
ట్యాగ్ · 124 కథనాలు · పేజీ 2


ఇండియన్ 2 ట్రైలర్ రిలీజ్

కల్కి రీజన్స్ టు వాచ్

నార్త్ అమెరికాలో కల్కి బీభత్సం

థగ్ లైఫ్- రానున్న మాసివ్ అప్ డేట్

కల్కి 2898ఏడీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభాస్ కల్కి షూటింగ్ అప్డేట్

కల్కీ- నెగెటివ్ లేనిదే పాజిటివ్ లేదు

ప్రాజెక్ K ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ప్రాజెక్ట్ కే కోసం ల్యాండ్ అయిన సలార్

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై ప్రాజెక్ట్ K

ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ డేట్ కన్ఫామ్

ప్రాజెక్ట్K కౌంట్ డౌన్ స్టార్ట్

ప్రాజెక్ట్ K టైటిల్, ట్రైలర్ అప్ డేట్ అప్పుడే

కమల్ 233 మూవీ మొదలు

కల్కి 2898 AD.. థీమ్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD'. బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించగా.. ఇండియన్ లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ మరియు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇక వైజయంతీ మూవీస్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇండియన్ 2 ట్రైలర్ రిలీజ్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. జులై 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటికే రెండు పాటలన కూడా రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా మంచి…

కల్కి రీజన్స్ టు వాచ్
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాకు సంతోష నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఎన్నో అంచనాల మధ్య వస్తున్న ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

కల్కి రిలీజ్ ట్రైలర్.. సర్‌ప్రైజింగ్ రోల్‌లో మరో హీరోయిన్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ యంగ్ అండ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

నార్త్ అమెరికాలో కల్కి బీభత్సం
పాన్ ఇండియా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రాబోతున్న సినిమా కల్కి 2898ఏడీ. ఇక ఈసినిమాను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడూ చూద్దామా అని యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా నాగ్ అశ్విన్ ఈసినిమా గురించి చెప్పే విషయాలు మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. నాగ్ అశ్విన్ ఈసినిమాను వెండితెరపై ఎలా చూపించనున్నాడు ? అవుట్ పుట్ ఎలా వచ్చింది అనే దానిపైనే అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా సెకండ్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు…

కల్కి 2898 AD.. ముంబైలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్
మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ ‘కల్కి 2898 AD’, విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్‌లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణే, దిశా పటానీ నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఫెంటాస్టిక్ ప్రమోషనల్ కంటెంట్‍తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌కి గ్రౌండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది.

థగ్ లైఫ్- రానున్న మాసివ్ అప్ డేట్
లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఒక సినిమా థగ్ లైఫ్. చాలా ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది.

కల్కి 2898ఏడీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్
పెద్ద సినిమాలకు లీక్స్ రావడం అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక రకంగా లీకులు బయటపడుతున్నాయి. ఎంతో జాగ్రత్త పడే రాజమౌళికే ఈలీకుల బాధలు తప్పలేదు. రీసెంట్ గా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుండి ఏకంగా లిరికల్ సాంగే లీకయ్యింది. దీంతో చిత్రనిర్మాణ సంస్థ కేసు కూడా ఫైల్ చేసింది. ఇప్పుడు మరో పెద్ద సినిమా మేకర్స్ కూడా లీకు రాయుళ్లకు వార్నింగ్ ఇస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి 2898ఏడీ.

ప్రభాస్ కల్కి షూటింగ్ అప్డేట్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్నసైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898ఏడి.ఇటీవల విడుదలైన ఈసినిమా గ్లింప్స్ కు విశేషమైన స్పందన వచ్చింది.దాంతో సినిమాఫై అంచనాలను తార స్థాయికి చేరుకున్నాయి.ప్రస్తుతం షూటింగ్ స్టేజి లో ఉంది ఈసినిమా.ఇక నిన్నహైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.ప్రభాస్ ,హీరోయిన్ దీపికా పదుకోణ్ తదితరుల ఫై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈనెల 28వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది.భారీ విఎఫ్ఎక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్నఈసినిమాకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకుడు.

