
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 141


గుడ్ బ్యాడ్ అగ్లీ సెకండ్ లుక్ రిలీజ్

దర్శన్‌కు మద్దతుగా టాలీవుడ్ యంగ్ హీరో

కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది

సూర్య 44-అండమాన్ లో టీం సందడి

హైదరాబాద్‌లో సందర్శనకు కల్కి బుజ్జి.. ఎక్కడంటే?

నాగ్ అశ్విన్ విజన్‌కి హ్యాట్సాఫ్ - మంచు మనోజ్

కల్కి పై ప్రశాంత్ వర్మ రియాక్షన్- వాట్ ఏ విజన్

కల్కి థియేటర్ వద్ద అకిరా నందన్ సందడి

నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్న వెంకటేష్
సైంధవ్ తరువాత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడని తెలిసిందే.ఈసినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడు.ఈసినిమా వచ్చే నెల మొదటి వారం లో లాంచ్ కానుందని సమాచారం.ఆవెంటనే షూటింగ్ కూడా మొదలు పెట్టనున్నారట.రూరల్ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది.వచ్చే సంక్రాంతి బరిలో నిలువనుంది.లాంచింగ్ రోజు మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.ఇక ఇంతకుముందు వెంకీ, అనిల్, దిల్ రాజు కాంబినేషన్ లో ఎఫ్ 2, ఎఫ్ 3 రాగ ఈ రెండు బ్లాక్ బాస్టర్ అయ్యాయి.మరి ఈ మూడో సినిమాతో హ్యాట్రిక్ కొడతారో లేదో చూడాలి.మరోవైపు ఈసినిమా విజయం సాధించడం వెంకటేష్ కు తప్పనిసరి కానుంది.

కల్కి.. ఫస్ట్ డే హిందీ కలెక్షన్స్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం కల్కి '2898 AD'. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్యువల్ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో గురువారం గ్రాండ్ రిలీజ్ అయింది. విడుదలకు ముందే మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే తొలి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

కల్కి ఫస్ట్ డే దుమ్ముదులిపే కలెక్షన్స్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. ఈసినిమా కోసం ఎంతగానో ఎదురుచూశారో సినీ ప్రేక్షకులు. ఇక వారి ఎదురుచూపులకు నిన్నటితో బ్రేక్ పడింది. ఎన్నో అంచనాల మధ్య నిన్న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాగా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ను అందించింది. యునానిమస్ హిట్ ను అందించారు ప్రేక్షకులు. కలియుగాంతానికి, మహాభారతానికి లింక్ పెట్టి ఈ కథను తీసిన విధానానికి ఫిదా అవ్వడమే కాకుండా నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

కల్కి రికార్డులపై స్వప్న దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సినిమాలు అనేవి రికార్డుల కోసం కాదని, ప్రేక్షకుల కోసం తీసేవి అని పేర్కొన్నారు టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ స్వప్న దత్. తాజాగా ఆమె తన సోదరి ప్రియాంక దత్ మరియు తండ్రి అశ్వనీదత్‌తో కలిసి 'కల్కి 2898 AD'ని నిర్మించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మైథాలజీ-ఇన్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గుడ్ బ్యాడ్ అగ్లీ సెకండ్ లుక్ రిలీజ్
తమిళ హీరో తల అజిత్,మార్క్ ఆంటోనీ ఫేమ్ అద్విక్ రవిచంద్రన్ ,మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ.రీసెంట్ గా హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.వచ్చే నెలలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా నుండి ఇటీవల అజిత్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా నిన్న సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పోస్టర్ లో చేతి పై టాటుతో అజిత్ మాస్ గా కనిపించాడు.

ఓటీటీ లోకి వచ్చేసిన సత్యభామ
రీసెంట్ గా కాజల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వంలో మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. అంతేకాదు మొదటిసారి లేడీ ఒరియెంటెడ్ సినిమాతో వచ్చింది. ఇక ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిజం అంశాలను ఈసినిమాలో చూపించారు. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా కాజల్ నటనకు మంచి ప్రశంసలే దక్కాయి.

స్ట్రీమింగ్ లోకి భజే వాయు వేగం
యంగ్ హీరో కార్తికేయ రీసెంట్ మూవీ భజే వాయు వేగం ఓటిటిలోకి వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక గత నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ ను తెచ్చుకుంది.దాంతో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టుకొని హిట్ అనిపించుకుంది.బెదురులంక తరువాత కార్తికేయకు వరసగా ఇది రెండో హిట్.

