కల్కి.. క్యామియో రోల్స్‌లో మెరిసిన తారలు, ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‍

Kalki 2898 AD Rajamouli, Vijay Deverakonda, Mrunal Thakur and Many Celebs Played Cameo Roles

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం క‌ల్కి మేనియా న‌డుస్తోంది. నాగ్‌ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా రెబెల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన చిత్రం ‘కల్కి 2898 AD’. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమా గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రిలీజైన అన్ని చోట్లా పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌ రాబడుతున్నది. దీంతో ప్రభాస్​ ఫ్యాన్స్​తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో దీపికా పదుకోణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రాజేంద్ర ప్రసాద్, శోభన త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజువల్ వండర్‌లో టాలీవుడ్‌కు చెందిన తారలు కొందరు తళుక్కున మెరిశారు. వారు ఎవ‌రంటే.. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జునుడి పాత్ర‌లో కనిపించి ఆడియెన్స్‌ను థ్రిల్‌కి గురిచేశాడు. ఇక ‘మహానటి’ ఫేమ్ దుల్కర్ సల్మాన్ ఒక యోధుడి పాత్ర‌లో క‌నిపించి అలరించాడు.

అలాగే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ), ఎస్ఎస్. రాజమౌళి, కేవీ అనుదీప్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, నటుడు అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు అతిథి పాత్ర‌ల్లో న‌టించారు. వీరే కాకుండా ఇంకా మాలీవుడ్ హీరోయిన్ మాళవిక నాయర్, ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్, ప్రముఖ మ‌ల‌యాళ న‌టి అన్నా బెన్, ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లాలు తళుక్కుమన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.