కల్కి2898 AD- ఇండియన్ మైథాలజీ ప్లస్ వెస్ట్రన్ ఇన్ఫ్లూయెన్స్
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇక సినిమా రిలీజ్ కు ముందే ఈసినిమా అంతర్జాతీయ లెవల్లో గుర్తింపును తెచ్చుకుంది. రీసెంట్ గానే చిత్రయూనిట్ శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే కదా. ఇక అక్కడే ఈసినిమా టైటిల్ ను అలానే గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ అయితే సోషల్…

కల్కీ- నెగెటివ్ లేనిదే పాజిటివ్ లేదు
క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ప్రాజెక్ట్ కే రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రెండు రోజులుగా చిత్రయూనిట్ యూఎస్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. యూఎస్ఏ లోని శాన్ డియాగో కానిక్ కాన్ ఈవెంట్ కోసం గాను చిత్రయూనిట్ అక్కడికి వెళ్లింది. ఆ ఈవెంట్ లోనే ఈసినిమా టైటిల్ ను అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో చూస్తూనే ఉన్నాం. విజువల్స్ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫస్ట్ లుక్ తో కాస్త్ డిజప్పాయింట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్ కు…

ప్రాజెక్ K ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్న తరుణం వచ్చేసింది. ప్రాజెక్ట్ కే.. గత కొద్దిరోజులుగా ఈసినిమా గురించే సోషల్ మీడియాలో చర్చలు. అంతేకాదు గత కొద్దిరోజుల నుండి ప్రాజెక్ట్ కే సోషల్ మీడియాలో టాప్ ట్రెడింగ్లో నిలుస్తుంది. దానికి కారణం ఈసినిమా నుండి రాబోయే అప్ డేట్ కోసమే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న ఈసినిమా పై అంచనాలు ఏరేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోవైపు షూటింగ్ దశలోనే ఈసినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంది.

ప్రాజెక్ట్ కే ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ప్రాజెక్ట్ కే. నిజానికి ఈసినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా 6 నెలల వరకూ టైముంది. కానీ ఇప్పటినుండే ఎదురుచూపులు మొదలయ్యాయి. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాగ్ అశ్విన్ మేకింగ్.. అందులోనూ ప్రభాస్ హీరో కాబట్టి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో వినూత్నంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా యూఎస్ లో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే యూనిట్ హాజరవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక అక్కడే ఈసినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు. దీంతో…

ప్రాజెక్ట్ కే కోసం ల్యాండ్ అయిన సలార్
టాలీవుడ్ స్టార్ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలో. అందులో ఒకటే ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాను నాగ్ అశ్విన్ ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో ఇటీవలే ఈసినిమా కోసం వాడే ఒక టైర్ మేకింగ్ కు సంబంధించి ఒక వీడియో ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఆ చిన్న గ్లింప్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు.

ప్రాజెక్ట్ కే నుండి దీపికా ఫస్ట్ లుక్ రిలీజ్
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్,రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కే.వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి వస్తున్న 50వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.సుమారు 500కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.ఇక నిన్న ఈ సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్,దిశా పటాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈసినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ పై ప్రాజెక్ట్ K
ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రాజెక్ట్ కే గురించిన చర్చలే వినిపిస్తున్నాయి. ఈసినిమా నుండి అప్ డేట్స్ రానున్న నేపథ్యంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటంతో.. ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే కదా ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రాజెక్ట్ కే అనే టైటిల్ తోోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ హైప్ ను పెంచుతున్నారు మేకర్స్.

ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ డేట్ కన్ఫామ్
ప్రాజెక్ట్ కే అంటే ఏమిటి..? దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం జులై 20వ తేదీ వరకూ వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇక ప్రభాస్ హీరో అవ్వడం.. నాగ్ అశ్విన్ ఈసినిమాను రూపొందిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగా నాగ్ అశ్విన్ కూడా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి రెండు వీడియోలు రిలీజ్ చేశారు. స్క్రాచ్ నుండి టైర్ ను తయారు చేయడం.. స్క్రాచ్ నుంచి రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రాజెక్ట్K కౌంట్ డౌన్ స్టార్ట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా వాటిలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమా రిలీజ్ వచ్చే ఏడాది అయినా కూడా ఇప్పటినుండే ఎదురుచూస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుండటం.. దానికితోడు ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన వీడియోలకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

ప్రాజెక్ట్ K టైటిల్, ట్రైలర్ అప్ డేట్ అప్పుడే
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. సినిమాల రిజల్ట్ ల సంగతి పక్కనపెడితే ప్రభాస్ రేంజ్ ఏమాత్రం తగ్గట్లేదు. రీసెంట్ గానే ఆదిపురుష్ సినిమాను రిలీజ్ చేయగా అది మిక్స్డ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరి దృష్టి సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలపై పడింది. వీటిలో సలార్ సినిమా ఈఏడాదే రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా మరోసారి ప్రభాస్ స్టామినా ఏంటో తెలిసిందే.

కమల్ 233 మూవీ మొదలు
విలక్షణ నటుడు కమల్ కూడా ఒక సినిమా తరువాత ఒక చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది విక్రమ్ తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఇదిలా ఉండగా మణిరత్నంతో కూడా కమల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. KH 234అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా రానుంది. మరోవైపు తెలుగులో ప్రభాస్ `ప్రాజెక్ట్ కే`లో నటిస్తున్నారు.