ట్యాగ్ · 33 కథనాలు · పేజీ 2
'కపటధారి' టీజర్ రీలీజ్
అతిథి పాత్రలో రానా దగ్గుబాటి ?

2021 సంక్రాంతికి 'అరణ్య'
రానా కోసం అంటున్న మిహికా
వికారాబాద్ అడవుల్లో "విరాటపర్వం "

నవంబర్ లో "విరాటపర్వం " షూటింగ్
శోభన్ బాబు బయోపిక్ కు రానా..?
5ఏళ్ల 'రుద్రమదేవి' - స్పెషల్ జర్నీ
నో డౌట్.. థియేటర్ లోనే 'విరాట పర్వం'
'అరణ్య' టీజర్ రిలీజ్
పెళ్లి తర్వాత పెద్దగా మార్పులేదు
2020 లో టాలీవుడ్ సెలెబ్రిటీస్ చాలా మంది పెళ్లి పీటలు ఎక్కారు. నిఖిల్ తో మొదలు పెట్టి, నితిన్, రానా, తాజాగా కాజల్… వరుస పెట్టి ఒక్కొక్కరుగా ఎంతో మంది వివాహమాడారు. ఇక పెళ్లి తర్వాత నా లైఫ్ లో ఎలాంటి మార్పు లేదు అని అంటున్నాడు రానా. రానా-మిహీకా ల వివాహం జరిగి మూడు నెలలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రానా పెళ్లి తర్వాత తన లైఫ్ ఎలా ఉందో చెప్పాడు.
'కపటధారి' టీజర్ రీలీజ్
సుబ్రహ్మణ్యపురం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుమంత్ ఇప్పుడు మరో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. కన్నడంలో సూపర్‌హిట్టయిన `కవలుదారి` సినిమాకు ఇది తెలుగు రీమేక్. కన్నడలో రిషి పోషించిన ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో సుమంత్ నటించారు.
మీకు తెలుసా.. విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడ్యూసర్ గా 'నంది అవార్డ్' పొందిన రానా..?
కుటుంబం మొత్తం ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు చేస్తూనే ఉంది.. తాత దేశం గర్వించదగ్గ నిర్మాత.. తండ్రి టాలీవుడ్ లోనే టాప్ ప్రొడ్యూసర్.. బాబాయ్ టాలీవుడ్ అగ్ర హీరో.. ఇంతమంది బలగం ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఆ హీరో. ఆ హీరో ఎవరో ఇప్పటికే ఒక ఐడియా వచ్చి ఉంటది కదా. ఇంకెవరూ దగ్గుబాటి వారసుడు రానా. నిజానికి కుటుంబం మొత్తం సినీ పరిశ్రమకే పరిమితమవ్వగా..చిన్నప్పటినుండి అదే వాతారణంలో పెరిగినా రానా మాత్రం ముందు బిజినెస్ అంటూ దూరంగా ఉన్నాడు. అందుకే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ కూడా లేట్ గా ఇచ్చాడు.
అతిథి పాత్రలో రానా దగ్గుబాటి ?
ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో "ఉప్పెన " మూవీ ఫేమ్ వైష్ణవ తేజ్ , రకుల్ ప్రీత్ జంటగా రూపొందుతున్న మూవీ షూటింగ్ వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ లో రకుల్ ప్రీత్ గిరిజన యువతిగా నటిస్తున్నారు.ఈ మూవీ లో ఒక కీలక పాత్రకై హీరో రానా ను దర్శకుడు క్రిష్ సంప్రదించినట్టు , హీరో రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

2021 సంక్రాంతికి 'అరణ్య'
కరోనా వల్ల సినిమా థియేటర్స్ మూత పడగా ఎన్నో రిలీజ్ కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. అయితే ఈ మధ్యే థియేటర్స్ 50 శాతం ఆక్యూపెన్సీ తో రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినా ఇక్కడ మాత్రం ఇంకా సరిగా ఓపెన్ చేయడానికి ముందుకు రావట్లేదు థియేటర్ల యాజమాన్యం. మరో రెండుమూడు నెలలు అయితే కానీ థియేటర్స్ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. అందుకే తన సినిమా రిలీజ్ ను వచ్చే ఏడాదికి ఫిక్స్ చేసాడు రానా. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే అరణ్య.
రానా కోసం అంటున్న మిహికా
అసలు పెళ్లి చేసుకుంటాడా అనుకున్న రానా పెళ్లి చేసుకొని మిగిలిన హీరోలకు పెద్ద షాకే ఇచ్చాడు. ఈ కరోనా టైంలో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ పెళ్లిళ్లు జరుగగా అందులో రానాది ఒకటి. లాక్‌డౌన్ సమయంలో కొద్ది మద్ది అతిథుల మధ్య రానా- మిహికా బజాజ్‌లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 8న వీరి వివాహం సింపుల్‌గా జరిగింది. అప్పట్లో వారి పెళ్లి ఫొటోలు.. వ్రతం ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరోఫొటో వైరల్ అవుతుంది.
వికారాబాద్ అడవుల్లో "విరాటపర్వం "
సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ "మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో వాస్తవ సంఘటనల ఆధారంగా "విరాటపర్వం " మూవీ రూపొందుతుంది. రానా , సాయి పల్లవి ఉద్యమకారులుగా నటిస్తున్న ఈ మూవీ లో ప్రియమణి , నందిత దాస్ , నవీన్ చంద్ర , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కరోనా కారణంగా "విరాటపర్వం " మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

