
ట్యాగ్ · 124 కథనాలు


కమల్ బ్యానర్ లో రజినీ కాంత్ సినిమా

థగ్ లైఫ్ రిలీజ్ డేట్ టీజర్ విడుదల

అమరన్ చూసి కమల్ హాసన్ కళ్ళలో నీళ్ళు..

థగ్ లైఫ్ షూటింగ్ కంప్లీట్

మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన కల్కి టీమ్

థగ్ లైఫ్ లోకి నాజర్, అభిరామి ఎంట్రీ

థగ్ లైఫ్- కమల్ డబ్బింగ్ షురూ

ఇండియన్ 2 కి ఎక్స్ లెంట్ అడ్వాన్స్ బుకింగ్స్

ఇండియన్ 3 ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

భారతీయుడు 2 టికెట్ ధరల పెంపు

కమల్ హాసన్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరో ఎక్సయిటింగ్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ తో పాపులర్ స్టంట్ కొరియోగ్రాఫర్లు అన్బరివ్ (అన్బు మణి, అరివు మణి) దర్శకులుగా అరంగేట్రం చేస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ #KHAA, కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా "హంట్ మోడ్ ఆన్" అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్ చేశారు.

కమల్ బ్యానర్ లో రజినీ కాంత్ సినిమా
తమిళ అగ్ర నటులు రజినీకాంత్, కమల్ హాసన్ దాదాపు ఐదు దశాబ్దాల స్నేహానికి గుర్తుగా ఒక మెగా ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై, రజినీకాంత్ కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. రజినీకాంత్ కు ఇది 173 వ సినిమా. ఈ తలైవర్ 173 చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుందర్ సి డైరెక్ట్ చేయనున్నాడు.

థగ్ లైఫ్ రిలీజ్ డేట్ టీజర్ విడుదల
ఉలగనాయకన్ కమల్ హాసన్ ఇండియన్ సినిమా లివింగ్ లెజెండ్. 6 దశాబ్దాల సినీ కెరీర్‌లో ఎన్నో కల్ట్ క్లాసిక్ విజయాలతో, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్తగా అద్భుతమైన సినిమాలని అందించాలనే తపనతో పని చేస్తున్నారు. చాలా మంది దర్శకులు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా కమల్ హాసన్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటారు, ఎందుకంటే సినిమాలని చేయడంలో కమల్ హాసన్ ఓ యూనివర్సిటీ.

అమరన్ చూసి కమల్ హాసన్ కళ్ళలో నీళ్ళు..
కోలీవుడ్ స్టార్ హీరో, ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ నేషన్ ప్రైడ్ బ్లాక్ బస్టర్ 'అమరన్'. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు.

థగ్ లైఫ్ షూటింగ్ కంప్లీట్
లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ 'థగ్ లైఫ్'. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నారు. కాగా పొన్నియిన్ సెల్వన్ 2 తరువాత లెజండరీ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న సినిమా ఇదే. ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి, త్రిష ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. యంగ్ హీరోలు శింబు, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్ మరియు పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఓటీటీలో కల్కి సంచలనం.. గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‍గా రిలీజైన సంగతి గుర్తుండేవుంటుంది.

ఓటిటిల్లోకి వచ్చేసిన కల్కి
బ్లాక్ బాస్టర్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఓటిటిల్లో స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది.ఈరోజునుండి తెలుగు వెర్షన్ తో సహా కన్నడ,మలయాళ,తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ అందుబాటులోకి తీసుకురాగా హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక ఓటిటిల్లో కూడా ఈసినిమా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

కల్కి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడి ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.56 రోజుల థియేట్రికల్ రన్ తరువాత ఓటిటిల్లోకి వస్తుండడం విశేషం.దక్షిణాది భాషల్లో అమెజాన్ ప్రైమ్ ఈనెల 22నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుండగా అదే రోజున హిందీ లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది.ఇక థియేట్రికల్ రన్ విషయానికి వస్తే 1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి 50డేస్ కంప్లీట్ చేసుకుంది.ఈఏడాది ఇండియన్ మూవీస్ లో అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది కల్కి.

ఓటీటీ లోకి వచ్చేసిన భారతీయుడు 2
కొన్ని సార్లు ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చే సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సినిమాలో కంటెంట్ లేకపోతే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఇప్పటికే ప్రేక్షకులు చూపించారు. ఇప్పుడు మరో సినిమా విషయంలో అది నిరూపించారు ఆడియన్స్. లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. ఈసినిమా ఈసినిమా 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. భారతీయుడు సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. ఇదే నమ్మకంతో ఈసినిమా కూడా అలాంటి రిజల్ట్ నే అందిస్తుందని అనుకున్నారు. అలా ఎన్నో అంచనాల మధ్య…

ఇండియన్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. ఈసినిమా ఈసినిమా 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన కల్కి టీమ్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

భారతీయుడు2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?
కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇండియన్2. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమా పై మొదటినుండీ భారీ అంచనాల ఏర్పడ్డాయి. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటించగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ నిర్మించిన ఈసినిమాకు.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

థగ్ లైఫ్ లోకి నాజర్, అభిరామి ఎంట్రీ
రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు లోకనాయకుడు కమల్ హాసన్. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. ప్రస్తుతం తను థగ్ లైఫ్ అనే సినిమా బిజీగా ఉన్నాడు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన కమల్ హాసన్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచారు చిత్రబృందం. దానికి తోడు ఈసినిమాలో కూడా డిఫరెంట్ లుక్ తో కనిపించడంతో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముగించుకుంటూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది.

థగ్ లైఫ్- కమల్ డబ్బింగ్ షురూ
విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ముందుగా కల్కి2898AD సినిమాలో సుప్రీం యాస్కిన్ గా కనిపించి అదరగొట్టాడు. సినిమాలో కనిపించింది తక్కువ సేపే అయినా, ఆ ఇంపాక్ట్ సినిమా మొత్తం ఉంటుంది. రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ కు ముందు ఈసినిమాపై ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను రిచ్ కాలేకపోయింది ఈసినిమా. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

భారతీయుడు2 ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్
లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇండియన్2. ఈసినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. షూటింగ్ పరంగా ఈసినిమా చాలా టైమ్ ను తీసుకుంది. మేకర్స్ తో సమస్యలు, ఆతరువాత శంకర్ వేరే సినిమాతో బిజీగా ఉండటం పలు కారణాలవల్ల సినిమా రిలీజ్ కు చాలా టైమ్ పట్టింది. అయినా కూడా ఫ్యాన్స్, సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

భారతీయుడు 2 తెలుగు రివ్యూ
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు.కమల్ హాసన్ యాక్టింగ్, శంకర్ టేకింగ్, విజువల్స్ హైలైట్ అయ్యాయి. సాలిడ్ మెసేజ్ తో వచ్చిన ఈ సినిమాను అందరూ చూడొచ్చు.

ఇండియన్ 2 కి ఎక్స్ లెంట్ అడ్వాన్స్ బుకింగ్స్
మచ్ అవైటెడ్ సీక్వెల్ ఇండియన్ 2 రేపు థియేటర్లలోకి రానుంది.శంకర్ - కమల్ హాసన్ కాంబో లో వస్తున్న ఈసినిమా పై తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో అదరగొడుతుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 25 కోట్ల అడ్వాన్స్ సేల్స్ జరిగాయని సమాచారం.బుక్ మై షో లో నిన్నటి వరకు తమిళ్,తెలుగు కలిపి 2లక్షల 80వేలకు కుపైగా టికెట్స్ బుక్ అయ్యాయి.ఈసినిమాతో కమల్ కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనున్నాడు.

ఇండియన్ 3 ట్రైలర్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇండియన్ 2. 1996 లో కమల్ హాసన్ హీరోగా నటించి సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.

భారతీయుడు 2 టికెట్ ధరల పెంపు
శంకర్ -కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ భారతీయుడు 2 కి నైజాంలో టికెట్ హైక్ తోపాటు అదనపు షో వేసుకోవడానికి పర్మిషన్ వచ్చింది. ఈసినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదలచేస్తుంది. దాంతో టికెట్ హైక్ తో పాటు స్పెషల్ షో కి అప్లై చేయగా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వారం రోజులకు గాను 5షో లతోపాటు సింగిల్ స్క్రీన్ లో టికెట్ పై 50,మల్టీ ఫ్లెక్స్ లో 75 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్ రావాల్సివుంది.

రివ్యూ: కల్కి 2898 AD
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన కల్కి ఆ అంచనాలను అందుకుంది అని చెప్పచ్చు.ప్రభాస్, అమితాబ్ నటన, నాగ్ అశ్విన్ డైరెక్షన్,విజువల్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఈ విజువల్ వండర్ ను థియేటర్లలో మాత్రం మిస్ అవ్వొద్దు.