ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతగానే ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా కల్కి 2898ఏడి ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక ఈసినిమా ప్రీమియర్ షో నుండే బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. దీంతో ఎక్కడ చూసినా ప్రస్తుతం కల్కి హంగామానే కనిపిస్తుంది. థియేటర్ల వద్ద మాస్ జాతర కనిపిస్తుంది. ఇక ఎంతో కాలంగా ఇలాంటి బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు అది దక్కడంతో సంబరాలు జరుపుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరేంజ్ సినిమాను అందించినందుకు గాను కల్కి టీమ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే సెలబ్రిటీలు సైతం కల్కి సినిమాను చూసి తమ సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. దీనిలో భాగంగానే తాజాగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా తన ట్విట్టర్ ద్వారా.. కల్కి సినిమా స్పెక్టాక్యులర్ బ్లాక్ బస్టర్.. నాగ్ అశ్విన్ వాట్ ఏ విజన్ అంటు పోస్ట్ లో పేర్కొన్నాడు.
కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఫ్యూచరిస్ట్ కథగా ఈసినిమా వచ్చింది. పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
ప్రభాస్ హీరోగా నటించిన ఈసినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, అన్నా బెన్ తదితరులు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: