తమిళ హీరో తల అజిత్,మార్క్ ఆంటోనీ ఫేమ్ అద్విక్ రవిచంద్రన్ ,మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ.రీసెంట్ గా హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.వచ్చే నెలలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా నుండి ఇటీవల అజిత్ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా నిన్న సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ పోస్టర్ లో చేతి పై టాటుతో అజిత్ మాస్ గా కనిపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా సునీల్,ప్రేమలు ఫేమ్ నస్లీన్ కీలక పాత్రలు చేస్తున్నారు.ఇప్పటివరకు అయితే హీరోయిన్ ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు.వచ్చే సంక్రాంతికి ఈసినిమా విడుదలకానుంది.అయితే సంక్రాంతికి విశ్వంభర ,రవితేజ 75 సినిమాలు విడుదలకానున్నాయి దాంతో గుడ్ బ్యాడ్ అగ్లీ కి భారీ పోటీ ఎదురుకానుంది.
ఇక అజిత్ ప్రస్తుతం ఈసినిమాతో పాటు విడా ముయార్చి అనే సినిమాలో కూడా చేస్తున్నాడు.మగిజ్ తిరుమనేని డైరెక్ట్ చేస్తుండగా అర్జున్ సర్జా,త్రిష,ఆండ్రియా జెర్మియా,అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.ఈఏడాది చివర్లో ఈసినిమా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























