పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక విడుదలకు ముందే అనేక రికార్డులు క్రియేట్ చేసిన కల్కి ఇదేక్రమంలో బెనిఫిట్ షోల తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని థియేటర్లలో సైతం సత్తా చూపిస్తోంది. ఇలాంటి విజువల్ వండర్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదని మూవీ లవర్స్ చెబుతున్నారు.
ఈ మైథాలజీ-ఇన్‌స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీకి గ్లోబల్ వైడ్‌గా మ్యాసీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు కల్కిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఈ మూవీని వీక్షించేందుకు థియేటర్‌కు వచ్చాడు. ఇక ఈ సందర్భంగా అకిరా తన స్నేహితులతో కలిసి థియేటర్‌కు వచ్చి సందడి చేశాడు.
ఈ మేరకు గురువారం ఉదయం హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రసాద్స్ ఐ మాక్స్ థియేటర్‌ని సందర్శించాడు అకిరా నందన్. కల్కి టీ షర్ట్స్ వేసుకుని వచ్చిన అకిరా, ఆయన స్నేహితులు థియేటర్ బయటనుంచి లిఫ్ట్ వైపుకు వెళ్తూ మీడియా కంటబడ్డారు. ఇక అకిరా నందన్ ప్రసాద్స్ థియేటర్ వద్ద సందడి చేసిన విజువల్స్ ఎక్స్‌క్లూజివ్‌గా తెలుగు ఫిల్మ్ నగర్ కెమెరాకు చిక్కాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























