కళ్యాణ్ రామ్ మొత్తానికి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మల్లిడ విశిష్టతో బింబిసార అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న సినిమా అమిగోస్. ఇక బింబిసార సినిమాలో రెండు పాత్రలతో అలరించాడు కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు ఈసినిమాలో ఏకంగా మూడు పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అందులో ఒక పాత్ర నెగెటివ్ షేడ్ లో రెండు పాత్రలు కాస్త విభిన్నంగా ఉండేలా కనిపిస్తున్నాయి. కేవలం ఫస్ట్ లుక్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. సినిమాలో యాక్షన్ తో పాటు.. వైవిధ్యాన్ని కూడా చూపించబోతున్నట్లు టీజర్ ను బట్టి అర్థమవుతుంది. హాయ్ దిస్ ఈజ్ మైఖెల్ ఫ్రమ్ కోల్‌కతా’’ అంటూ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో మొదలువతుంది. ‘‘మైఖెలా? ఏం కావాలి’’ అనే మరో కళ్యాణ్ రామ్ పాత్ర వాయిస్ వినిపిస్తుంది. ఇందుకు సమాధానంగా ‘‘నువ్వే అని’’ మైఖెల్ పాత్ర సమాధానం ఇవ్వడం, ఓ యాప్ సాయంతో మైఖెల్ పోలికలు కలిగిన వ్యక్తిని గుర్తు పెట్టడానికి ప్రయత్నించడాన్ని టీజర్లో చూడవచ్చు. మైఖెల్ ఫోన్లో ‘‘ఐ యామ్ యువర్ డోపెల్‌గాంగర్ అని చెప్పడం, నిద్రలో ఉన్న మరో పాత్ర ‘‘జోక్ చేస్తున్నావా’’ అని అడుగుతాడు. ‘‘డోపల్‌గాంగర్ అనేది జోక్ అని నువ్వు అనుకుంటున్నావా?’’ అనగానే.. అసలు కథ మొదలవుతుంది. టీజర్ ఆడియన్స్ లో కొత్త క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.
Absolutely enjoyed playing Siddharth, Manjunath and Michael. You will like them and their story.
Here is the #AmigosTeaser.
– https://t.co/4VrexHfEhi#Amigos In cinemas from Feb 10, 2023 🔥@AshikaRanganath #RajendraReddy @GhibranOfficial @MythriOfficial @saregamasouth pic.twitter.com/rRTXVEgEEQ— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 8, 2023
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ చేస్తుంది. ఈసినిమాతో తెలుగు తెరకి ఆషిక రంగనాథ్ పరిచయమవుతోంది. ఇంకా ఈసినిమాలో ఇంకా బ్రహ్మాజి, సప్తగిరి, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































