
ట్యాగ్ · 14 కథనాలు


ఓదెల 2 తాండవం మొదలైంది, సునామీగా మారబోతోంది

ఓదెల 2 కథకి ట్రూ ఇన్‌స్పిరేషన్ అదే..

ఉమెన్ సెంట్రిక్ మూవీ లో అనసూయ

'సీటీమార్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
జైసల్మేర్ లో 'సీటీమార్' టీమ్
సీటీమార్ సెట్లో - ఫుల్ స్వింగ్ లో షూట్
'ఓదెల రైల్వేస్టేషన్' సెకండ్ షెడ్యూల్ స్టార్ట్
సీటీమార్ షూటింగ్ పై సంపత్ నంది క్లారిటీ
సంపత్‌నంది కథతో కె.కె.రాధామోహన్ కొత్త చిత్రం
సంపత్ నంది డ్రీమ్ ప్రాజెక్ట్

ఓదెల 2.. రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్ అయింది
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన రూటు మార్చి తొలిసారి నాగసాధువుగా నటించిన చిత్రం ‘ఓదెల-2’. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్‌గా సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు పరమశివుడి దర్శనం కల్పించింది.

ఓదెల 2 తాండవం మొదలైంది, సునామీగా మారబోతోంది
తమన్నా భాటియా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఓదెల 2. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం తమన్నా నాగ సాధువుగా అదరగొట్టారు. వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న విడుదలైన ఓదెల 2 అన్నిచోట్లా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఇది ఒక ప్రేతాత్మకి, పంచాక్షరి మంత్రానికి మధ్య జరిగే యుద్ధం
తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.

ఓదెల 2 కథకి ట్రూ ఇన్‌స్పిరేషన్ అదే..
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు, సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌గా మల్టిపుల్ రోల్స్‌లో వర్క్ చేశారు. అలాగే డైరెక్షన్ సూపర్ విజన్‌ని అందిస్తున్నారు.

ఉమెన్ సెంట్రిక్ మూవీ లో అనసూయ
బుల్లితెర పై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తూ బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “,మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఒక ఆంథాలజీ మూవీకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "గాడ్ ఫాదర్ "మూవీ లో అనసూయ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. ఇప్పుడు అనసూయ ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ లో హీరోయిన్ గా ఆఫర్ అందుకున్నారు.

'సీటీమార్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక ఈసినిమాను చూడటానికి ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
జైసల్మేర్ లో 'సీటీమార్' టీమ్
హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత ఏడాదే మొదలైంది. లాక్ డౌన్ కి ముందే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఇంకా పాటలు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
సీటీమార్ సెట్లో - ఫుల్ స్వింగ్ లో షూట్
హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. ఇక ఇటీవలే షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు చిత్ర యూనిట్. అంతేకాదు ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్ లో చేస్తున్న ఏర్పాట్లకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. అవసరమైన అన్నిజాగ్రత్తలు తీసుకుంటూ నాన్ స్టాప్‌గా షూటింగ్ జరిపి చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
'ఓదెల రైల్వేస్టేషన్' సెకండ్ షెడ్యూల్ స్టార్ట్
అశోక్ తేజ దర్శకుడిగా.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా 'ఓదెల రైల్వేస్టేషన్'. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్‌హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మొదటి షెడ్యూల్ పూర్తిచేసింది చిత్ర యూనిట్.మొదటి షెడ్యూల్‌లో కొన్ని సీన్లను ఓదెల ర్వైల్వేస్టేషన్లో చిత్రీకరించగా మరికొన్ని సన్నివేశాలను ఓదెల మండలంలో తెరకెక్కించారట.
సొంత ఊరి గురించి సంపత్ నంది - ప్రకృతికి ఏది సరితూగదు
అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతూ.. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ తెరకెక్కుతున్న థ్రిల్లర్ సినిమా 'ఓదెల రైల్వేస్టేషన్'. కన్నడలో 25 చిత్రాలకు పైగా నటించిన వశిష్ట సింహ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్యమైన పాత్రలో హీరోయిన్ హెభా పటేల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు డీ గ్లామర్ పాత్రలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు కూడా చిత్రయూనిట్. ప్రస్తుతం తెలంగాణలోని ఓదెల ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది.
సీటీమార్ షూటింగ్ పై సంపత్ నంది క్లారిటీ
హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్‌లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
సంపత్ నంది 'థ్రిల్లర్' - 'ఓదెల రైల్వేస్టేషన్'
సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్‌హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది.
సంపత్‌నంది కథతో కె.కె.రాధామోహన్ కొత్త చిత్రం
ప్రస్తుతం సంపత్ నంది హీరో గోపీచంద్ తో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సంవత్సరంలో మొదలయిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
సంపత్ నంది డ్రీమ్ ప్రాజెక్ట్
సూపర్ హిట్ "ఏమైంది ఈ వేళ " మూవీ తో సంపత్ నంది దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రైటర్, డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన "రచ్చ ","బెంగాల్ టైగర్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన యాక్షన్ మూవీ "గౌతమ్ నంద" నిరాశ పరిచింది. సంపత్ నంది ప్రస్తుతం గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్" మూవీ రూపొందిస్తున్నారు.