దేశవ్యాప్తంగా ప్రస్తుతం ‘కల్కి’ మేనియా నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా.. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతిచోటా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్ రాబడుతోంది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఈ కల్కి 2898 ADని చూసేందుకు బారులుతీరున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, ఈ సినిమాలో ‘బుజ్జి’ అనే కారు కీలక రోల్ ప్లే చేసిందన్న విషయం తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ దీనిని మహీంద్రా కంపెనీ వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారుచేయించారు. విడుదలకు ముందుకు మేకర్స్ విడుదల చేసిన బుజ్జి వీడియో అభిమానులకు థ్రిల్ పంచింది. కాగా కల్కి ప్రమోషన్స్‌లో భాగంగా బుజ్జి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో పర్యటించింది. రేసింగ్ మోడల్ టైపులో ఉన్న ఈ కారు ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకర్షించింది.
ఈ క్రమంలో తన చివరి మజిలీగా హైదరాబాద్‌కు చేరుకుంది. ఇక ఈరోజు కల్కి చిత్రం విడుదల సందర్భంగా.. బుజ్జిని మేకర్స్ ప్రత్యేక ప్రదర్శనకు ఉంచారు. దీనిలో భాగంగా నగరంలోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ వద్ద ఈ కారుని పార్క్ చేశారు. దీంతో బుజ్జిని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం బుజ్జికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























