన్ అనేది తొలుత ఆయన పేరులో లేదు, కానీ మధ్యలో పవన్ అనేది చేరింది. దీనివెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. అదేంటంటే..? సినిమాల్లోకి రాకముందు కళ్యాణ్ కొంతకాలంపాటు కరాటే నేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేవాడు. ఇది గమనించిన కరాటే మాస్టర్ షిహాన్ హుస్సేనీ కళ్యాణ్‌కు ‘పవన్’ అని బిరుదు ఇచ్చారు. దీంతో కళ్యాణ్ కాస్తా పవన్ కళ్యాణ్ అయ్యారు. ఇక సినిమాల్లో కూడా ఇదే పేరుతో ఎంట్రీ ఇచ్చి పాపులర్ అయ్యారు. ఇదండీ పవన్ పేరు వెనుక రహస్యం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.