కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Director SS Rajamouli

ట్యాగ్ · 95 కథనాలు · పేజీ 5

సినిమా వార్తలు

ప్లాస్మా దాతలు నిజమైన హీరోలు

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లాస్మా దాతలే నిజమైన హీరోలు అంటున్నారు రాజమౌళి. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. జాగ్రత్తలు తీసుకున్నా.. తీసుకోకపోయినా ఈ మహమ్మారి మాత్రం అందరికీ వ్యాప్తిస్తూనే ఉంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ కు షూటింగ్స్ వెళ్లకపోయినా.. వెళ్లినా కరోనా బారిన పడుతున్నారు. రాజమౌళి తో మొదలైన ఈ పరంపర ఇంకా కొనసాగుతూనే వుంది. ఇప్పటివరకూ చాలా మంది సీలెబ్రిటీస్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ప్లాస్మా దానం చేయాలని కూడా పిలుపునిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఆర్ఆర్ఆర్' - 'ఫ్రెండ్ షిప్' పై రాజమౌళి ఫోకస్

ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో పలు హైలైట్ సీన్స్ ఉంటాయని.. ఎన్టీఆర్ పలు గెటప్స్ లో కనిపించనున్నాడని.. బాహుబలి కంటే ఈ సినిమా పది రెట్లు గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని ఇలా ఎన్నో వార్తలు విన్నాం. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో రాజమౌళి ఫ్రెండ్ షిప్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఫ్రెండ్ షిప్ ను సాలిడ్ గా చూపించనున్నారట. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఫ్రెండ్ షిప్ పై ఒక స్పెషల్ సాంగ్ ను కూడా కంపోజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. మంచి ఆర్టిస్టిక్…

TFN Adminవాట్సాప్
SS Rajamouli Silver Screen Wonder Magadheera Completes 11 Years.
సినిమా వార్తలు

11 వసంతాల "మగధీర "

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్, రొమాంటిక్ డ్రామా "మగధీర " మూవీ 2009 సంవత్సరం జులై 1 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా శ్రీహరి , దేవ్ గిల్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "పంచదార బొమ్మ "సాంగ్ హైలైట్ గా నిలిచింది. "మగధీర " మూవీ 2 నేషనల్ , 6 ఫిల్మ్ ఫేర్ , 9 నంది , 10 సినీమా అవార్డ్స్ అందుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మగధీర' - ఆ సీన్ కోసం మారుతి వ్యాన్ టాప్ కట్ చేసిన జక్కన్న..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో 'మగధీర' సినిమాకు మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎస్‌ఎస్‌ రాజమౌళి, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడమే కాకుండా తెలుగు సినిమా సత్తాను చాటింది. హార్స్‌ రైడింగ్‌, కాజల్‌ గ్లామర్‌, శ్రీహరి-రామ్‌చరణ్‌ మధ్య డైలాగ్‌ వార్‌ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పడు ఒక సినిమా థియేటర్లో రెండు మూడు వారాలు ఆడితేనే పెద్ద గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. కానీ ఈ సినిమా అప్పట్లో.. 299 కేంద్రాల‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు 223 కేంద్రాల‌లో 100…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బ్లడ్ ప్లాస్మా కై రాజమౌళి &విజయ్ సేతుపతి రిక్వెస్ట్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ప్రజల దైనందిక జీవితంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. భారత దేశంలో కరోనా విజృభిస్తుంది. ఈ వ్యాధికి మెడిసిన్ వచ్చేవరకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భారత దేశం లో ఈ రోజు వరకు 9లక్షల 36 వేల మంది కరోనా బారిన పడ్డారు. 60 వేల మంది వరకు రికవర్ కాగా 24 వేల మంది మరణించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కరోనా ఎఫెక్ట్.. బాహుబలి - భల్లాలదేవలకు కూడా మాస్క్ లు..!

కరోనా ఎఫెక్ట్ బాహుబలి సినిమాపై కూడా పడింది. అదేంటి బాహుబలి ఎప్పుడో వచ్చింది.. కరోనా ఇప్పుడు వచ్చింది కదా అని డౌట్ కదా. అసలు సంగతి ఏంటంటే.. ప్రస్తుతం ప్రపంచంమొత్తం కరోనా వైరస్ తో వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోఅందరూ సోషల్ డిస్టెన్స్ ను మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా వల్ల మాస్క్, శానిటజైర్ జీవితంలో ఒక బాగం అయిపోయాయి. ఇంటినుండి బయటకు వచ్చేముందు ఖచ్చితంగా మాస్క్ లు ధరించాలని, ప్రతిఒక్కరు తమ భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడాలని సెలెబ్రిటీస్ దగ్గర నుండి సామాన్య ప్రజల వరకూ అందరూ పిలుపునిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'RRR' ట్రయిల్ షూట్ లో ట్విస్ట్.. క్యాన్సిల్ చేసే ఆలోచనలో రాజమౌళి..!

ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను దృష్టిలో పెట్టుకొని.. వాటిని పాటిస్తూ రాజమౌళి ట్రయిల్ షూట్ నిర్వహించడానికి సిద్ధమైనట్టు గత రెండు రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గండిపేట లేదా హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీ సమీపంలో నిర్మించిన సెట్లలో ఈ ట్రయల్ షూట్ జరుగనుందని... ఈ ట్రయల్ షూట్లో మొత్తం 50 మంది సిబ్బందిని మాత్రమే పాల్గొననున్నారని... అంతేకాదు ఈ షూటింగ్ లో తారక్, చరణ్ పాల్గొనడం లేదు. వారికి బదులుగా డూప్ లతో షూట్ ప్లాన్ చేసాడని కూడా అన్నారు. అయితే ఇప్పుడేమైందో తెలియదు కానీ రాజమౌళి తన ట్రయిల్ షూట్ ను క్యాన్సిల్ చేసే ఆలోచనలో వున్నాడట. దీనికి పలు కారణాలే వినిపిస్తున్నాయి. ఒక పక్క ఈ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చరణ్ ను పరిచయం చేయడానికి భయపడ్డా..!

స్టార్ హీరోల కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం అంటే డైరెక్టర్స్ కు అంత ఈజీ పని కాదు. అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను రీచ్ అవ్వాలి. అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో తెలీదు.. అలా వాళ్ళకి కావాల్సిన అన్ని ఎలిమింట్స్ వుండేలా చూసుకొని.. హీరోని పరిచయం చేస్తారు. ఇక హీరో భవిష్యత్తు అనేది తర్వాత తాను చేసే సినిమాలపై ఆధారపడి ఉంటుంది.

TFN Adminవాట్సాప్
Tollywood Ace Director SS Rajamouli To Resume Shooting Work Of His Magnam Opus RRR Soon
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ ప్రారంభించే పనుల్లో జక్కన్న..!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది. అయితే రాజమౌళి మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ గ్యాప్ లో కుదిరినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్, రాజమౌళి సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జక్కన్న మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ అయ్యాక సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలకృష్ణ తో సినిమా చేయాలనుకున్నా కానీ..!

ఒక డైరెక్టర్ కు అందరు హీరోలతో సినిమాలు చేయాలని ఉంటది. ఇక అందరు హీరోలకు కూడా ప్రతి డైరెక్టర్ తో సినిమా చేయాలనుకుంటారు. ఎందుకంటే ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ ఉంటది... ఒక్కో హీరో కి ఒక్కో స్టైల్ ఉంటది. కాబట్టి తమని తాము కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి కూడా అగ్ర హీరో అయిన బాలకృష్ణ తో సినిమా చేయాలనుకున్నాడట కానీ కుదరలేదట. ఈ విషయాన్ని జక్కన్న స్వయంగా తానే చెప్పాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆస్కార్ అవార్డ్స్ పై రాజమౌళి స్పందన

మూవీ అవార్డ్స్ లో ఆస్కార్ అవార్డ్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. మూవీ లోని పలు విభాగాలకు ఆస్కార్ అవార్డ్స్ అందజేయబడతాయి. 2020 సంవత్సరంలో "పారసైట్ " మూవీ ఉత్తమచిత్రం తోపాటు దర్శకుడు, స్క్రీన్ ప్లే విభాగాలలో ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంది. "పారసైట్ " మూవీ ని వీక్షించిన దర్శకుడు రాజమౌళి తనకు స్లో గా ఉండే మూవీస్ నచ్చవని, బోర్ కొట్టిందని, ఆ మూవీ చూస్తూ పడుకుండిపోయానని కామెంట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆర్ ఆర్ ఆర్’.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు.. వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన పోరాట యోధులు. నిజ జీవితంలో వీరిద్దరూ కలిసినట్లు చారిత్రక ఆధారాలు లేకపోయినా.. కలిస్తే ఎలా ఉంటుంది? అనే వినూత్నమైన ఆలోచనలోంచి పుట్టిన కథ‌కు తెర‌రూప‌మే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో.. కొమరం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ యన్టీఆర్, అల్లూరిగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా షూటింగ్ బ్రేక్ ప‌డింది. లాక్ డౌన్ అనంత‌రం.. చిత్రీక‌ర‌ణ‌ని పునఃప్రారంభించ‌నున్నారు.

Team TFNవాట్సాప్
Baahubali Director SS Rajamouli To Make A Movie With iSmart Hero Ram Pothineni
సినిమా వార్తలు

రామ్ తో రాజ‌మౌళి చిత్రం?

తెలుగునాట అప‌జ‌య‌మంటూ ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న 11 చిత్రాలను డైరెక్ట్ చేయ‌గా... ప్ర‌తీ సినిమా విజ‌య‌ఢంకా మ్రోగించింది. ప్ర‌స్తుతం ఈ స్టార్ డైరెక్ట‌ర్.. యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో పేట్రియాటిక్ డ్రామా `ఆర్ ఆర్ ఆర్`ని తెర‌కెక్కిస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2021 సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
SS Rajamouli Shares His Opinion About The Sneak Peek Trend
సినిమా వార్తలు

స్నీక్ పీక్ ట్రెండ్ గురించి రాజమౌళి స్పందన

హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై రూపొందిన"HIT" మూవీ 28వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. "HIT" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న (23 వ తేదీ ) జరిగింది. ఈ ఈవెంట్ లో ముఖ్య అతిథి గా పాల్గొన్న రాజమౌళి మాట్లాడుతూ .. "HIT" మూవీ టీజర్, ట్రైలర్ స్టైలిష్ గా ఉన్నాయని, ఈ మూవీ స్నీక్ పీక్ రిలీజ్ చేసినందుకు టీమ్ కు అభినందనలు తెలిపారు.

Team TFNవాట్సాప్

షేర్