ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి హంగామానే కనిపిస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ కు ముందే ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈసినిమా ప్రీ బుకింగ్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కల్కి సినిమా అక్కడ కేవలం ప్రీమియర్ల రూపంలోనే 3.5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డు అని చిత్ర యూనిట్ పేర్కొంది.
కాగా ప్రభాస్ హీరోగా నటించిన ఈసినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నా బెన్ తదితరులు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























