శివ కార్తికేయన్-మురుగదాస్ మూవీలో క్రేజీ స్టార్

Vidyut Jammwal Joins Shah Rukh Khan and AR Murugadoss Combo Movie

కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’, ‘మావీరన్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కొల్లగొట్టాయి. దీంతో తమిళనాట విజయ్, అజిత్, ధనుష్ వంటి అగ్ర హీరోల తర్వాత ఆ స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకున్న నటుడిగా శివ కార్తికేయన్ నిలిచాడు. ఇక శివ కార్తికేయన్‌కి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన హీరోగా నటించిన ‘రెమో’, డాక్టర్’, ‘డాన్’, ‘మహావీరుడు’, ‘ఏలియన్’ వంటి సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో శివ కార్తికేయన్‌ కమల్ హాసన్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ ప్రాజెక్టుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో శివ కార్తికేయన్‌ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే మురుగదాస్‌ మూడేళ్ళ తర్వాత చేస్తుండటం గమనార్హం. రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘దర్బార్’ సినిమానే చివరిది. అయితే ఆ చిత్రం అంచనాలు అందుకోలేక బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఈ క్రమంలో మురుగదాస్, వరుస విజయాలతో ఊపుమీదున్న శివ కార్తికేయన్‌తో చిత్రం చేస్తుండటంతో ప్రాంరంభానికి ముందే ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో శివ కార్తికేయన్ – మురుగదాస్‍ కాంబో మూవీలో నటించే నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ వివరాలపై మూవీ లవర్స్ విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కాగా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోకి మరో స్టార్ నటుడు ఏంటరయ్యాడు. అనేక సినిమాల్లో విలన్‌గా, ఇటీవల హీరోగా నటిస్తున్న విద్యుత్ జమ్వాల్ ఈ క్రేజీ ప్రాజెక్టులోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు సోమవారం చిత్ర యూనిట్ ఆయనకు స్వాగతం పలుకుతూ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.