
ట్యాగ్ · 11 కథనాలు


"మాస్ట్రో "మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

"మాస్ట్రో " ప్రమోషన్స్ లో నభా నటేష్

'అనబెల్ అండ్ సేతుపతి' ట్రైలర్ రిలీజ్

'మాస్ట్రో' నుండి స్నీక్ పీక్ రిలీజ్

'మాస్ట్రో' ట్రైలర్ రిలీజ్

ప్రముఖ ఓటీటీ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో లైగర్ మూవీ సంచలనం
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేదు. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.లైగర్ మూవీతో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్.. బీ రెడీ..!
బుల్లి తెర ప్రేక్షకులకు రియాలిటీ షో బిగ్ బాస్ అగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే 5 సీజన్లు పూర్తి కాగా ఆరో సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ గ్యాప్ లో ఓటీటీ బిగ్ బాస్ కు శ్రీకారం చుట్టూరు. ఇప్పటికే తెలుగు, తమిళ్ లో ఓటీటీ బిగ్ బాస్ ప్రసారం అవుతూనే ఉంది. ఇప్పుడు తెలుగులో కూడా స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే పలు ప్రోమోలు కూడా వచ్చేశాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ షో ప్రసారం కానుంది.

ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'గల్లీ రౌడీ'..!
కరోనా వల్ల ఒక్క సినిమా రిలీజ్ చేయడానికే చాలా కష్టంగా ఉంటే యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఏడాది ప్రధమార్థంలో ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమాతో అలరించిన సందీప్ కిషన్ ఇటీవల గల్లీ రౌడీతో సందడి చేశాడు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి రానుంది. నవంబర్ 4వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది.

'సీటీమార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సంపత్ నంది - గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సీటీమార్. ఇక ఈసినిమా కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని రిలీజ్ అయింది. మాస్ ఎంటర్ టైనర్ గా సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈసినిమా మాత్రం హిట్ టాక్ ను సొంతం చేసుకొని చాలా కాలంగా ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నగోపిచంద్ కు విజయాన్ని అందించింది. ఇక ఈసినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో అక్టోబరు 15 నుంచి సీటీమార్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు మూవీ యూనిట్ ఒక కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.

"మాస్ట్రో "మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందిన “మాస్ట్రో ” మూవీ సెప్టెంబర్ 17 వ తేదీ డిస్నీ +హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"మాస్ట్రో " ప్రమోషన్స్ లో నభా నటేష్
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందిన “మాస్ట్రో ” మూవీ సెప్టెంబర్ 17 వ తేదీ డిస్నీ +హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'అనబెల్ అండ్ సేతుపతి' ట్రైలర్ రిలీజ్
వైవిద్యమైన సినిమాలతో మోస్ట్ వాంటెడ్ నటుడిగా మారిపోయాడు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. కేవలం తమిళ్ లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అనబెల్ అండ్ సేతుపతి.కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.

'మాస్ట్రో' నుండి స్నీక్ పీక్ రిలీజ్
నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న మాస్ట్రో సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్స్ ఓపెన్ అయినా కూడా ఈసినిమను డైరెక్టర్ గా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 17న ఈసినిమా డిస్నీ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సందర్భంగా ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై అంచనాలను అయితే పెంచేశాయి. ఇక నేడు తాాజాగా ఈసినిమా నుండి స్నీక్ పీక్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో నితిన్ పియానో వాయిస్తుండగా.. ఆ పియానో పై ఇళయరాజా ఫొటో…

'మాస్ట్రో' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో మాస్ట్రో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. హిందీలో సూపర్ హిట్ అయిన అంధాదూన్ సినిమాకు ఈసినిమా రీమేక్. ఇందులో మొట్టమొదటిసారిగా నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. అయితే ఇప్పుడు తాజాగా స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 17వ తేదీన ఈసినిమా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఇప్పటికే టైలర్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

'మాస్ట్రో' ట్రైలర్ రిలీజ్
ఈ ఏడాది చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నితిన్ ఇప్పుడు మూడో సినిమాతో రెడీగా ఉన్నాడు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ అంధధూన్‌కు తెలుగు రీమేక్‌గా వస్తున్న మూవీ మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో ఈసినిమా వస్తుంది. ఇక ఈసినిమా ఎప్పటినుండో రిలీజ్ కు సిద్దంగా ఉండంగా రీసెంట్ గానే ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 10న డిస్నీ హాట్‌స్టార్ లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఓటీటీ లోనే మాస్ట్రో.. ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్
మొత్తానికి చాలా సస్పెన్స్ తరువాత మాస్ట్రో సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకుంది కానీ రిలీజ్ డేట్ ను మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. అంతేకాదు కరోనా సెకండ్ వేవ్ తగ్గిన తరువాత థియేటర్లు ఓపెన్ చేసినా కూడా ఈసినిమా రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. ఇన్ని రోజులు ఓటీటీలో రిలీజ్ అవుతుందా లేక థియేటర్ లో రిలీజ్ అవుతుందా అన్న కన్ఫ్యూజన్ లోనే ఉంచారు. ఇప్పుడు ఫైనల్ గా ఈసినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. అంతేకాదు ఈ సినిమా ట్రైలర్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్ ఆగష్ట్ 23న ఈసినిమా ట్రైలర్…