నవంబర్ లో "విరాటపర్వం " షూటింగ్
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా నక్సలైట్ నేపథ్యంలో వాస్తవ సంఘటన ఆధారంగా "విరాట పర్వం "మూవీ రూపొందుతుంది. ప్రియమణి , నందితా దాస్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో రానా , హీరోయిన్ సాయి పల్లవి ఉద్యమ కారులుగా నటిస్తున్నారు.
శోభన్ బాబు బయోపిక్ కు రానా..?
వెండి తెరపై ఇప్పటివరకూ ఎంతో మంది లెజెండ్రీ నటీనటుల బయోపిక్ లు సందడి చేయడం చూశాం. ఇంకా పలువురి బయోపిక్ లు తెరకెక్కుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో బయోపిక్ కూడా తెరపైకి వచ్చింది. ఆ బయోపిక్ ఎవరిదో కాదు. తెలుగు సినీ చరిత్రలో సోగ్గాడుగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబుది. . ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఒకరు ఆయన బయోపిక్ ను చేయాలని భావిస్తున్నాడట. అంతేకాదు ఎప్పటినుండో ఈ కథపై పని చేస్తున్నాడట. ఇంకా శోభన్ బాబు కుటుంబసభ్యుల నుండి అనుమతులు కూడా తీసుకున్నారట.
5ఏళ్ల 'రుద్రమదేవి' - స్పెషల్ జర్నీ
అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా రుద్రమదేవి. తొలి భారతీయ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా రూపొందిన రుద్రమదేవి గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కి మంచి విజయం సాధించింది. ఇక తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రంలో అనుష్కశెట్టి, అల్లు అర్జున్, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, నిత్య మెనన్, బాబా సెహగల్, కేథరీన్ లు నటించిన ఈ సినిమా నేటితో 5ఏళ్ళు పూర్తి చేసుకుంది.
నో డౌట్.. థియేటర్ లోనే 'విరాట పర్వం'
థియేటర్స్ లేకపోవడంతో చిన్నగా ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు దర్శకనిర్మాతలు. పెద్ద సినిమాలు అంటే ఎలాగూ థియేటర్ లోనే రిలీజ్ కావాలి.. ఉదాహరణకి ఒక ఆర్ఆర్ఆర్, ఒక కె.జి.యఫ్ లాంటి సినిమాల కోసం ప్రేక్షకులు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తారు. థియేటర్స్ ఓపెన్ అయ్యేంత వరకూ వెయిట్ చేస్తారు.. అసలు ఆసినిమాలు ఓటీటీ రిలీజ్ చేస్తామన్నా ముందు ప్రేక్షకులే ఒప్పుకోరు. కానీ చిన్న సినిమాలు .. ఒక మోస్తరు బడ్జెట్ సినిమాల పరిస్థితి వేరు. అందుకే చిన్న సినిమాలు అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓటీటీ రిలీజ్ అయిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పెంగ్విన్ అయింది.. ఇటీవల 'వి' సినిమా అయింది…

మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్.. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ నేపథ్యంలో..!
భల్లాలదేవ మళ్లీ వర్క్ మోడ్ లోకి వచ్చేసాడు. అసలు పెళ్లి చేసుకుంటాడా అన్న క్వశ్చన్ మార్క్ ను తీసేసి అందరికీ షాకిస్తూ లాక్ డౌన్ సమయంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు రానా. ఇన్ని రోజులు పెళ్లి హడావుడిలో ఉన్న రానా ఇక ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చెప్పాడుపెట్టాడు. రానా ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కొంత పూర్తిచేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కు బ్రేక్ పడింది. రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాను సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'అరణ్య' టీజర్ రిలీజ్
ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి చూస్తాడు రానా దగ్గుబాటి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా "హాథీ మేరే సాథీ " అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుండగా మరో పక్క ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.