శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందిన “మాస్ట్రో ” మూవీ సెప్టెంబర్ 17 వ తేదీ డిస్నీ +హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్‌లో “మాస్ట్రో “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ .. నటుడన్నతరువాత ఇలాంటి కళాత్మకమైన సినిమాలూ చేయాలి కదా? అనే ఒప్పుకొన్నాననీ , దర్శకుడు గాంధీ చాలా కష్టపడ్డారనీ , “మాస్ట్రో “మూవీ తెలుగులోనూ విజయం సాధిస్తుందనీ , తాను, తమన్నా ఇలా చాలా మంది సాహసోపేత నిర్ణయం తీసుకుని ఈ సినిమా చేశామనీ అన్నారు. తమన్నా మాట్లాడుతూ .. అభిమానులు తాను వేసే ప్రతీ అడుగులోనూ ప్రోత్సహిస్తున్నారనీ , అభిమానులు ఇచ్చిన ప్రేమవల్లే విభిన్న పాత్రలలో నటిస్తున్నాననీ , “మాస్ట్రో “మూవీ లో పాత్రని చేయడం చాలా కష్టమనీ , భిన్నమైన పాత్ర చేసిన ప్రతిసారీ ఎంతో ఆనందాన్నిస్తుందనీ , డార్క్ కామెడీ కథలు తెలుగు లో అంతగా రాలేదనీ , దర్శకుడు గాంధీ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారనీ చెప్పారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ .. నితిన్‌తో ఒక మంచి కళాత్మక సినిమా “అంధాధున్”ను రీమేక్ చేశాననీ , . నితిన్ అన్నని ఈ చిత్రంలో కొత్తగా చూస్తారనీ , . తమన్నా ఈ సినిమాతో గొప్ప నటి అనిపించుకుంటారనీ చెప్పారు. హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ ‘‘తనను నమ్మి ఈ సినిమాకి ఎంపిక చేశారనీ , ఇది నా తొలి రీమేక్ చిత్రమనీ , నితిన్‌తో తొలి చిత్రమనీ , ఆయన్నుంచి చాలా నేర్చుకున్నాననీ , అందరి మొహాల్లో నవ్వుని పంచుతుందీ చిత్రం,అనీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ఇదే ననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: