హరోంహర.. నైజాంలో రిలీజ్ చేయనున్న ప్రముఖ సంస్థ

Harom Hara to be Released in Nizam by Mythri Movie Distributers

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్‌బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’. ‘ది రివోల్ట్‌’ అనేది ఉపశీర్షిక. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్ ర‌వి కాలే, కేజీఎఫ్ ఫేమ్ ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్, అర్జున్ గోవిందా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సుమంత్‌ జి.నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ చిత్రం జూన్ 14న‌ విడుద‌ల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే మూవీ నుంచి టీజ‌ర్‌తో పాటు పాట‌లు విడుద‌ల చేయ‌గా మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతి సందర్భంగా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. కాగా ఈ ట్రైలర్‌ను సుధీర్ బాబు బావ, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేయడం తెలిసిందే. ఇక ఈ ట్రైలర్‌ లాంచ్‌ వేడుకకు దర్శకులు అనిల్‌ రావిపూడి, సంపత్‌ నంది హాజరై సుధీర్‌బాబుకు, టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. హరోంహర సినిమా నైజాం రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ చేజిక్కించుకుంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో రిలీజ్ చేయనుంది. ఈ మేరకు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కాగా మైత్రీ మూవీ గత కొన్ని రోజుల క్రితం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టులోకి మైత్రీ మూవీస్ ఎంటరవడంతో హరోంహర మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ‘హరోంహర’ తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.