దర్శన్‌కు మద్దతుగా టాలీవుడ్ యంగ్ హీరో
కన్నడ స్టార్ హీరో దర్శన్ కలలో కూడా ఎవరికీ హాని తలపెట్టడని పేర్కొన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. అందులో దర్శన్‌కు మద్దతు ప్రకటించిన శౌర్య కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. కాగా నాగశౌర్య చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నార్త్ అమెరికాలో కల్కి విధ్వంసం.. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD' భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్వెల్ చిత్రం బెనిఫిట్ షోల తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇక ఇలాంటి విజువల్ వండర్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదని మూవీ లవర్స్ చెబుతున్నారు.

కంగువ రిలీజ్ డేట్ వచ్చేసింది
ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే పలు పోస్టర్లు, టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

స్ట్రీమింగ్ కు వచ్చేసిన లవ్ మౌళి
జై సినిమాతో హీరో గా తెలుగు తెరకు పరిచయమై ఆతర్వాత హీరో కాకుండా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్. గతకొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నవదీప్ రీసెంట్ గా మరో డిఫరెంట్ సినిమాతో వచ్చాడు. అవనీంద్ర దర్శకత్వంలో నవదీప్ హీరోగా వస్తున్న సినిమా లవ్ మౌళి. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది.

కల్కి.. క్యామియో రోల్స్‌లో మెరిసిన తారలు, ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి మేనియా నడుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'కల్కి 2898 AD'. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు.

సూర్య 44-అండమాన్ లో టీం సందడి
తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే శివ దర్శకత్వంలో కంగువ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈసినిమా ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. దీనితో పాటు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి ఫస్ట్ షాట్ అంటూ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో సూర్య లుక్ ను చూపించారు.

చివరి 30 నిమిషాలు నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది - రాజమౌళి
కల్కి చివరి 30 నిమిషాలు తనను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందని పేర్కొన్నారు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచుకుంది. దీంతో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

కల్కికి హిట్ టాక్.. టీమ్‌కి విజయ్ దేవరకొండ అభినందనలు
తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 AD' చిత్రం ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఫిమేల్ లీడ్ రోల్‌లో కనిపించగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఉలగనాయగన్ కమల్ హాసన్, దిశా పటాని, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు.

హైదరాబాద్‌లో సందర్శనకు కల్కి బుజ్జి.. ఎక్కడంటే?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 'కల్కి' మేనియా నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ ఈ కల్కి 2898 ADని చూసేందుకు బారులుతీరున్నారు.

యూఎస్ ప్రీమియర్లతో కల్కి ఆల్ టైమ్ రికార్డ్
ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి హంగామానే కనిపిస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

నాగ్ అశ్విన్ విజన్‌కి హ్యాట్సాఫ్ - మంచు మనోజ్
డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కి హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు టాలీవుడ్ హీరో మంచు మనోజ్. ఈ మేరకు ఆయన నేడు విడుదలైన 'కల్కి 2898 AD' చిత్రంపై తన స్పందనను తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్.. "ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాకు ప్రపంచం నలుమూలల నుండి అద్భుతమైన మరియు బ్లాక్‌బస్టర్ టాక్ వినిపిస్తోంది! కల్కి 2898 AD టీమ్ మొత్తానికి అభినందనలు! ప్రభాస్ గారిని, సీనియర్ బచ్చన్ గారిని, కమల్ హాసన్ గారిని, దీపికా పదుకొణెను బిగ్ స్క్రీన్ పైన చూడడానికి ఇక వేచివుండలేను" అని అన్నారు.

కల్కి పై ప్రశాంత్ వర్మ రియాక్షన్- వాట్ ఏ విజన్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతగానే ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా కల్కి 2898ఏడి ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈసినిమా ప్రీమియర్ షో నుండే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఎక్కడ చూసినా ప్రస్తుతం కల్కి హంగామానే కనిపిస్తుంది. థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపిస్తుంది. ఇక ఎంతో కాలంగా ఇలాంటి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు అది దక్కడంతో సంబరాలు జరుపుకుంటున్నారు.

కల్కి థియేటర్ వద్ద అకిరా నందన్ సందడి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.